తులసి రెడ్డిపై న్యాయవాదుల దాడి
కర్నూలు: 20 సూత్రాల అమలు పథకం చైర్మన్ ఎన్.తులసిరెడ్డికి కర్నూలులో చేదు అనుభవం ఎదురైంది. సమైక్యాంధ్రవాదులైన న్యాయవాదులు అతనిపై దాడి చేశారు. అతని వాహనం ధ్వంసం చేశారు. జెఎసి న్యాయవాదులపై తులసి రెడ్డి అనుచరులు ఎదురు దాడికి దిగారు. దాంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.
కాటసాని రాంభూపాల్ రెడ్డి దీక్షా శిబిరం వద్దకు తులసిరెడ్డి వెళ్లారు. ఆ సమయంలో సీమాంధ్ర న్యాయవాదుల జెఎసి నేతలు పదవికి రాజీనామా చేయాలని తులసి రెడ్డిపై దాడికి దిగారు. ఈ సందర్భంగా న్యాయవాదులు, తులసిరెడ్డి పరస్పరం దూషించుకున్నారు.