పుట్టెడు దుఃఖంలోనూ పరీక్షకు..
రాయదుర్గం రూరల్ : కదరంపల్లి గ్రామసమీపంలో బుధవారం తెల్లవారుజామున ఆటోను లారీ ఢీకొన్న ప్రమాదంలో ఆవులదట్లకు చెందిన వన్నూరమ్మ (45) మరణించింది. కుమారుడు సతీష్ పుట్టెడు దుఃఖంలో ఉన్నా బాధను దిగమింగుకుని రాయదుర్గంలోని మోడల్స్కూల్లో జరిగిన జూనియర్ ఇంటర్ (సీఈసీ) పరీక్షకు హాజరయ్యాడు. పరీక్ష ముగియగానే తల్లిని కడసారి చూపు చూసేందుకు పరుగులు తీశాడు. నువ్వు లేని జీవితం నాకొద్దు అంటూ తల్లి మృతదేహాంపై పడి గుండెలవిసేలా రోదించడం చూసి అక్కడున్న వారు కంటతడి పెట్టారు.