audiotorium
-
సంఘటిత చైతన్యంతోనే హక్కుల పరిరక్షణ
వనపర్తిటౌన్ : సంఘటితంగా చైతన్యమైతేనే మహిళల హక్కుల పరిరక్షణ సాధ్యమవుతుందని ఉస్మానియా యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ రమా మెల్కోటే అన్నారు. శని వారం వనపర్తిలోని వివేకానంద ఆడిటోరియంలో జనశ్రీ సంఘర్ష్ మహిళా వేదిక ఆ ధ్వర్యంలో ‘మహిళ లేని చరిత్ర లేదు’ అనే అంశంపై ఏర్పాటు చేసిన సభలో ఆమె మా ట్లాడారు. ప్రపంచ మహిళాదినోత్సవం కంటే ముందు.. తర్వాత చేసిన ప్రతి ఉద్యమంలో మహిళల పాత్ర ఎనలేనిదని పేర్కొన్నారు. వివక్షకు గురవుతున్న మహిళలే అన్యాయాన్ని ఎదుర్కోవడానికి ఉద్యమించాలని చెప్పారు. వ్యవస్థలో మార్పు కోసం మహిళలు నడుం కట్టాలన్నారు. సమరశీల మహిళా ఉద్యమాలతో పాటు దళిత బహుజన ఉద్యమాలను గుర్తించాలన్నారు. చట్టసభలోని అసెంబ్లీ, పార్లమెంట్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. మహిళలు మూఢనమ్మకాల బారిన పడకుండా చైతన్యవంతులుగా ఎదగాలన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ కొల్లాపురం విమల మాట్లాడుతూ మహిళ లేని చరిత్ర లేదని, తెలంగాణ ఉద్యమం వృత్తి పని చేసుకునే స్త్రీ ఐలమ్మ రూపంలో పురుడు పోసుకుందన్నారు. తెలంగాణ ఉద్యమంలో మహిళల పాత్ర లేకుంటే తెలంగాణ వచ్చి ఉండేది కాదని చెప్పక తప్పదన్నారు. పాలమూరు జిల్లాలో 7వ శతాబ్దంలో తెలుగులో కథనా లు చేసిన చరిత్ర ఈ జిల్లా మహిళలకే ఉందన్నారు. నేటి తరం యువతీ యువకులు అధ్యయన కేంద్రాలుగా ఏర్పడి మహిళల సమస్యల పట్ల దృష్టి సారించాలని సూచిం చారు. కార్యక్రమంలో జనశ్రీ సంఘర్ష్ వేదిక ప్రతినిధులు కె.శారద, పుష్పలత, హసీనాబేగం, శోభారాణి, కౌన్సిలర్లు నందిమల్ల శారద, నారాయణదాస్ జ్యోతి, భువనేశ్వరి, మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ వరలక్ష్మి, కవయిత్రి మీనాకుమారి, ఎస్టీ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ రాధ, సరస్వతి, సుకన్య తదితరులు పాల్గొన్నారు. -
లోకాలకు వెలుగు ప్రసాదించేదే క్రిస్మస్
కర్నూలు అగ్రికల్చర్ : క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రభుత్వం తరపున క్రైస్తవులకు మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో ఘనంగా హైటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలువురు చర్చిల పాస్టర్లు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా యేసుక్రీస్తు జయంతిని పురస్కరించుకుని జిల్లా కలెక్టర్ సీహెచ్.విజయమోహన్ కేక్‌ను కట్ చేశారు. క్రిస్మస్ వేడుకలను పురస్కరించుకుని క్యాండిలైటింగ్ కార్యక్రమం నిర్వహించారు. క్రీస్తు పాటలను ఆలపిస్తూ యువకులు, చిన్నారులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. క్రిస్మస్ తాత వేషధారణలతో పలువురు చిన్నారులు ఆహుతులను ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ యేసు జన్మదినం ప్రపంచ దేశాలకే పండుగ వంటిదని ఆయన రాకతోనే సర్వమానవాళికి ముక్తిమార్గమన్నారు. క్రిస్మస్ పర్వదినాన్ని జరుపుకుంటున్న క్రైస్తవులందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. పలువురు చర్చి పాస్టర్లు మాట్లాడుతూ మానవజాతిని వెలుగులోకి నడిపించే పండుగే క్రిస్మస్ అంటూ పేర్కొన్నారు. జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి షేక్ మస్తాన్‌వలి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో నగరంలోని ప్రముఖ చర్చిల పాస్టర్లు, పలువురు క్రైస్తవులు, ముస్లిం మైనార్టీ ప్రముఖులు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
రాజధాని.. మన హక్కు
అనంతపురం ఎడ్యుకేషన్ : ‘ఆంధ్ర, తెలంగాణ విలీన సమయంలో ఒప్పందం మేరకు రాజధానిని కర్నూలు నుంచి హైదరాబాద్‌కు తరలించారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన నేపథ్యంలో ఇప్పుడు రాజధాని అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. నాడు ఏ భౌగోళిక సరిహద్దులతో కర్నూలు రాజధానిగా ఏర్పడిందో...ఈ రోజు దాదాపు అదే భౌగోళిక సరిహద్దులతో అవశేషాంధ్రప్రదేశ్ ఏర్పడింది. అయితే, రాజధానిని మాత్రం కోస్తా ప్రాంతానికి తరలించేందుకు పాలకులు కుట్ర పన్నుతున్నారు. ‘ఆ రోజు మేం (రాయలసీమ వాసులం) రాజధానిని త్యాగం చేశాం...ఈ రోజు మా రాజధానిని మాకిచ్చేయండి. రాజధాని మనహక్కుగా భావించి పాలకులను నిలదీయాల్సిన సమయం ఆసన్నమైంది’ అని మేధావులు పిలుపునిచ్చారు. ఆదివారం శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలోని భువన విజయం ఆడిటోరియంలో రాయలసీమలో రాజధాని సాధన కోసం మేధోమదనం పేరిట సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా హైకోర్టు రిటైర్డ్ జడ్జి లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ.. ‘ ప్రస్తుత పరిస్థితుల్లో ఏమాత్రం అజాగ్రత్త చేసినా రాయలసీమ ఎడారిగా మారే ప్రమాదముంది. పాలకులు కూడా నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. అభివృద్ధిని ఒక ప్రాంతానికే పరిమితం చేయరాదు. 1956లో రాయలసీమ ప్రజలు రాజధానిని త్యాగం చేశారు. ఈ రోజు అదే రాజధానిని ఇక్కడికి కాకుండా మరో ప్రాంతానికి ఎలా తరలిస్తారు? ’ అని ప్రశ్నించార పథకం ప్రకారమే తరలింపు యత్నం రాజధానిని కోస్తా ప్రాంతానికి తరలించేందుకు పథకం ప్రకారం ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు మేల్కొనకపోతే భావితరాలకు భవిష్యత్తు ఉండదు. రాజధానిని సాధించుకోకపోతే చివరకు నీటి హక్కులు కూడా కోల్పోతాం. రాయలసీమలో రాజధాని కోసం చేసే ఉద్యమానికి ‘అనంత’ చుక్కానిలా ఉండాలి. - శ్రీధర్‌రెడ్డి, వైఎస్సార్సీపీ నాయకుడు రూ.వంద కోట్లు వసూలు చేసిస్తాం పాలకులను న్యాయం చేయమని కోరం. కాకపోతే అన్యాయం చేయొద్దని చేతులెత్తి మొక్కుతాం. అన్నీ అనుకూలంగా ఉన్నాయి కాబట్టే ఆ రోజు కర్నూలును రాజధాని చేశారు. రాయలసీమ ప్రాంతంలో రాజధాని ఏర్పాటుకు మేమూ, మా విద్యార్థులూ వందకోట్లు విరాళాలు సేకరించి ఇస్తాం. - కే. మల్లికార్జునరెడ్డి, చరిత్ర శాఖాధిపతి, ఎస్కేయూ రాజధాని మన హక్కు రాజధాని రాయలసీమ వాసుల హక్కు. తొలి సభ నాగార్జున యూనివర్సిటీలో నిర్వహించిన చంద్రబాబునాయుడు రాజధాని విజయవాడలో ఏర్పాటవుతున్నట్లు మీడియాకు లీకులిచ్చారు. ఇంత జరుగుతున్నా...ఈ ప్రాంత ప్రజా ప్రతినిధులు స్పందించడం లేదు. ఇక నాయకులతో పనిలేదు. అన్ని వర్గాల ప్రజలూ రోడ్డెక్కెల్సిన సమయం ఆసన్నమైంది. - డాక్టర్ మధుసూదన్‌రెడ్డి, రాయలసీమ సాధన పోరాట సమితి సభ్యుడు విభజనతో కన్నీటి సీమగా మారింది రాష్ట్ర విభజనతో రాయలసీమ కన్నీటి సీమగా మారింది. రియల్టర్లు పెట్టుబడులు పెట్టిన ప్రాంతంలో రాజధాని ఏర్పాటు చేయాలని పాలకులు చూస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోం. కచ్చితంగా రాయలసీమలోనే రాజధాని ఏర్పాటు చేయాలి. ప్రజలందరూ కలిసికట్టుగా ఉద్యమించి ప్రభుత్వ కుట్రను తిప్పికొట్టాలి. - సునీత, ఉపాధ్యాయురాలు ప్రకృతి వైపరీత్యాల ప్రభావం లేని నగరం భూకంపాలు, వరదలు, తుఫాను తాకిడి లేని నగరం కర్నూలు. కోస్తా ప్రాంతానికి రాజధాని తరలింపు యత్నాలను ప్రాణాలొడ్డైనా సరే అడ్డుకోకపోతే, ఈ ప్రాంత అభివృద్ధిని చేజేతులా నాశనం చేసిన వారవుతాం. రాజధానిని రాయలసీమలో ఏర్పాటు చేసేలా ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధం కండి. - చంద్రశేఖర్ కల్కూర, తెలుగు భాషా వికాస ఉద్యమం అధ్యక్షుడు