సంఘటిత చైతన్యంతోనే హక్కుల పరిరక్షణ | collective rights | Sakshi
Sakshi News home page

సంఘటిత చైతన్యంతోనే హక్కుల పరిరక్షణ

Mar 8 2015 2:01 AM | Updated on Sep 2 2017 10:28 PM

సంఘటితంగా చైతన్యమైతేనే మహిళల హక్కుల పరిరక్షణ సాధ్యమవుతుందని ఉస్మానియా యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ రమా మెల్కోటే అన్నారు.

 వనపర్తిటౌన్ : సంఘటితంగా చైతన్యమైతేనే మహిళల హక్కుల పరిరక్షణ సాధ్యమవుతుందని ఉస్మానియా యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ రమా మెల్కోటే అన్నారు. శని వారం వనపర్తిలోని వివేకానంద ఆడిటోరియంలో జనశ్రీ సంఘర్ష్ మహిళా వేదిక ఆ ధ్వర్యంలో ‘మహిళ లేని చరిత్ర లేదు’ అనే అంశంపై ఏర్పాటు చేసిన సభలో ఆమె మా ట్లాడారు. ప్రపంచ మహిళాదినోత్సవం కంటే ముందు.. తర్వాత చేసిన ప్రతి ఉద్యమంలో మహిళల పాత్ర ఎనలేనిదని పేర్కొన్నారు. వివక్షకు గురవుతున్న మహిళలే అన్యాయాన్ని ఎదుర్కోవడానికి ఉద్యమించాలని చెప్పారు. వ్యవస్థలో మార్పు కోసం మహిళలు నడుం కట్టాలన్నారు.
 
  సమరశీల మహిళా ఉద్యమాలతో పాటు దళిత బహుజన ఉద్యమాలను గుర్తించాలన్నారు. చట్టసభలోని అసెంబ్లీ, పార్లమెంట్‌లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. మహిళలు మూఢనమ్మకాల బారిన పడకుండా చైతన్యవంతులుగా ఎదగాలన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ కొల్లాపురం విమల మాట్లాడుతూ మహిళ లేని చరిత్ర లేదని, తెలంగాణ ఉద్యమం వృత్తి పని చేసుకునే స్త్రీ ఐలమ్మ రూపంలో పురుడు పోసుకుందన్నారు. తెలంగాణ ఉద్యమంలో మహిళల పాత్ర లేకుంటే తెలంగాణ వచ్చి ఉండేది కాదని చెప్పక తప్పదన్నారు.
 
 పాలమూరు జిల్లాలో 7వ శతాబ్దంలో తెలుగులో కథనా లు చేసిన చరిత్ర ఈ జిల్లా మహిళలకే ఉందన్నారు. నేటి తరం యువతీ యువకులు అధ్యయన కేంద్రాలుగా ఏర్పడి మహిళల సమస్యల పట్ల దృష్టి సారించాలని సూచిం చారు.  కార్యక్రమంలో జనశ్రీ సంఘర్ష్ వేదిక ప్రతినిధులు కె.శారద, పుష్పలత, హసీనాబేగం, శోభారాణి, కౌన్సిలర్లు నందిమల్ల శారద, నారాయణదాస్ జ్యోతి, భువనేశ్వరి, మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ వరలక్ష్మి, కవయిత్రి మీనాకుమారి, ఎస్టీ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ రాధ, సరస్వతి, సుకన్య తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement