Avaneendra
-
నా కోసం రానా అఘోరగా నటించాడు : హీరో నవదీప్
‘లవ్ మౌళి’కథను సరదాగా నా స్నేహితుడు రానాకు చెప్పాను. స్టోరీ మొత్తం విన్నాక.. చాలా బాగుందని చెప్పి అందులోని అఘోర పాత్రను చేశాను. నిజంగా చెప్పాలంటే రానాకు ఆ పాత్ర చేయాల్సిన అవసరం లేదు. కానీ నా కోసం చేశాడు. ఈ సినిమాలో రానా అఘోరగా నటించాడని ఇంతవరకు రివీల్ చేయలేదు. ఎందుకంటే దీనిని కమర్షియల్‌గా వాడుకోవడం ఇష్టం లేదు’అని అన్నారు హీరో నవదీప్. చాలా తర్వాత నవదీప్ హీరోగా నటించిన చిత్రం ‘లవ్ మౌళి’.రాజమౌళి శిష్యుడు అవనీంద్ర ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. జూన్ 7న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా హీరో నవదీప్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..⇒ నా కెరీర్ ప్రారంభమైనప్పుడు.. మంచి జెట్‌స్పీడులో వెళ్లింది. వరుసగా చేసుకూంటూ వెళ్లాను. ఆ తరువాత అన్ని తరహా పాత్రలు చేశాను. ఇప్పుడు జనాల నా గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకున్నాను. వాళ్లు నా గురించి ఆలోచించే తరహాలో మార్పు ఉన్నప్పుడు మనం కూడా మరాలి అనిపించింది. అందుకే నాకు కూడా వాళ్ల ఆలోచన తగిన విధంగా కెరీర్‌ను మార్చకోవాలినిపించింది. ఆ తరుణంలో విన్న కథే లవ్,మౌళి. ఈ సినిమా కోసం అన్ని మార్చుకున్నాను.⇒ ఈ సినిమా షూటింగ్ మొత్తం మేఘాలయాలోని చిరపుంజీలో చేయడం పెద్ద సాహసం అని చెప్పాలి. ఎన్నో వ్యయ ప్రయాసాలతో షూటింగ్ చేశాం. ఎప్పూడు వర్షం పడే ఆ ప్లేస్‌లో సినిమా మీద పాషన్‌తో చిత్రీకరణ చేశాం. రెండున్నర సంవత్సరాలు నేను కూడా అదె గెటప్‌లో వున్నాను. సినిమా కోసం అందరం కష్టపడి తీశాం. లవ్ మౌళి సినిమా మేకింగ్ అంతా ఓ సాహసం అని చెప్పాలి.⇒ ఇది రెగ్యులర్ లవ్‌స్టోరీ కాదు. ఈ సినిమా అందరికి కొత్త అనుభూతినిస్తుంది. ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది. ముఖ్యంగా యూత్‌కు ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది. ఈ సినిమా తెలుగులో కాకుండా మరో భాషల్లో వచ్చి ఉంటే చూసే కోణంలో కూడా తేడా వుండేదెమో.. ఈ సినిమా అందరికి ఎక్కడో ఒక దగ్గర కనెక్ట్ అవుతుది.⇒ ఈ సినిమా కోసం నేను, దర్శకుడు సింక్‌లో ఉండి ప్రిపేర్ అయ్యాం. నేను ఏ సినిమా చేసినా ఆ పాత్రకు తగ్గట్టుగా ప్రిపేర్ అయ్యే వాడిని. ఈ సినిమాతో విజయం నా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అవుతుందని అనుకుంటున్నాను.⇒ ఈ సినిమాలో నేపథ్యం సంగీతం హైలైట్ అని చెప్పాలి. సన్నివేశానికి ఎలివెట్ చేసే విధంగా చాలా మంచి పాటలతో పాటు నేపథ్య సంగీతం ఇచ్చాడు. ఈ సినిమాకు నేపథ్య సంగీతం ప్రాణం పోసింది. లవ్‌మౌళి ఎక్స్పీరియన్స్ అందరికి కొత్త అనుభూతిని ఇస్తుంది.⇒ నా రియల్‌లైఫ్‌లో ఎన్నో ప్రేమకథలు ఉన్నాయి. 23 ఏళ్ల నుండి రకరకాల మనుషులను ప్రేమించాను. పర్సనల్‌గా కూడా ఈ సినిమా కథ నాకు ఎంతో కనెక్ట్ అయ్యింది. సినిమా దర్శకుడు కూడా తన వ్యక్తిగత అనుభవాలను ఇందులో చూపించాడు. అతని ఆలోచనలకు దగ్గర ఈ సినిమా ఉంటుంది. మనం ఏంటో తెలుసుకుని ప్రశాంతంగా ఉండి.. అవతలి వాళ్లను కూడా ప్రశాంతంగా ఉంచితే.. బాగుంటుంది.⇒ న్యూసెన్స్ 2 వెబ్‌సీరిస్‌తో పాటు తమిళంలో నిత్యమీనన్‌తో ఓ సినిమా చేస్తున్నాను. దీంతో పాటు మరికొన్ని వెబ్‌సీరిస్‌లు రిలీజ్‌కు సిద్దంగా ఉన్నాయి. ఇక నుంచి సోలో హీరోగా మంచి కథలతో రావాలనుకుంటున్నాను. లవ్, మౌళికి వచ్చిన స్పందన బట్టి నా తదుపరి చిత్రాల ఎంపిక ఆధారపడి ఉంటుంది. -
అందుకే బోల్డ్ సీన్స్ పెట్టాను : ‘లవ్ మౌళి’ దర్శకుడు
‘సాధారణంగా ఒక కథ రాస్తున్నప్పుడు ఒకరిని ఊహించుకుంటాం. కానీ లవ్‌మౌళి కథ రాస్తున్నప్పుడు అలా ఊహించుకోలేదు. ఒక నవలలా రాసేశాను. ఆ తర్వాత ఇండస్ట్రీలో ఉన్న యంగ్ హీరోలందరినీ ఈ కథకి ఊహించుకుంటూ వచ్చా. అయితే ఆ ఫొటోలలో అప్పుడు నవదీప్ ఫొటో లేదు. అప్పుడు నవదీప్ కూడా అంత యాక్టివ్‌గా సినిమాలు చేయడం లేదు. ఓసారి నాకెందుకో నవదీప్ అయితే అనే ఆలోచన వచ్చింది. నా ఆలోచనలన్నీ అతనిపై పెట్టి.. ఆ తర్వాత వెళ్లి కథ చెప్పా. కథ వినగానే ఎగిరి గంతేశాడు’అని అన్నాడు డైరెక్టర్ అవనీంద్ర. ఆయన దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘లవ్ మౌళి’. నవదీప్ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని నైరా క్రియేషన్స్ మరియు శ్రీకర స్టూడియోస్ బ్యానర్స్‌తో కలిసి టాలీవుడ్ టాలెంటెడ్ టెక్నిషియన్స్‌కి అడ్డాగా మారిన సి స్పేస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. జూన్ 7న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో డైరెక్టర్ అవనీంద్ర మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..→ ఈ కథ అనుకున్నప్పుడు నేను ‘ఆర్ఆర్ఆర్’ రైటింగ్‌లో ఉన్నాను. నేను ఆ సినిమాకు అసోసియేట్ రైటర్ని. అప్పుడే మా టీమ్ అంతా నువ్వు డైరెక్ట్ చేసే సమయం ఆసన్నమైందంటూ ప్రోత్సహించారు. అయితే నేను కమర్షియల్ కథలు ఎన్నో అప్పటికే రాసేశాను. ఏ కథ రాస్తే బాగుంటుందా? అని ఆలోచిస్తూ కొత్తగా ఏదైనా ప్రేక్షకులకు రిఫ్రెష్ అనిపించేలా ఉండాలని అనుకున్నాను. ఒకవైపు ఆర్ఆర్ఆర్ రాస్తున్నప్పుడే పేరలల్‌గా ఈ పాయింట్ అనుకున్నాను. ఆర్ఆర్ఆర్తో పాటు అప్పటికే ఓకే చేసిన కథలన్నీ పూర్తి చేసి ఈ కథపై కూర్చున్నా.→ ఈ కథలో అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. కొంతమంది లొకేషన్స్, కొంతమంది హీరోయిన్ క్యారెక్టరైజేషన్.. ఇలా ప్రతి ఒక్కరూ కనెక్ట్ అయ్యారు. ముఖ్యంగా అమ్మాయిలు ఈ సినిమాకు బాగా కనెక్ట్ అయ్యారు.→ ఇది నా ఫస్ట్ సినిమా. నిజాయితీగా ఓ మంచి కథను చెప్పాలని నిర్ణయం తీసుకున్నా. రిజల్ట్ తో సంబంధం లేదు.. 10 ఏళ్ల తర్వాత వెనక్కి తిరిగి చూసుకున్నా.. ఫస్ట్ సినిమా నిజాయితీగా చేశానని చెప్పుకోవడానికి ఉంటుందని అనుకున్నా.→ ఈ సినిమాలో హీరోకి లో దుస్తుల్లో మందు తాగే సీన్ ఉంటుంది. లో దుస్తులని పబ్లిగ్గా ఆరేయడానికి సంకోచించే మైండ్ మనది. నాకున్న స్క్రీన్‌ప్లే టైమ్‌ని దృష్టిలో పెట్టుకుని.. హీరో క్యారెక్టర్ ఇదని చెప్పడం కోసమే.. హీరో ఇన్నర్ దుస్తుల్లో మందు తాగడం చూపించడం జరిగింది. ఇందులో హీరోకి ఎటువంటి సెన్సిబిలిటీస్ ఉండవు. నిజంగా అలాంటి సీన్ డిస్టర్బ్‌గా అనిపిస్తే సెన్సార్ వాళ్లు చూసుకుంటారు. వైజాగ్‌లో షోకి 50 శాతం అమ్మాయిలే వచ్చారు. ఎవరూ ఒక్కరు కూడా ప్రశ్నించలేదు. పోస్టర్లో అలా అనిపిస్తుంది కానీ.. సినిమా చూశాక అందరికీ ఆ సీన్ అర్థమవుతుంది. 18ప్లస్‌కి అవసరమైన కథ ఇది.→ ఇది ఫాంటసీ బేస్ స్టోరీ.. ఒక ఆర్టిస్ట్ తన కాన్వాస్ మీద ఊహా చిత్రం వేస్తే.. అందులో నుంచి ఆ అమ్మాయి బయటికి వచ్చేస్తుంది. అందుకే కొత్త హీరోయిన్లని తీసుకోవడం జరిగింది. ఆడియన్స్ కూడా నిజంగానే వచ్చేసిందనే ఫీల్ పొందాలి. ఒకవేళ తెలిసిన హీరోయిన్ అయితే.. ఆడియన్ ఆ ఫీల్ పొందలేరు. అందుకే కొత్తవాళ్లని తీసుకున్నాం.→ రిలేషన్లో ఒక జంట రెండు సంవత్సరాలు హ్యాపీగా ఉన్న తర్వాత.. వారిద్దరి మధ్య ఎందుకు అంత ప్రేమ ఉండటం లేదు. ఎందుకు ఆ రిలేషన్ బ్రేక్ అవుతుంది అన్నప్పుడు నాకో ఆలోచన వచ్చింది. ఈ పాయింట్ అందరికీ నచ్చుతుందని లవ్ స్టోరీగా ఈ సినిమా తెరకెక్కించాను. లస్ట్ కోసం కాదు లవ్ కోసం చేసిన సినిమా ఇది.→ నా దృష్టిలో ప్రేమంటే నాకు నచ్చినట్టు ఉండమనడం కాదు.. నాకు నచ్చకపోయినా.. నిన్ను నీలా ఉండనీయడం ప్రేమ. అదే ఈ సినిమా ద్వారా చెప్పాను.→ విజయేంద్ర ప్రసాద్‌గారికి ఈ కథ చెప్పినప్పుడు బూతులు తిట్టారు. ఎందుకురా నీకు ఇది. కమర్షియల్‌గా వెళ్లకపోయావ్ అని అన్నారు. మా ఇద్దరి మధ్య తండ్రీ కొడుకుల అనుబంధం ఉంటుంది. నన్ను ఆయనకి దత్తపుత్రుడు అనే వారు. అంత చనువు ఉంది ఆయన దగ్గర. నా దృష్టిలో ఇది కమర్షియల్ సినిమా. కమర్షియల్ సినిమాలు రాసిన అలవాటుతో ఈ కథ రాశాను. షూటింగ్ అయిన తర్వాత ఒక వీడియో ప్రసాద్‌గారికి చూపించాను. కీరవాణిగారికి చూపించాను.. ఆశ్చర్యపోయారు.→ ఇందులో బోల్డ్ డైలాగ్స్, లిప్ లాక్స్ బోలెడన్నీ ఉంటాయి. అవన్నీ కావాలని పెట్టినవి కాదు. కథకు అవసరమై పెట్టినవే. కమర్షియల్ మీటర్ తెలిసిన వాడిని కాబట్టి.. కథ రాసుకుంటున్నప్పుడు ఈ కథతో ఆడియన్స్‌ని రంజింపచేయడానికి అవసరమైన వన్నీ చేర్చడం జరిగింది. కరోనా తర్వాత జనాలు ప్రపంచ సినిమాను చూస్తున్నాను. టాలీవుడ్ ఇండస్ట్రీ ఇంకా ఐటమ్ సాంగ్స్ దగ్గరే ఉంది. ఈ కథకి అన్ని అలా కుదిరాయ్.→ ప్రేమతో ప్రశాంతంగా లవ్ మూడ్‌లో కూర్చున్న శివుడిని మౌళి అంటారు. ఈ సినిమాకు ఆ పేరు పెట్టడానికి కూడా ఓ కారణం ఉంది. అది సినిమా చూసిన తర్వాత అందరికీ తెలుస్తుంది. ఈ స్టోరీకి చాలా ప్రత్యేకత ఉంటుంది. 20 సంవత్సరాల తర్వాత కూడా ఈ స్టోరీని మార్చడానికి ఏం ఉండదు.