శ్రీవారి ఆలయంపై విమానం
తిరుమల: గగనతలంపై తిరుమల ఆలయానికి సమీపాన సోమవారం సాయంత్రం ఓ విమానం వెళ్లింది. ఆగమశాస్త్ర నిబంధనల ప్రకారం తిరుమల ఆలయం మీదుగా విమానాలు వెళ్లకూడదని అర్చకులు, పండితులు, పీఠాధిపతులు చెబుతున్నారు. దీనిపై ఇప్పటికే ఎన్నోరకాల అభ్యంతరాలు వెళ్లాయి.
అయినప్పటికీ కేంద్ర విమానయానశాఖ స్పందించలేదు. తిరుమలకు సమీపంలోనే తిరుపతి విమానాశ్రయం ఉందనీ, అందువల్ల తిరుమల ఆలయ గగనతలంపై విమానాలు రాకపోకలు నిషేధించలేమంటోంది. దీంతో నిత్యం గగనతలంపై ఆలయానికి సమీపంలో విమానాలు రాకపోకలు సాగిస్తుండడంపై భక్తులతోపాటు పీఠాధిపతులు, అర్చకులు, పండితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.