Awareness event
-
బీచ్‌లో ఒకేసారి 2500 మంది ఫొటో షూట్.. ఎందుకో తెలుసా?
చర్మ క్యాన్సర్‌పై అవగాహన కల్పించేందుకు కొంత మంది వినూత్న కార్యక్రమం చేపట్టారు. బీచ్‌లో ఏకంగా 2500 మంది నగ్న ఫోటోషూట్‌లో పాల్గొన్నారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా చర్మ క్యాన్సర్‌పై ఫోకస్ పెట్టాలని పిలుపునిచ్చారు. వివరాల ప్రకారం.. ఆస్ట్రేలియాలో చర్మ క్యాన్సర్ బాధితులు ఎక్కువగా ఉన్నారు. దీంతో, చర్మ క్యాన్సర్‌పై అవగాహన కల్పించే ఉద్దేశ్యంతో సిడ్నీలో ఉన్న బాండీ బీచ్ వద్ద శనివారం ఉదయం సుమారు 2500 మంది ఒంటిపై దుస్తులు లేకుండా ఫోటోషూట్‌లో పాల్గొన్నారు. చర్మ క్యాన్సర్‌పై అవగాహన కోసమే ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్టు వారు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. కాగా, ఈ వినూత్న కార్యక్రమాన్ని అమెరికా ఫొటోగ్రాఫర్ స్పెన్సర్ టునిక్ ఈ ప్రాజెక్టును చేపట్టారు. అయితే అక్కడ ప్రజల్లో అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో ఈ ఈవెంట్ నిర్వహించారు. ఇదిలా ఉండగా.. బీచ్‌ల్లో నగ్నంగా తిరిగేందుకు ఇటీవలే ఆస్ట్రేలియా ప్రభుత్వం చట్టం చేసింది. దీంతో, వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. BREAKING: #BNNAustralia Reports. In an effort to raise awareness about skin cancer, over 2,500 people got nude on Saturday to pose for Spencer Tunick, U.S. photographic artist at Sydney's Bondi Beach, in Australia. #Australia #Sydney #Cancer #Health #Photoshoot pic.twitter.com/v2Uwdzse6a — Gurbaksh Singh Chahal (@gchahal) November 26, 2022 -
టెంపాలో నాట్స్ ఆరోగ్య అవగాహన సదస్సు
ఫ్లోరిడా : అమెరికాలో తెలుగుజాతి కోసం అనేక కార్యక్రమాలతో దూసుకువెళ్తున్నఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్).. తాజాగా టెంపాలో ఆరోగ్య అవగాహన సదస్సు నిర్వహించింది. స్థానికంగా ఉండే తెలుగువారు ఈ సదస్సుకు హాజరై విలువైన అంశాలు తెలుసుకున్నారు. ఆరోగ్యంగా పదికాలాల పాటు ఎలా ఉండాలనే దానిపై స్థానిక ప్రముఖ వైద్యులు ఎన్నో విలువైన సూచనలు చేశారు. గుండె వైద్య నిపుణులు డాక్టర్ నరేంద్ర శాస్త్రి గుండెను పదిలంగా ఉంచుకోవాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. గుండె జబ్బులు రాకుండా ఉండాలంటే జీవన శైలిలో ఎలాంటి మార్పులు చేసుకోవాలో సూచించారు. తరచూ వైద్య పరీక్షలు చేయించుకోవడం వల్ల ప్రమాదకరమైన క్యాన్సర్ లాంటి వ్యాధులను ఆదిలోనే గుర్తించవచ్చని డాక్టర్ అనిత కొల్లి తెలిపారు. ముఖ్యంగా మహిళలు బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహన పెంచుకుని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. డాక్టర్ నవీన వింధ్య చిన్న పిల్లల ఆరోగ్య విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. నాట్స్ టెంపా బే చాప్టర్ కో ఆర్డినేటర్ రాజేష్ కుండ్రు నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఈ ఆరోగ్య అవగాహన సదస్సును నాట్స్ వాలంటీర్లు సహాయ సహాకారాలు అందించి విజయవంతం చేశారు. నాట్స్ బోర్డు సభ్యులు ప్రశాంత్ పిన్నమ్మనేని, బోర్డు చైర్మన్ శ్రీనివాస్ గుత్తికొండ కూడా ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు. నాట్స్ ఛైర్మన్ శ్రీనివాస్ గుత్తికొండ సదస్సు నిర్వహణకు కీలక పాత్ర పోషించిన వారిని ప్రత్యేకంగా అభినందించారు. -
ఆకస్మిక హృద్రోగ సమస్యలపై అవగాహన
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) మరియు ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్) సంయుక్తంగా ‘ప్రాణ రక్షణ ప్రక్రియలో శిక్షణ’ (సిపిఆర్ ట్రైనింగ్) కార్యక్రమాన్ని శనివారం అర్వింగ్ లోన బిర్యానీ పాట్ ప్రాంగణంలో నిర్వహించారు. ఆకస్మికంగా గుండె ఆగి కుప్పకూలి మరణించిన వారి గురించి మనం నిత్యం వింటూ ఉంటాము. ఇలాంటి సంఘటన బహిరంగ ప్రదేశంలో జరిగితే ఎలా స్పందించాలో మనలో చాలామందికి తెలియదంటే ఆశ్యర్యం లేదు. ప్రపంచవ్యాప్తంగా కేవలం ఆరు శాత్ం మాత్రమే ఇలా బహిరంగ ప్రదేశంలో కుప్పకూలినా.. మరణం నుంచి తప్పించుకున్నట్లు గణాంకాలు చెబుత్నున్నాయి. సరైన సమయానికి ప్రాణ రక్షణ ప్రక్రియలో అవగాహన లేకపోవడం ప్రధాన కారణమని నిపుణుల అభిప్రాయం. సిపిఆర్ శిక్షణలో ధృవీకృత నిపుణుడు టాంటెక్స్ దీర్ఘకాల సభ్యుడు కిషోర్ చుక్కల నేతృత్వంలో తెలుగు వారు మూడు విడుతులుగా విచ్చేసి ఇందులోని మెళుకువలను అభ్యసించారు. నాట్స్ అధ్యక్షుడు శ్రీనివాస్ మంచికలపూడి నాట్స్ అధిపతి శ్రీనివాస్ గుత్తికొండ తమ సంయుక్త సందేశంలో తెలుగు వారందరినీ ఒక వేదికపై కలిసి చిన్నారులకు, యువతకు మన సంస్కృతిని పరిచయం చెయ్యాలని, తెలుగు వారి ఐక్యతకు కృషి చేయాలని, ఇలాంటి కార్యక్రమాలు ఆకస్మిక హృద్రోగ సమస్యలకు మంచి అవగాహనను కలిగిస్తాయన్నారు. 6వ అమెరికా సంబరాల నాయకత్వం బృందం సభ్యులు కిశోర్ కంచెర్ల (అధిపతి), విజయ శేఖర్ అన్నె (సంయుక్తాధిపతి), ఆది గెల్లి (ఉపాధిపతి), ప్రేమ్ కలిదిండి (ఉపాధిపతి), రాజేంద్ర మాదాల (కార్యదర్శి), బాపు నూతి (కోశాధికారి), మహేశ్ అదిభట్ట (సంయుక్త కార్యదర్శి), విజయ్ వర్మ కొండ (క్రయ విక్రేయ నిర్దేశకుడు), భాను లంక (ఆతిథ్యం నిర్దేశకుడు), కిషోర్ వీరగంధం (వ్యవహారాల నిర్దేశకుడు), రామిరెడ్డి బండి (కార్యక్రమ నిర్దేశకుడు) చినసత్యం వీర్నపు (టాంటెక్స్ అధ్యక్షుడు) సంయుక్తంగా ప్రాణ రక్షణ శిక్షణకు విచ్చేసిన తెలుగు వారికి అభినందనలు తెలియజేసి, తెలుగు వారందరినీ సంబరాలకు ఆహ్వానించారు. నాట్స్ సంబరాల కోశాధికారి బాపు నూతి సంస్థకుద సంబంధించిన ముఖ్యాంశాలను పంచుకుని ప్రాణరక్షణ ప్రక్రియలో శిక్షణ సంయుక్తంగా తెలుగు వారికి అందించండం సంతోషంగా ఉందన్నారు. సంబరాల కార్యదర్శి రాజేంద్ర మాదాల ప్రస్తుత సంబరాల కార్యక్రమ వివరాలను తెలియజేశారు. టాంటెక్స్ అధ్యక్షుడు చినసత్యం వీర్నపు మాట్లాడుతూ.. ప్రాణ రక్షణ ప్రక్రియలో శిక్షణ మన భారతీయ సంతతికి చెందిన వారికి, ముఖ్యంగా తెలుగు వారికి చాలా ముఖ్యమని, ఇటీవల మనం అనేక ఆకస్మిక మరణాలను చూశామని, ఇలాంటి శిక్షణలో తగిన అవగాహన అందించడం ద్వారా అతివిలువైన ప్రాణాన్ని కాపాడగలమన్నారు. టాంటెక్స్ కార్యదర్శి ఉమా మహేష్ పార్నపల్లి, కార్యనిర్వహక సభ్యులు శ్రీకాంత్ రెడ్డి జొన్నాల, సతీష్ బండారు కార్యక్రమానికి హాజరయ్యారు. -
ఆరోగ్యమే అసలైన సంపద
అరవై ఏళ్లు దాటాయి.. ఇక ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి. ఇది ఒకప్పటి మాట. ఇప్పుడు చిన్నా పెద్దా తేడా లేదు.. అందరూ ఆరోగ్య పరిరక్షణకే అధిక ప్రాధాన్యతనిస్తున్నారు. కారణం కాలం మారింది.. మనుషుల జీవనశైలి మారింది. ఆహారపు అలవాట్లు మారాయి. దీంతో రకరకాల వ్యాధులు మనిషిని చుట్టుముడుతున్నాయి. చిన్న వ యసులోనే ‘పెద్ద’ జబ్జులు పలకరిస్తున్నాయి. ప్రాణాలు తీస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆరోగ్యంపై అవగాహన పెంపొందించేందుకు ‘సాక్షి’ ఓ అవగాహనా సదస్సు నిర్వహిస్తోంది. సాక్షి, హైదరాబాద్: గ్రేటెస్ట్ వెల్త్ ఈజ్ హెల్త్.. ఈ ప్రపంచంలో అన్నింటికంటే విలువైంది ఆరోగ్యమే. అందుకే ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. కానీ పెరిగిపోతున్న కాలుష్యం, మారిన జీవనశైలి ఆరోగ్యం చిరునామాను చెరిపేస్తోంది. ప్రతి మనిషి ఏదో ఒక వ్యాధితో బాధపడుతూనే ఉన్నారు. వ్యాధులు పట్టణాలనే కాదు.. పల్లెలనూ వదలడం లేదు. అనారోగ్యానికి కేరాఫ్‌గా హైదరాబాద్ ఇటీవలి కాలంలో క్యాన్సర్ మరణాలూ అధిక సంఖ్యలో నమోదు అవుతుండటం ఆందోళన కలిగించే అంశం. ఇక మధుమేహ వ్యాధిగ్రస్తులు ప్రపంచంలోకెల్లా మన దేశంలోనే అధికసంఖ్యలో ఉంటే.. మన దేశంలో హైదరాబాద్ మధుమేహానికి ‘రాజధాని’గా మారింది. భాగ్యనగరంలో 30 శాతం మంది ఈ వ్యాధితో కుస్తీపడుతున్నారు. ఇక బీపీ బాధితులూ 40 శాతం మంది పైనే ఉన్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ లాంటివి చెబుతున్నాయి. పచ్చని పల్లెసీమల్లోనూ.. ఇటీవల ఆస్ట్రేలియాకు చెందిన ఓ సంస్థ పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక సర్వే చేసింది. ఈ సర్వేలో సుమారు 20 శాతం మంది బీపీతో, 17శాతం మందికి పైగా మధుమేహంతో బాధపడుతున్నట్లు తేలింది. మిగతా జబ్బుల సంఖ్య కూడా పల్లెల్లో తక్కువేమీ లేదు. రకరకాల ప్రయత్నాలు.. ఇటీవలి కాలంలో ప్రతి ఒక్కరిలోనూ ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగింది. వాకింగ్, జిమ్‌లో కసరత్తులు, యోగా వంటి వాటితో ఫిట్నెస్ను పెంచుకుంటున్నారు. ఫ్రూట్ సలాడ్, గ్రీన్ సలాడ్ల వైపు మొగ్గు చూపుతున్నారు. జబ్బులొస్తేనే వైద్య పరీక్షలకు వెళ్లే పరిస్థితి నుంచి, ముందుజాగ్రత్తగా మాస్టర్, ఎగ్జిక్యూటివ్ హెల్త్ చెకప్‌ల వంటివి చేయించుకుంటున్నారు. ముందడుగేసిన ‘సాక్షి’ జీవన విధానంలో, ఆహారపు అలవాట్లలో చేసుకోవాల్సిన మార్పుల గురించి పూర్తిగా తెలిసినవారు చాలా తక్కువమంది. ఈ నేపథ్యంలోనే.. సందేహాలు నివృత్తి చేసేందుకు, ఆరోగ్యానికి, వ్యాధులకు సంబంధించిన అవగాహన కల్పించేందుకు, సలహాలు, సూచనలు అందజేసేందుకు ‘సాక్షి’ మీడియా గ్రూపు ముందుకొచ్చింది. పేరొందిన వైద్యులు, నిపుణులతో ‘లివ్ వెల్ ఎక్స్పో’ పేరిట ఒక సదస్సును ఏర్పాటు చేస్తోంది. ‘లివ్ వెల్ ఎక్స్పో’తో అవగాహన హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో ఆగస్టు 8, 9 తేదీల్లో ‘లివ్ వెల్ ఎక్స్పో’ పేరిట ‘సాక్షి’ మీడియా గ్రూపు ఓ సదస్సు నిర్వహిస్తోంది. వైద్య ఆరోగ్య రంగంలోని నిపుణులను ఒకే వేదిక మీదకు తెస్తోంది. జీవనశైలిలో వస్తున్న మార్పులేమిటి? అందువల్ల కలిగే అనర్థాలు, ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి, జీవనశైలి జబ్బులు రాకుండా ఎలా ముందుకు సాగాలి, జబ్బులకు గురైనవారు వాటిని ఎలా నియంత్రించుకోవాలి? లాంటి ప్రశ్నలు, సందేహాలన్నిటికీ ఇక్కడ సమాధానాలు లభిస్తాయి. డాక్టర్ గురవారెడ్డి, డాక్టర్ సోమరాజు, డాక్టర్ వంశీమోహన్, డాక్టర్ మన్నెం గోపీచంద్ వంటి వారితోపాటు పలువురు నిపుణులు ఈ సదస్సుకు హాజరవుతున్నారు.