babri masjid demolision
-
NCERT Textbooks: ఆ పదాలు తొలగింపు
న్యూఢిల్లీ: పాఠశాల పాఠ్యపుస్తకాల్లో బాబ్రీ మసీదు కూల్చివేత, గుజరాత్ అల్లర్లలో ముస్లింల హత్య, హిందూత్వ తదితర పదాలు, వాక్యాలను తొలగిస్తున్నట్లు జాతీయ విద్యాపరిశోధనా, శిక్షణా మండలి(ఎన్సీఈఆర్టీ) పేర్కొంది. పాఠ్యపుస్తకాల్లో కాలానుగుణంగా చేయాల్సిన మార్పుల్లో భాగంగా ఈ సవరణలు చేపట్టినట్లు ఎన్సీఈఆర్టీ తెలిపింది. ఆరి్టకల్ 370 రద్దుకు సంబంధించిన అంశంలో పాక్ ఆక్రమిత జమ్మూకశ్మీర్(పీఓకే) అనే పదానికి బదులు ఆజాద్ పాకిస్తాన్ అనే పదాన్ని చేర్చారు. పుస్తకాల నుంచి కొన్ని పాఠ్యాంశాల తొలగింపుపై ఎన్సీఈఆర్టీ స్పందించింది. ‘‘ పుస్తకాల ఆధునీకరణలో జరిగే సాధారణ ప్రక్రియ ఇది. నూతన విద్యా ప్రణాళిక కింద చేసే కొత్త పాఠ్యపుస్తకాల తయారీకి దీనితో ఏ సంబంధం లేదని అధికారులు స్పష్టంచేశారు. ఇతర తరగతుల పుస్తకాలతోపాటు 11, 12 తరగతుల రాజనీతి శాస్త్రం, సామాజిక శాస్త్ర పాఠ్యపుస్తకాల్లో ఈ మార్పులు చేశారు. 11వ తరగతిలో లౌకికవాదం అనే 8వ చాప్టర్లో ‘‘ 2002 గుజరాత్ గోధ్రా అల్లర్ల తర్వాత వేయికిపైగా ఊచకోతకు బలయ్యారు. ఇందులో ముస్లింలే ఎక్కువ’’ అనే వాక్యంలో ముస్లింలు అనే పదం తొలగించారు. అల్లర్ల ప్రభావం అన్ని మతాలపై ఉన్న కారణంగా ఒక్క మతాన్నే ప్రస్తావించడం సబబు కాదని ఎన్సీఈఆర్టీ భావించింది. 12వ తరగతి రాజనీతిశాస్త్రం పుస్తకంలోని ‘స్వాతంత్య్రం నుంచి భారత రాజకీయాలు’ చాప్టర్లో కొత్తగా ఆరి్టకల్ 370 రద్దును జతచేశారు. 8వ చాప్టర్లో ‘‘ 1992 డిసెంబర్లో బాబ్రీ మసీదు కూల్చివేతతో ఎన్నో విపరిణామాలు జరిగాయి. ఇది బీజేపీ, హిందూత్వ వ్యాప్తికి దారితీసింది’’అన్న వాక్యాలకు బదులు ‘ శతాబ్దాలనాటి రామజన్మభూమి ఆలయ వివాదం దేశ రాజకీయాలనే మార్చేసింది’’ అని మార్చారు. ఇందులో హిందూత్వ పదాన్ని తొలగించారు. -
మసీదును కూల్చడం గర్వకారణం
- బీజేపీ ఎంపీ సాక్షి మహారాజ్ వివాదాస్పద వ్యాఖ్యలు - బాబర్ విదేశీయుడు.. దానిని బాబ్రీ మసీదు అనొద్దు - ఏ శక్తీ రామమందిర నిర్మాణాన్ని అడ్డుకోలేదు లక్నో: అయోధ్యలోని బాబ్రీ మసీదును కూల్చివేయడం తమకు గర్వకారణమన్నారు బీజేపీ ఎంపీ సాక్షి మహారాజ్. మసీదు కూల్చివేత కేసులో నిందితుడిగా కోర్టు ముందు నిలబడటం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. ఈ కేసులో విచారణను ఎదుర్కొనేందుకు మంగళవారం లక్నోలోని సీబీఐ కోర్టుకు హాజరైన ఆయన కొద్దిసేపు మీడియాతో మాట్లాడారు. భూమిమీద ఏ శక్తి కూడా అయోధ్యలో రామమందిర నిర్మాణాన్ని అడ్డుకోలేదని, అతి త్వరలోనే గుడి నిర్మిస్తామని సాక్షి మహారాజ్ చెప్పారు. 1992, డిసెంబర్6న జరిగిన మసీదు విధ్వంసంలో మీరు కూడా పాల్గొన్నారా?’ అన్న ప్రశ్నకు ఎంపీ సాక్షి మహారాజ్ బదులిస్తూ.. ‘మీరు(మీడియా) మతిలేనివిధంగా మాట్లాడొద్దు. బాబ్రీ మసీదు అని చెప్పే ప్రాంతంలో ముందునుంచి అది(మసీదు) లేనేలేదు. ఆ ప్రదేశం ముమ్మాటికీ రామజన్మభూమే. విదేశీయుడైన బాబర్ పేరుతో ఏదో కడితే, దాన్ని ‘బాబ్రీ మసీదు’ అని అంటున్నారు. దాన్ని అలా పిలవొద్దు.. రామజన్మభూమి అని మాత్రమే వ్యవహరించాల’ని చెప్పారు. 25 ఏళ్లనాటి మసీదు విధ్వంసం కేసులో బీజేపీ ముఖ్యనేతలు ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి, ఉమాభారతి, సాథ్వి రీతాంబరా, వినయ్ కటియార్, వీహెచ్పీ నేత విష్ణు హరి దాల్మియా, మహంత్ రాంవిలాస్ వేదాంతి, మహంత్ నృత్యగోపాల్ దాస్, వైకుంఠలాల్ శర్మ, ధర్మ దాస్, చంపత్రాయ్ బన్సల్, శివసేనకు చెందిన సతీశ్ ప్రధాన్ తదితరులు నిందితులుగా ఉన్నారు. ఉన్నతన్యాయస్థానం ఆదేశాల మేరకు సీబీఐ కోర్టులో వీరిపై విచారణ ప్రారంభమైంది. మంగళవారం నిందితులపై అభియోగాలు నమోదుచేశారు. అనంతరం వారందరికీ బెయిల్ మంజూరుచేస్తున్నట్లు న్యాయమూర్తి ప్రకటించారు.