Babur Missile
-
పాక్ క్షిపణి ప్రయోగం విఫలం
ఇస్లామాబాద్: పాకిస్తాన్ క్షిపణి ప్రయోగం మరోసారి విఫలమైంది. బెలుచిస్తాన్లో సోన్మియానీ టెస్ట్ రేంజ్ నుంచి ప్రయోగించిన బాబర్ 2 క్షిపణి ప్రయోగం విఫలమైంది. ఈ క్షిపణిని ఉపరితలం నుంచి 750కిలోమీటర్లు నింగికి ప్రయాణించే లక్ష్యంగా రూపొందించారు. కాగా, బాబర్ 2 క్రూయిజ్ క్షిపణి కేవలం రెండు నిమిషాలు మాత్రమే నింగిపై ప్రయాణించి నేలపై కుప్పకూలింది. గత ఏప్రిల్లో పాక్ ప్రయోగించిన బాబర్ 2 సబ్ సోనిక్ క్షిపణి ప్రయోగం విఫలమైన సంగతి తెలిసిందే. డీఆర్డీవో అభివృద్ధి చేసిన నిర్బయ్ ప్రయోగానికి దీటుగా పాక్ చైనాతో కలిసి క్షిపణి ప్రయోగానికి సిద్దమైందని సాంకేతిక విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పాక్కు వైఫల్యాలతో పాటు క్షిపణి ప్రయాగాలలో కొన్ని విజయవంతమయ్యాయి. ఫిబ్రవరి 2020లో అణుసామర్థ్యం గల క్రూయిజ్ క్షిపణి రాద్–2ను 600 కిలోమీటర్ల పరిధిలో ప్రయోగించి విజయం సాధించింది. ఈ ప్రయోగం భూమిపై, సముద్రంలో సైనిక ‘నియంత్రణ సామర్థ్యం’ను పెంచిన విషయం విదితమే. -
యుద్ధ క్షిపణిని పరీక్షించిన పాక్
ఇస్లామాబాద్: జలాంతర్గామి మీద నుంచి ప్రయోగించే అణు యుద్ధ క్షిపణి బాబర్-3ని పాకిస్థాన్ తొలిసారి విజయవంతంగా పరీక్షించింది. సోమవారం చేసిన ఈ పరీక్ష విజయవంతం అయినట్లు పాక్ మీడియా తెలిపింది. అణ్వస్త్రాలను ఈ క్షిపణి దాదాపు 450కిలో మీటర్లు మోసుకెళ్లగలదు. హిందూ మహాసముద్రంలో గుర్తు తెలియన ప్రాంతంలో ఈ పరీక్ష నిర్వహించినట్లు సమాచారం. పాక్ వద్ద అత్యంత శక్తిమంతమైన వార్హెడ్లలో ఇదే రెండో అతిపెద్దది అని ఆ దేశ మిలటరీ వర్గాలు చెబుతున్నాయి. ’బాబర్-3ని నీటి అడుగు భాగం నుంచి జలాంతర్గామిపై ఏర్పాటు చేసిన మొబైల్ ప్లాట్ఫామ్ ద్వారా ప్రయోగించాం' అని అక్కడి మీడియా, పబ్లిక్ రిలేషన్ సంస్థ వెల్లడించింది. అంతకుముందు బాబర్ 2ను పాక్ డిసెంబర్లో విజయవంతంగా పరీక్షించిన విషయం తెలిసింది. బాబర్ 3 యుద్ధ క్షిపణిని భారత్లోని బ్రహ్మోస్ క్షిపణికి పోటీగా చెబుతున్నారు.