baireddi Reddy
-
బిహార్లో బీజేపీకి పట్టిన గతే బాబుకూ..: బైరెడ్డి
బీహార్ ఎన్నికల్లో బీజేపీకి పట్టిన గతే సీఎం చంద్రబాబుకు రాష్ట్రంలో పడుతుందని రాయలసీమ పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర్రెడ్డి అన్నారు. ఆదివారం కర్నూలులో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాయలసీమను పట్టిసీమతో సస్యశ్యామలం చేస్తానని సీఎం పదే పదే అబద్ధాలు చెబుతున్నారని అన్నారు. అబద్ధాన్ని నిజం అని నమ్మించడం కోసం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను ఒకే విధంగా చూడాల్సిన ప్రభుత్వం.. సీమపై వివక్ష చూపుతోందని విమర్శించారు. కరువు పరిస్థితుల్లో సీమ వాసులు నీరు దొరకక అల్లాడుతుంటే.. కోస్తా ఆయకట్టు కోసం శ్రీశైలం నీటిని తరలించుకుపోవడం దారుణమన్నారు. సీమ ప్రాజె క్టులను గాలికి వదిలేసి అధికార పార్టీ నేతలకు కమీషన్లు వచ్చే ప్రాజెక్టులను పూర్తి చేస్తున్నారని మండిపడ్డారు. సీమ కరువుపై వచ్చే నెలలో యాత్ర చేపడుతున్నట్లు బైరెడ్డి తెలియ జేశారు. -
దమ్ముంటే పట్టిసీమపై చర్చకు రావాలి
దమ్ముంటే టీడీపీ నేతలు పట్టిసీమపై చర్చకు రావాలని రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బెరైడ్డి రాజశేఖర్ రెడ్డి సవాలు విసిరారు. కర్నూలులో విలేకరులతో మాట్లాడుతూ.. పట్టిసీమ ద్వారా రాయలసీమను సస్యశ్యామలం చేస్తామంటున్న చంద్రబాబు, ఆయన మంత్రులు కర్నూలు కొండారెడ్డి బురుజు వద్ద బహిరంగ చర్చను ఏర్పాటు చేసి ఆ విషయం చెప్పాలన్నారు. టీడీపీ నేతలు అబ్బసొత్తులా భూములను కార్పొరేట్ సంస్థలకు కట్టబెడుతున్నారని మండిపడ్డారు. కర్నూలు ప్రజలకు తెలియకుండా కర్నూలులో 5500 ఎకరాలను రిలయన్స్ సంస్థకు కట్టబెట్టారని ఆయన ఆరోపించారు.