bajaj committee
-
మళ్లింపు జలాల లెక్క తేలుస్తారా?
పట్టిసీమ, పోలవరం వాటాలపై చర్చించనున్న బజాజ్ కమిటీ సాక్షి, హైదరాబాద్: గోదావరి నదీ జలాలను కృష్ణా బేసిన్‌కు మళ్లిస్తూ ఆంధ్రప్రదేశ్ చేపట్టి న పట్టిసీమ, పోలవరం ప్రాజెక్టులతో.. ఎగువ రాష్ట్రాలకు దక్కే వాటాల అంశం మళ్లీ చర్చనీయాంశమైంది. గతేడాది పట్టిసీమ ద్వారా ఏపీ చేసిన వినియోగంలో వచ్చే వాటాలు ఇప్పటికీ తేలకపోవడం, ఈ ఏడాది మళ్లీ వినియోగాన్ని ప్రారంభించడం తెలం గాణకు మంట పుట్టిస్తోంది. ఈ ఏడాదైనా వాటాలు తేల్చేలా చర్యలు తీసుకోవాలని కేంద్రంపై ఒత్తిడి పెంచింది. ఈ నేపథ్యంలో వివాదాన్ని తేల్చేందుకు కేంద్ర జల వనరుల శాఖ ఏర్పాటు చేసిన ఏకే బజాజ్ కమిటీ గడువును మరో ఆరు నెలలు పొడగించడం, ఆ కమిటీ వచ్చే నెల మొదటి వారం రాష్ట్రం లో పర్యటించనుండటంతో మళ్లింపు లెక్కలు తేలుతాయా అనేది ప్రశ్నార్థంగా మారింది. ఏటా వాటర్ ఇయర్‌కు ముందుగా అపెక్స్ కౌన్సిల్ సమావేశాలను నిర్వహిస్తూ వస్తున్నా ఇంతవరకు గోదావరి మళ్లింపు జలాల వివా దం తేలలేదు. ఈఏడాది ఫిబ్రవరిలో ఒకసా రి రాష్ట్రానికి కమిటీ రాగా.. పట్టిసీమ, పోల వరం ప్రాజెక్టుల ద్వారా ఎగువ రాష్ట్రానికి దక్కే 90 టీఎంసీల వాటాలో గరిష్టంగా 73 (పోలవరం 43 టీఎంసీలు, పట్టిసీమ 30 టీఎంసీలు) టీఎంసీలు తమకు దక్కేలా చూడాలని తెలం గాణ కోరింది. కమిటీ స్పందిస్తూ, మళ్లింపు జలాల అంశం తమ పరిధిలో లేదని, ఇది ట్రిబ్యునళ్లు తేల్చాల్సి ఉందని చెతులెత్తేసింది. దీనిపై అభ్యంతరం తెలిపిన తెలంగాణ.. కేంద్రానికి ఫిర్యాదు చేసింది. దీంతో బజాజ్ కమిటీతో కేంద్రం చర్చించి మళ్లింపు జలాలపై మధ్యేమార్గాన్ని సూచించాలని ఆదేశించింది. -
కోర్టుల చుట్టూ తిరగడం కన్నా అదే మేలు! : కేసీఆర్
హైదరాబాద్ : నీటి పంపకాల కోసం కోర్టుల చుట్టూ తిరగడం కన్నా కలసి కూర్చొని మాట్లాడుకోవడానికే ప్రాధాన్యతనిస్తానని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. కృష్ణానది జలాల పంపకాలపై కేంద్రం ఏర్పాటుచేసిన బజాజ్ కమిటీ బుధవారం సీఎం కేసీఆర్‌ను కలిసింది. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ జల వివాదాలు వాంఛనీయం కాదన్నారు. ఇరు రాష్ట్రాలు కలసి మాట్లాడుకోవడం ద్వారా సమస్య పరిష్కారమవుతుందన్నారు. తెలంగాణ రాష్ట్ర వాటా ప్రకారమే నీటిని వాడుకుంటామని చెప్పారు. ఉమ్మడి ప్రాజెక్టుల్లో నీటిని వినియోగానికి సంబంధించి ఆపరేషన్ రూల్స్ రూపొందించాలన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గోదావరి జలాలను సముద్రంలో వృథాగా కలిసిపోకుండా చేయగలిగితే కోస్తా, రాయలసీమ రైతుల అవసరాలు తీర్చవచ్చని చెప్పారు. ఎగువనున్న మహారాష్ట్ర, కర్ణాటక ప్రభుత్వాలు దిగువ రాష్ట్రాల అవసరాలను పట్టించుకోకుండా ప్రాజెక్టులు కట్టుకున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అంతకుముందు హైదరాబాద్ జలసౌధలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఇరిగేషన్ ఉన్నతాధికారులతో బజాజ్ కమిటీ సమావేశం నిర్వహించింది. ఇరు రాష్ట్రాల అధికారులు తమ వాదనాలను బజాజ్ కమిటీకి విన్నమించారు. తెలంగాణలోని జురాలను ఉమ్మడి ప్రాజెక్టుల పరిధిలోకి తీసుకురావాలని ఏపీ అధికారులు కోరారు. దీనికి తెలంగాణ అధికారులు అంగీకరించలేదు. పులిచింతల, సుంకేశులను ఉమ్మడి ప్రాజెక్టు పరిధిలోకి తీసుకురావాలని తెలంగాణ అధికారులు కోరారు. దీనికి ఏపీ అధికారులు అభ్యంతరం తెలిపారు. ఇరు రాష్ట్రాల వాదనలపై కేంద్రానికి బజాజ్ కమిటీ నివేదిక ఇవ్వనుంది.