Baking soda
-
ఈ ట్రిక్ ఎపుడైనా ట్రైచేశారా? మ్యాజిక్..అస్సలు వదలరు!
వంటిల్లు, వంట ఇంటి సామాను జిడ్డు వదిలించడం అంత తేలిక కాదు. దీనికి సంబంధించి అనేక చిట్కాలను మనం చూసే ఉంటాం. వాటిని చాలామంది పాటించి ఉంటారు కూడా. తాజాగా ఇలాంటి వంట ఇంటి చిట్కా ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టూత్‌పేస్ట్+కోకాకోలా+క్లీనర్+బేకింగ్-సోడా+వాటర్‌తో తయారు చేసిన లిక్విడ్ మ్యాజిక్ఇంటర్నెట్ హల్చల్ చేస్తోంది. లెర్న్ సంథింక్ అనే ట్విటర్ హ్యాండిల్ షేర్ చేసిన ఈ వీడియో ఇప్పటికే మూడు మిలియన్లకుపైగా వ్యూస్ సాధించింది. చిన్ని కోకోకాలా బాటిల్లో కొద్దిగా టూత్ ప్లేస్ వేసి బాగా కలిపాడు. ఆ రువాత ఆమిశ్రమాన్ని ఒకగిన్నెలోపోసి, దానికి బేకింగ్ సోడా, లిక్విడ్ క్లీనర్,కొద్దిగా నీళ్లు కలిపాడు. ఆ తరువాత దీన్నీ ఒక స్ప్రే బాటిల్లోకి తీసుకుని జిడ్డు పట్టిన పెనాన్ని శుభ్రం చేయడం ఇందులో చూడొచ్చు. This Magic products made by toothpaste+cocacola+cleaner+baking-soda+water pic.twitter.com/KOOeJwuvWn — Learn Something (@cooltechtipz) March 12, 2024 -
ఈ పదార్థాలు ఉంటే చాలు.. ఈజీ పొటాటో స్నాక్.. టేస్టు అదిరిపోద్ది!
ఆలు చిప్స్ తినీతిని బోర్ కొట్టిందా! అయితే, బంగాళా దుంపతో ఈ వైరైటీ వంటకాన్ని ట్రై చేయండి. రొటీన్‌కు భిన్నంగా పొటాటో టోర్నడో రుచిని ఆస్వాదించండి. పొటాటో టోర్నడో తయారీకి కావాల్సిన పదార్థాలు: ►బంగాళ దుంపలు – 4 లేదా 5 ►మైదాపిండి – అర కప్పు ►మొక్కజొన్నపిండి – 1 టేబుల్ స్పూన్ ►బేకింగ్ సోడా – అర టీ స్పూన్ ►ఉప్పు – కొద్దిగా, నీళ్లు – కావాల్సినన్ని ►నూనె – డీప్ ఫ్రైకి సరిపడా ►గార్లిక్ పౌడర్ – 1 టేబుల్ స్పూన్ ►చీజ్ తురుము – 3 టేబుల్ స్పూన్లు ►చీజ్ సాస్ – 4 టేబుల్ స్పూన్ల పైనే ►డ్రై పార్సీ – అర టేబుల్ స్పూన్ ►ఎండు మిర్చి పొడి – 1 టేబుల్ స్పూన్ తయారీ: ముందుగా ఒక బౌల్లో గార్లిక్ పౌడర్, చీజ్ తురుము, డ్రై పార్సీ.. వేసుకుని బాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక్కో బంగాళదుంపను ఒక్కో పొడవాటి పుల్లకు గుచ్చి.. చాకుతో స్ప్రిల్స్లా (వలయంలా, మొత్తం కట్ చెయ్యకుండా చిత్రంలో ఉన్న విధంగా) కట్ చేసుకుని పెట్టుకోవాలి. ►అనంతరం వెడల్పుగా ఉండే బౌల్లో మైదాపిండి, మొక్కజొన్నపిండి, బేకింగ్ సోడా, ఉప్పు వేసుకుని కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ పలుచటి మిశ్రమంలా చేసుకోవాలి. ►ఆ మిశ్రమంలో ఒక్కో పొటాటో స్ప్రింగ్‌ని ముంచి.. నూనెలో దోరగా వేయించాలి. అనంతరం వాటిని వరుసగా పెట్టుకుని.. అటు ఇటు తిప్పుతూ గార్లిక్–చీజ్ మిశ్రమాన్ని చల్లుకోవాలి. ►ఆ పైన చీజ్ సాస్ స్ప్రిల్స్ పొడవునా స్ప్రెడ్ చేసుకుని.. చివరిగా ఎండుమిర్చి పొడిని చల్లి.. సర్వ్ చేసుకోవాలి. చదవండి: Summer Drink: సుగంధ షర్బత్ ఎలా తయారు చేస్తారో తెలుసా? -
కురులకు కుంకుడు స్నానం
బేకింగ్ సోడాలో కొద్దిగా నీళ్లు కలిపి పేస్ట్‌లా చేయాలి. దీనితో మాడును బాగా రుద్ది వదిలేయాలి. పావుగంట తర్వాత కుంకుడు రసంతో కానీ షీకాయతో కానీ తలంటుకోవాలి. వారానికి రెండుసార్లు ఇలా చేస్తే రెండు మూడు వారాల్లో చుండ్రు సమస్య వదిలిపోతుంది. ♦ కలబంద గుజ్జులో కొద్దిగా నిమ్మరసం కలిపి మాడుకు పట్టించాలి. బాగా ఆరిన తర్వాత తలంటుకోవాలి. చుండ్రుతో బాధపడుతున్నవారు తరచూ ఇలా చేస్తే సమస్య తీరిపోతుంది. ♦ వెల్లుల్లిని మెత్తగా దంచి, ఆలివ్ ఆయిల్లో వేసి వెచ్చబెట్టాలి. గోరువెచ్చగా ఉండగానే మాడుకు పట్టించి, అరగంట తర్వాత తలంటుకోవాలి. చుండ్రుకు ఇది మంచి మందు. ♦ గుప్పెడు వేపాకుల్ని నీటితో కలిపి పేస్ట్ చేయాలి. దీనిలో కొద్దిగా కొబ్బరి నూనె కలిపి తలకు పట్టించాలి. గంట తర్వాత తలస్నానం చేస్తే చుండ్రు మాత్రమే కాదు, పేలు కూడా పోతాయి. -
ఇత్తడి మెరుపు...
ఇంటిటిప్స్ ఇత్తడి లోహం పూజా సామగ్రి, ఇంటి అలంకరణ వస్తువులలో ప్రధానమైనది. అయితే, ఈ వస్తువులు సరిగా శుభ్రపరచకపోతే నల్లబడటం కళ తప్పడం చూస్తుంటాం. ఇత్తడి వస్తువులు కొత్తగా మెరవాలంటే... ఒక చిన్న పాత్రలో టీ స్పూన్ నిమ్మరసం, టీ స్పూన్ బేకింగ్ సోడా వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని మెత్తని క్లాత్కి అద్దుకుంటూ, ఇత్తడి పాత్రలపై రుద్దాలి. తర్వాత మరో పొడి క్లాత్ తీసుకొని శుభ్రంగా తుడవాలి. క్లాత్కి కొద్దిగా ఆలివ్ ఆయిల్ అద్దుకొని శుభ్రపరిచిన వస్తువులపై మృదువుగా తుడవాలి. దీంతో అవి కొత్తవాటిలా మెరుస్తాయి. నిమ్మకాయ (అర చెక్క), టీ స్పూన్ ఉప్పు తీసుకోవాలి. నిమ్మ చెక్కపై ఉప్పు వేసి నల్లబడిన ఇత్తడి వస్తువులపై రుద్ది, నీళ్లతో శుభ్రపరచాలి. తర్వాత మెత్తటి కాటన్ క్లాత్‌తో తుడవాలి. మురికి అంతా పోయి కొత్తవాటిలా మెరుస్తాయి.