కురులకు కుంకుడు స్నానం
బేకింగ్ సోడాలో కొద్దిగా నీళ్లు కలిపి పేస్ట్‌లా చేయాలి. దీనితో మాడును బాగా రుద్ది వదిలేయాలి. పావుగంట తర్వాత కుంకుడు రసంతో కానీ షీకాయతో కానీ తలంటుకోవాలి. వారానికి రెండుసార్లు ఇలా చేస్తే రెండు మూడు వారాల్లో చుండ్రు సమస్య వదిలిపోతుంది.
♦ కలబంద గుజ్జులో కొద్దిగా నిమ్మరసం కలిపి మాడుకు పట్టించాలి. బాగా ఆరిన తర్వాత తలంటుకోవాలి. చుండ్రుతో బాధపడుతున్నవారు తరచూ ఇలా చేస్తే సమస్య తీరిపోతుంది.
♦ వెల్లుల్లిని మెత్తగా దంచి, ఆలివ్ ఆయిల్‌లో వేసి వెచ్చబెట్టాలి. గోరువెచ్చగా ఉండగానే మాడుకు పట్టించి, అరగంట తర్వాత తలంటుకోవాలి. చుండ్రుకు ఇది మంచి మందు.
♦ గుప్పెడు వేపాకుల్ని నీటితో కలిపి పేస్ట్ చేయాలి. దీనిలో కొద్దిగా కొబ్బరి నూనె కలిపి తలకు పట్టించాలి. గంట తర్వాత తలస్నానం చేస్తే చుండ్రు మాత్రమే కాదు, పేలు కూడా పోతాయి.