Bala Murugan
-
సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ రచయిత కన్నుమూత
సినీ పరిశ్రమలో మరో తీవ్ర విషాదం నెలకొంది. తెలుగు సహా తమిళంలో అనేక సినిమాలకు రచయితగా వ్యవహరించిన తమిళ కథా రచయిత బాలమురుగన్ కన్నుమూశారు. ఆయన వయసు 86 సంవత్సరాలు. గత కొన్నాళ్లుగా వయోభారం అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న ఆయన ఆదివారం కన్నుమూసినట్లు ఆయన కుమారుడు, తెలుగు-తమిళ సినీ రచయిత భూపతి రాజా మీడియాకు వెల్లడించారు. తెలుగులో బాలమురుగన్ ధర్మదాత, ఆలుమగలు, సోగ్గాడు, సావాసగాళ్లు, జీవన తరంగాలు వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు కథ అందించారు. అలాగే ఆయన గీతా ఆర్ట్స్ మొదటి సినిమా బంట్రోతు భార్య సినిమాకు కూడా బాల మురుగనే కథ అందించారు. ఇక శోభన్ బాబు హీరోగా తెరకెక్కిన సోగ్గాడు సినిమా ఎంత భారీ బ్లాక్ బస్టర్‌గా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక తమిళంలో స్టార్ హీరోగా ఒకప్పుడు చక్రం తిప్పి శివాజీ గణేషన్‌కు దాదాపు 30 నుంచి 40 సినిమాలకు బాలమురుగన్ కథలు అందించారు. బాలమురుగన్ మృతి చెందారు అన్న విషయం తెలుసుకున్న తమిళ, తెలుగు సినీ ప్రముఖులు ఆయన మృతికి సంతాపం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: స్టార్ హీరోయిన్‌కు అరుదైన వ్యాధి.. అయ్యో పాపం అనకుండా ఉండలేరు..! -
వైవిధ్యమైన కథ
శ్రవణ్, లియోనా ఈశాయ్ జంటగా ఓ సినిమా రూపొందుతోంది. బాలమురుగన్ దర్శకత్వంలో శ్రీభాగ్యలక్ష్మీ ఎంటర్టై¯ మెంట్స్ పతాకంపై బోగారి లక్ష్మీనారాయణ నిర్మిస్తున్న ఈ సినిమా గురువారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. నిర్మాత లక్ష్మీనారాయణ మాట్లాడుతూ– ‘‘మూడు రకాల టైమ్ పీరియడ్స్‌తో ప్యారలల్‌గా జరిగే స్క్రీన్‌ప్లేతో జరిగే కథ ఇది. తెలుగులో ఇదొక కొత్త ప్రయోగం అవుతుంది. పదేళ్లకుపైగా తెలుగులో విలన్ పాత్రల్లో నటిస్తున్న శ్రవణ్‌ను హీరోగా పరిచయం చేయటం ఆనందంగా ఉంది. జూలై 2నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం’’ అన్నారు. ‘‘వైవిధ్యమైన కథాంశంతో రూపొందుతోన్న చిత్రమిది’’ అన్నారు బాలమురుగన్. ‘‘రెగ్యులర్ క్యారెక్టర్‌తో కాకుండా కథలో ట్రావెల్ అయ్యే ఒక డిఫరెంట్ రోల్‌తో హీరోగా పరిచయమవటం హ్యాపీ’’ అన్నారు శ్రవణ్. -
తల్లడిల్లి‘పోయిన’ పసిప్రాయం
ఉదయం పాఠశాలకు వెళ్లే ముందు ఆ పసిప్రాయానికి తెలియదు.. అమ్మచేతి గోరుముద్ద ఇదే ఆఖరు అని.. ఆ చిన్నారికి తెలియదు.. స్నేహితులతో అల్లరిచేష్టలకు ఇక సెలవని.. ఆ బాలుడికి అప్పటి వరకు తెలియదు.. మృత్యుమార్గంలో పయనిస్తున్నానని.. కాసేట్లో ఇంటికి చేరతాననేలోగా మృత్యువు లారీ రూపంలో వచ్చి కబళించేసింది. స్థానికులు, పోలీసుల కథనం - తిరుమలగిరి తమిళనాడు రాష్ట్రానికి చెందిన బాల మురుగన్, భాగ్యలక్ష్మి దంపతులు పొట్టచేతపట్టుకొని బతుకుదెరువుకోసం పదేళ్ల క్రితం తిరుమలగిరి మండల కేంద్రానికి వచ్చారు. మార్కెట్ సమీపంలో నివాసముంటూ అప్పడాలు తయారు చేసి విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు శెల్వన్, చిన్న కుమారుడు అలక్ రాజు (9) మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో 5, 3వ తరగతి చదువుతున్నారు. రోజూ మాదిరిగానే పాఠశాల ముగియడంతో సోదరులిద్దరూ నడుచుకుంటూ ఇంటికి వెళుతున్నారు. ఈక్రమంలో తిరుమలగిరి ఎక్స్‌రోడ్డు నుంచి ధాన్యాన్ని తీసుకెళ్లేందుకు వేగంగా వస్తున్న లారీ మార్కెట్ గేటు వద్దే నడుచుకుంటూ వెళ్తున్న అలక్రాజును ఢీకొట్టింది. లారీ ముందు టైరు బాలుడిపై నుంచి వెళ్లడంతో తీవ్రగాయాలపాలై అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. కాగా లారీడ్రైవర్ వాహనాన్ని అక్కడే వదిలి పరారయ్యాడు. సొమసిల్లిన తల్లితండ్రి లారీ ఢీకొనడంతో బాలుడు మృతిచెందాడన్న వార్త మండల కేంద్రంలో దావానంలా వ్యాపించింది. తనతో పాటే వస్తున్న తమ్ముడిని లారీ ఢీకొనడంతో మృతిచెందాడన్న చేదువార్తను శెల్వన్ ఇంటికెళ్లి తల్లితండ్రికి తెలిపాడు. పరుగున అక్కడికి వచ్చిన వారు కళ్ల ముందే విగతజీవిగా పడి ఉన్న కుమారుడిని చూసి బోరున విలపించారు. ‘బతుకుదెరువు కోసం వస్తే.. పుత్రశోకం మిగిల్చావా దేవుడా’ అంటూ వారు రోదించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది. కంటికి రెప్పలా కాపాడుకుంటున్న కుమారుడి మరణాన్ని తట్టుకోలేక ఆ దంపతులు అక్కడే సొమ్మసిల్లి పడిపోయారు. స్థానికుల రాస్తారోకో.. పోలీసుల లాఠీచార్జ్ బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని, ప్రమాదానికి కారణమైన లారీడ్రైవర్‌ను కఠినంగా శిక్షించాలని స్థానికులు ఘటనాస్థలిలోనే రాస్తారోకో చేపట్టారు. తల్లిదండ్రి రాకముందే బాలుడి మృతదేహాన్ని లారీకింద నుంచి ఎందుకు తీశారంటూ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్ద సంఖ్యలో స్థానికులు రాస్తారోకో చేయడంతో కిలోమీటర్ మేర ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. విషయం తెలుసుకుని సీఐ గంగారాం వచ్చి సముదాయించిన ఆందోనకారులు పట్టువీడలేదు. దీంతో పోలీసులు లాఠీచార్జ్ చేసి ఆందోళనకారులను అక్కడి నుంచి చెదరగొట్టారు. సీఐ ఆధ్వర్యంలో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.