bala nagi reddy
-
మంత్రాలయంలో సచివాలయ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి
-
మత్రాలయం వైఎస్ఆర్సీపీ అభ్యర్ధి బాలనాగిరెడ్డి రోడ్ షో
-
ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి అరెస్ట్‌పై హైకోర్టు స్టే
సాక్షి, కర్నూలు: వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి కుటుంబానికి హైకోర్టులో ఊరట లభించింది. మంత్రాలయం నియోజకవర్గంలో ఇటీవల చోటుచేసుకున్న ఘటనపై టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తిక్కారెడ్డి ఫిర్యాదుతో నాగిరెడ్డిపై మాదవరం పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. దీంతో తన తప్పేమీ లేకున్నా పోలీసులు అక్రమంగా కేసు నమోదు చేశారంటూ నాగిరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. అతని పిటిషన్‌పై విచారించిన ధర్మాసనం నాగిరెడ్డిని అరెస్ట్ చేయ్యవద్దంటూ ఉత్తర్వులు జారీ చేసింది. (మంత్రాలయంలో ‘‘తిక్క’’ చేష్టలు) ప్రచారంలో భాగంగా మంత్రాలయం మండలం కగ్గల్లలో తిక్కారెడ్డిని గ్రామస్తులు అడ్డుకుంటారనే అనుమానంతో ఆయన గన్‌మెన్ గాల్లోకి కాల్పులు జరిపిన విషయం తెలిసిందే . దాదాపు 10 రౌండ్ల కాల్పులు జరిపినట్టుగా స్థానికుల సమాచారం. గన్‌మెన్ జరిపిన కాల్పుల్లో తిక్కారెడ్డితోపాటు, అక్కడే ఉన్న ఏఎస్సై గాయపడ్డారు. ప్రశాంతంగా ఉన్న గ్రామంలో టీడీపీ అభ్యర్థి తిక్కారెడ్డి కుట్ర పూరితంగా వ్యవహరించి శాంతి భద్రతలకు విఘాతం కలిగించారని బాలనాగిరెడ్డి అన్నారు. -
ప్రత్యేక హోదా మన హక్కు
కర్నూలు, పెద్దకడబూరు: ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని, దీని సాధనకు పార్టీలకు అతీతంగా పోరాటాలు సాగించాలని మంత్రాలయం ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం ఆయన పెద్దకడబూరు మండలం గంగులపాడు గ్రామంలో విలేకరులతో మాట్లాడారు. ఐదు కోట్ల ఆంధ్రుల మనోభావాలను సీఎం చంద్రబాబు తాకట్టు పెట్టారన్నారు. ఓటుకు కోట్లు కేసు, అవినీతిపై విచారణ చేస్తారన్న భయంతోనే ప్రత్యేక హోదాపై చంద్రబాబు నోరు మెదపడం లేదన్నారు. ఆర్థికంగా ఆంధ్రప్రదేశ్ పేదరాష్ట్రమైనా చంద్రబాబు మాత్రం సీఎంల్లో అందరికంటే ధనికుడిగా ఉన్నట్లు ఏడీఆర్ నివేదిక పేర్కొందని గుర్తు చేశారు. రాజధాని భజన చేస్తూ రాష్ట్ర ప్రయోజనాలను విస్మరించడం శోచనీయమన్నారు. ప్రత్యేక హోదా సాధనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందన్నారు. వామపక్ష నాయకులు సైతం ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తున్నారని, టీడీపీ మాత్రం పక్కనపెట్టిందని విమర్శించారు. రాష్ట్రంలో ఉనికి కోసమే టీడీపీ ఎంపీలు పార్లమెంట్లో ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ డ్రామా ఆడారని విమర్శించారు. రాష్ట్రప్రయోజనాలపై ఏమాత్రం పట్టింపు ఉన్నా వెంటనే టీడీపీ ఎంపీలు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మార్చి ఒకటిన చేపట్టే కలెక్టరేట్ల ముట్టడి, 5న ఢిల్లీ జంతర్‌మంతర్ వద్ద జరిగే ధర్నాకు మద్దతుగా నిలిచేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ప్రత్యేక హోదా వస్తే జననేత జగన్మోహన్రెడ్డికి పేరు వస్తుందన్న భయంతోనే చంద్రబాబు నోరెత్తడం లేదన్నారు. స్వార్థ ప్రయోజనాల కోసం ప్రత్యేక ప్యాకేజీపై మోజు చూపుతున్నారని విమర్శించారు. భవిష్యత్తులో టీడీపీ నాయకులకు ప్రజలు తప్పక బుద్ధి చెబుతారని హెచ్చరించారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర యూత్ కమిటీ సభ్యులు వై.ప్రదీప్‌కుమార్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి పురుషోత్తంరెడ్డి, మండల కన్వీనర్ రామ్మోహన్‌రెడ్డి, ఎంపీపీ రఘురాం, నాయకులు చంద్రశేఖర్‌రెడ్డి, వెంకట్రామిరెడ్డి పాల్గొన్నారు. -
అబద్ధాల బాబును నమ్మకండి
కౌతాళం, న్యూస్‌లైన్ : ఎలాగైనా అధికారంలోకి రావడమే లక్ష్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ అభ్యర్థులు ఆచరణ సాధ్యంకానీ హామీలతోపాటు లేనిపోని మాటలు చెబుతున్నారని, వారిని మోసపోవద్దని మాజీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ప్రజలకు సూచించారు. వైఎస్సార్ ఆశయ సాధనకు పాటుపడుతున్న వైఎస్సార్సీపీకి ఆదరించి అండగా నిలవాలని విజ్ఞప్తిచేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం ఉరుకుందలో ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. చంద్రబాబు పుట్టుకతోనే అబద్ధాలు నేర్చుకున్నాడని, అలాంటి వ్యక్తిపట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మామ ఎన్టీఆర్కే వెన్నుపోటు పొడిచిన మహా ఘనుడని విమర్శించారు. ఇప్పటి వరకు హామీలు ఇస్తున్నారు తప్పితే మొదటి సంతకం ఫలానా ఫైలుపై పెడతానని కచ్చితంగా చెప్పలేని అయోమయ స్థితిలో ఆయన ఉన్నారన్నారు. నియోజకవర్గంలో ఆ పార్టీ టికెట్ ఎవరికి వస్తుందో ఇప్పటికీ తెలియని పరిస్థితి ఉందని, అలాంటిది తిక్కారెడ్డి మొన్న ఆ పార్టీలో చేరి అప్పుడే తమపై విమర్శలు చేయడం బాధాకరమన్నారు. రేడియో మెకానిక్‌గా కాలం వెళ్లదీసిన ఆయన నేడు రూ.50 లక్షల కారులో తిరుగుతున్నాడంటే ప్రజలను ఏ స్థాయిలో మోసం చేశాడో అర్థం చేసుకోవచ్చన్నారు. సారా, లిక్కర్ సంపాదన, నిధులు తీస్తానంటూ ప్రజల్ని మోసం చేసిన సంఘటనలను జనం మరిచిపోలేదన్నారు. తమకు పూర్వీకుల నుంచి ఆస్తులున్నాయని, ప్రజలకు ఇవ్వడం తప్ప దోచుకోవడం తమ కుటుంబానికి తెలియదన్నారు. ప్రజల పక్షాన నిలిచి నాలుగేళ్లుగా రాష్ట్రవ్యాప్తంగా తిరిగి సమస్యలు తెలుసుకున్న రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా పెట్టుకున్న వైఎస్ జగన్మోహన్రెడ్డికి అండగా నిలవాల్సిన బాధ్య త ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. వరుసగా అన్ని ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులను అఖండా మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఆయన గురువారం ఉరుకుంద, ఓబుళాపురం, చిరుతపల్లి, మల్లనహట్టి, కరిణి, తిప్పలదొడ్డి, చూడి, వల్లూరు, గుడికంబాలి, హాల్విలో ప్రచారం నిర్వహిం చారు. జిల్లా అడహక్ కమిటీ సభ్యుడు అత్రితనయగౌడు, మండల క న్వీనరు నాగరాజ్‌గౌడు, పలువురు నాయకలుపాల్గొన్నారు. -
‘దమ్ముంటే కుప్పంలో దీక్ష చేయాలి’
మంత్రాలయం, న్యూస్‌లైన్: రెండు కళ్ల సిద్ధాంతం పాటిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబుకు దమ్ముంటే సొంత నియోజకవర్గంలో దీక్ష చేపట్టాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుడు, తాజామాజీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి డిమాండ్ చేశారు. మంత్రాలయంలో ఆదివారం వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళనలో ఆయన మాట్లాడారు. సమైక్యాంధ్ర ఉద్యమకారుల భయంతోనే డిల్లీలో దీక్ష బూనారన్నారు. ఇక్కడ దీక్ష చేపడితే జనాలు తరిమికొడతారన్న భయంతోనే డిల్లీకి వెళ్తున్నారన్నారు. ఉద్యోగులు, విద్యార్థులు 68 రోజులుగా ఆందోళనలు చేస్తున్నా.. రాష్ట్రం రావణకాష్టంగా మారినా.. కాంగ్రెస్ పాలకులకు కనికరం లేకపోయిందన్నారు. సీమాంధ్ర ఎంపీలు, మంత్రులు కేవలం పదవుల కోసం పాకులాడుతున్నారని ఆరోపించారు. ప్రజలు నమ్మకంతో అధికారం ఇస్తే వారి ఆశలను అడియాసలు చేయడం దారుణమన్నారు. సీమాంధ్ర ఎంపీలు, మంత్రులు దద్దమ్మలని ప్రజలు దుయ్యబడుతున్నా చలనం లేకపోవడం సిగ్గుచేటన్నారు. ఉద్యమాలు రెండురోజులతో తుడిచిపెట్టుకుపోతాయని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అనడంతో విజయనగరం ప్రజలు తిరగబడ్డారన్నారు. ఆస్తులు ధ్వంసం కావడానికి వారి నోటి దురుసు కారణమని తెలిపారు. ఎంపీ హర్షకుమార్ తనయులు ఉద్యమకారులపై దాడి చేయడం దారుణమన్నారు. ప్రజల మనోభావాలకు అనుగుణంగా నడుచుకుపోవాల్సింది పోయి ఇలా రౌడీల్లా వ్యవహరించడం విచారకరమన్నారు. కలిసి ఉండగానే తెలంగాణ నాయకులు రాజోలి బండ నుంచి అక్రమంగా నీటి వాటాను తరలిస్తున్నా..అడిగేనాథుడు లేడన్నారు. ఇక విడిపోతే రాయలసీమ రైతుల పరిస్థితి అగమ్యగోచరమేనన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి సమైక్యాంధ్ర ప్రకటన చేయకపోతే రాష్ట్రం అల్లకల్లోలమవుతుందన్నారు. ఆందోళనలో సర్పంచు తెల్లబండ్ల భీమయ్య, ఉప సర్పంచు వెంకటేష్‌శెట్టి, నాయకులు ప్రభాకర్ ఆచారి, వెంకటరెడ్డి, అశోక్‌రెడ్డి, మల్లి, గోరుకల్లు కృష్ణస్వామి, భాస్కర్, హనుమంతు, వడ్డె ఈరన్న పాల్గొన్నారు.