పోర్న్ మాత్రమేనా.. ఆ రెండింటి మాటేంటి?
నీలిచిత్రాల నిషేధంపై ప్రభుత్వాన్ని విమర్శించే సెలబ్రిటీల సంఖ్య నిమిష నిమిషానికీ పెరుగుతోంది. వర్మ లేవనెత్తిన పాయింట్లకు ఒక్కొక్కరు క్రమంగా మద్దతు పలుకుతున్నారు. తాజాగా ఆ జాబితాలో టాలీవుడ్ దర్శకుడు పూరీ జగన్నాథ్ చేరారు.
ప్రభుత్వం నిజంగా పోర్న్ గురించి అంత ఆందోళన చెందుతుంటే.. స్వాతంత్ర్యం వచ్చి 65 ఏళ్లు అవుతున్నా యువతను మద్యం, సిగరెట్ల బారి నుంచి ఎందుకు రక్షించడం లేదని పూరీ ప్రశ్నించారు. సిగరెట్లు, మద్యాన్ని కూడా దేశంలో నిషేధించి, యువతను సంరక్షించాలనుకుంటే అప్పుడు తాను ప్రభుత్వ నిర్ణయాన్ని గౌరవిస్తానని అన్నారు.
If so called government really worries abut PORN how come dey never protected youth Frm alcohol n cigarettes since 65 years of independence?
— puri jagan (@purijagan) August 3, 2015
I 'll respect government if dey ban alcohol n cigarettes too in d country for d care of youth !!!
— puri jagan (@purijagan) August 3, 2015