Bandra Kurla Complex
-
Apple Store In India: భారత్‌లో తొలి యాపిల్ రిటైల్ స్టోర్.. ప్రారంభించిన టిమ్‌కుక్!
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న యాపిల్ స్మార్ట్‌ఫోన్ దేశీయ మార్కెట్లోకి అడుగు పెట్టింది. యాపిల్ బీకేసీ (Apple BKC) పేరుతో ముంబైలో ఏర్పాటైన యాపిల్ రిటైల్ స్టోర్‌ను ఆ సంస్థ సీఈవో టిమ్‌కుక్ ప్రారంభించారు. దీంతో ముంబై బాంద్ర కుర్లా కాంప్లెక్స్‌లో అందుబాటులోకి వచ్చిన రిటైల్స్టోర్లో యాపిల్ ఉత్పత్తులను కొనుగోలు చేసే సౌకర్యం కలిగినట్లైంది. ఏప్రిల్ 18న (ఈరోజు) వన్.. టూ..త్రీ అంటూ యాపిల్ ఉద్యోగుల కరతాళ ధ్వనుల మధ్య టిమ్‌కుక్ రిటైల్ స్టోర్‌ను ఘనంగా ప్రారంభించారు. ముందుగా అనున్నకున్నట్లుగా మూహూర్తపు సమయానికి యాపిల్ బీకేసీ స్టోర్ డోర్లను ఓపెన్ చేశారు. అనంతరం స్టోర్ లోపలి నుంచి ఎంట్రన్స్ వద్దకు వచ్చిన టిమ్‌కుక్ భారతీయుల్ని మరింత ఉత్సాహ పరిచేలా చేతులు జోడించి నమస్కరించి ముందుకు సాగారు. ఇక బీకేసీ.. బీకేసీ.. బీకేసీ అంటూ ఉద్యోగులు, వినియోగదారులకు నినాదాల మధ్య ఆ ప్రాంతంలో ఆహ్లాదకర వాతావరణం కనిపించింది. రిటైల్ స్టోర్‌లో అమ్మకాలు ప్రారంభం ఇప్పటివరకు, యాపిల్ సంస్థ యాపిల్ వాచ్,ఐఫోన్, ఐప్యాడ్(Pad),ఐపాడ్ (iPod),ఐమాక్ ఇలా ప్రొడక్ట్‌లను ఆన్లైన్లో లేదంటే థర్డ్ పార్టీ సంస్థల నుంచి అమ్మకాలు, కొనుగోళ్లు జరిగేవి. లేదంటే ఫ్లిప్‌కార్ట్,అమెజాన్ వంటి ఈ కామర్స్ వెబ్సైట్ల ద్వారా యాపిల్ ఉత్పత్తులను కొనుగోలు చేసే అవకాశం లభించేది. ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన యాపిల్ బీకేసీ రిటైల్ స్టోర్‌లో యాపిల్ ప్రొడక్ట్‌లను కొనుగోలు చేయొచ్చు. రూ.738 కోట్ల విలువైన ఉత్పత్తుల ఎగుమతి యాపిల్ సంస్థలో ఏప్రిల్ 2022 నుంచి ఫిబ్రవరి 2023 మధ్యకాలంలో సుమారు 9 బిలియన్ (దాదాపు రూ. 738 కోట్లు) విలువైన ప్రొడక్ట్‌లను ఎగుమతి చేసింది. అందులో 50 శాతానికి పైగా ఐఫోన్లు ఉన్నాయని ఇండియా సెల్యులార్, ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ నివేదిక తెలిపింది.ఇక స్టోర్ల ప్రారంభంతో యాపిల్ బిజినెస్ మరింత వృద్ది సాధింస్తుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) #WATCH | Apple CEO Tim Cook opens the gates to India's first Apple store at Mumbai's Bandra Kurla Complex pic.twitter.com/MCMzspFrvp — ANI (@ANI) April 18, 2023 తెల్లవారుజాము నుంచే పడిగాపులు మరోవైపు రిటైల్ స్టోర్‌ను యాపిల్ ఐఫోన్లను కొనుగోలు చేసేందుకు ఔత్సాహికులు స్టోర్ వద్ద పెద్ద ఎత్తున బారులు తీరారు. స్టోర్ ప్రారంభించేందుకు ఇంకా సమయం ఉన్నప్పటికీ మంగళవారం తెల్లవారు జాము నుంచి దీని ముందు పడిగాపులు కాశారు.ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ చక్కెర్లు కొడుతున్నాయి. -
రిజల్ట్స్ విడుదల చేస్తారా.. లేదంటే బాంబు వేయమంటారా?
ముంబై: మహారాష్ట్రలోని ముంబై విశ్వవిద్యాలయానికి బాంబు బెదిరింపులు వచ్చాయి. ఫలితాలు విడుదల చేయకపోతే విశ్వవిద్యాలయాన్ని బాంబులు వేసి పేల్చేస్తామని ఈమెయిల్స్‌లో హెచ్చరికలు వచ్చాయి. డిగ్రీ సెమిస్టర్ ఫలితాలు విడుదల చేయకపోతే తాము చెప్పిన పని చేస్తామని స్పష్టం చేశారు. ఆ పని విద్యార్థులే చేసి ఉంటారని అధికారులు భావిస్తున్నారు. బ్యాచిల్ ఆఫ్ ఆర్ట్స్ (బీఏ), బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ (బీఎస్సీ), బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ (బీకామ్) సెమిస్టర్ ఫలితాలు విడుదల చేయాలని విశ్వవిద్యాలయ పరీక్షల నిర్వహణ, మూల్యంకన విభాగం డైరెక్టర్ మెయిల్‌కు బాంబు బెదిరింపు వచ్చింది. వెంటనే అధికారులు ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఐపీ అడ్రస్ ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. ముంబై విశ్వవిద్యాలయం ఇటీవల చివరి సంవత్సర విద్యార్థుల సెమిస్టర్ ఫలితాలు ఆలస్యంగా విడుదల చేసింది. మిగిలిన వారి ఫలితాలను కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఇంకా విడుదల చేయలేదు. ఈ నేపథ్యంలోనే పలువురు విద్యార్థులు విశ్వవిద్యాలయానికి బెదిరింపులకు పాల్పడ్డారని తెలుస్తోంది. -
రూ.21 కోట్ల అద్దె ఎవరు కడతారు..?
సాక్షి, ముంబై: ముంబై బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ (బీకేసీ)లోని ఎంఎంఆర్డీఏ మైదానంలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘మేకిన్ ఇండియా’ జోరుగా సాగుతోంది. అయితే కార్యక్రమానికి వినియోగిస్తున్న మైదానం అద్దె విషయమై మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. అద్దె చెల్లించే ప్రసక్తే లేదని ఎంఎంఆర్డీఏ ఎంఐడీసీ స్పష్టం చేయడంతో మరి రూ.21 కోట్లు ఎవరు కడతారన్నది ప్రశ్నార్థకమైంది. బీకేసీలో శనివారం నుంచి మేకిన్ ఇండియా కార్యక్రమం ప్రారంభమైన విషయం తెలిసిందే. వారం రోజులపాటు కొనసాగనున్న ఈ కార్యక్రమానికి 12 రోజుల ముందు అదీనంలోకి తీసుకుని ఏర్పాట్లు చేశారు. సాధారణంగా ఏర్పాట్లు చేసిన రోజులకు సగం, కార్యక్రమం ముగిసేలోపు మిగతా అద్దె వసూలు చేస్తారు. ప్రభుత్వ కార్యక్రమాలకు మైదానాన్ని గతంలో ఉచితంగా ఇచ్చేవారు. ఇటీవల ఓ కార్యక్రమంపై తలెత్తిన వివాదాన్ని దృష్టిలో ఉంచుకుని ఎమ్మెమ్మార్డీయే ఈ మైదానాన్ని ఉచితంగా ఇవ్వడం నిలిపేసింది. అయితే ప్రభుత్వ కార్యక్రమాలకు మాత్రం రాయితీ ఇస్తోంది. ఆ ప్రకారం మేకిన్ ఇండియా కార్యక్రమానికి రూ.21 కోట్లు అద్దె చెల్లించాల్సి ఉంటుందని ఎంఐడీసీకి ఎమ్మెమ్మార్డీయే స్పష్టం చేయగా చెల్లించలేమని ఎంఐడీసీ తెలిపింది. సమావేశమూ ఏర్పాటు చేయలేదు.. మైదానం ఉచితంగా ఇవ్వాల్సి వస్తే నిర్ణయం తీసుకునేందుకు ఎమ్మెమ్మార్డీయే ఓ ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేస్తుంది. అయితే మేకిన్ ఇండియా కార్యక్రమానికి అద్దెకు ఇచ్చే ముందు అలాంటి సమావేశం జరగలేదు. దీంతో కార్యక్రమం అద్దె ఎవరు చెల్లిస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. -
గోద్రేజ్ బీకేసీ ప్రాజెక్టును కొనుగోలు చేసిన అబాట్
డీల్ విలువ రూ.1,480 కోట్లు అతి పెద్ద రియల్టీ లావాదేవీల్లో ఒకటి న్యూఢిల్లీ: గోద్రేజ్ ప్రొపర్టీస్ సంస్థ బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (బీకేసీలో)ని 4.35 లక్షల చదరపుటడుగుల కమర్షియల్ ప్రాజెక్ట్‌ను ఫార్మా దిగ్గజం అబాట్‌కు విక్రయించింది. ఈ డీల్ విలువ రూ.1,480 కోట్లు. భారత్‌కు సంబంధించి అతి పెద్ద రియల్ ఎస్టేట్ డీల్స్‌లో ఇదొకటి. ముంబైలో ఉన్న తన వ్యాపారాన్నంతటినీ ఒకే ప్రాంతానికి తరలించే వ్యూహంలో భాగంగా అబాట్ కంపెనీ ఈ ప్రాజెక్ట్‌ను కొనుగోలు చేసింది. ఇక్కడ కార్పొరేట్ కార్యాలయాన్ని ఏర్పాలు చేయాలని అబాట్ యోచిస్తోంది. కాగా ఈ నిధులతో కంపెనీ రుణ భారాన్ని తగ్గించుకుంటామని, భవిష్యత్ వృద్ధికి వినియోగించుకుంటామని గోద్రేజ్ ప్రొపర్టీస్ ఎండీ, సీఈఓ పిరోజ్షా గోద్రేజ్ చెప్పారు. ఇంకా ఈ ప్రాజెక్టులో తమకు 3 లక్షల చదరపుటడుగుల స్పేస్ ఉందని, త్వరలో ఈ స్పేస్‌ను కూడా విక్రయిస్తామని వివరించారు. జెట్ ఎయిర్‌వేస్‌తో కలిసి గోద్రేజ్ సంస్థ బీకేసీని అభివృద్ధి చేస్తోంది. ఈ ప్రాజెక్ట్ నిర్మాణ కార్యకలాపాలను లార్సెన్ అండ్ టుబ్రో చూస్తోంది. ఈ ఏడాది మార్చినాటికి గోద్రేజ్ ప్రొపర్టీస్ రుణ భారం రూ.2,764 కోట్లుగా ఉంది.