ముంబైలో కుదరదు.. బెంగళూరులోనే!
ముంబై: ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే టీ20 టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ ను బెంగళూర్ లోనే నిర్వహించాలని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ నిర్ణయించింది. ఐపీఎల్7 ఫైనల్ మ్యాచ్ ను ముంబైలో నిర్వహించాలని ముంబై క్రికెట్ అసోసియేషన్ చేసిన విజ్క్షప్తిని గవర్నింగ్ కౌన్సిల్ తోసిపుచ్చింది.
శనివారం జరిగిన సమావేశంలో బెంగళూరులోనే ఐపీఎల్ ఫైనల్ నిర్వహించడానికి గవర్నింగ్ కౌన్సిల్ నిర్ణయం తీసుకుందని బీసీసీఐ కార్యదర్శి సంజయ్ పటేల్ వెల్లడించారు. ముంబైలో మ్యాచ్ నిర్వహణకు అనుకూలమైన పరిస్థితులున్నాయని.. పది గంటల తర్వాత టపాసులు కాల్చేందుకు ముంబై పోలీసుల అనుమతి ఉందని ఎంసీఏ లేఖ రాసింది.
అన్ని అనుమతులను శరద్ పవార్ తీసుకున్నారని.. అయితే బెంగళూరులోనే నిర్వహించడానికి ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ నిర్ణయం తీసుకుందనే విషయం తమకు తెలియదని ఎంసీఏ కార్యదర్శి నితిన్ దలాల్ తెలిపారు.