at bank
-
బ్యాంకు వద్ద నగదు చోరీ
పెద్దవడుగూరు (తాడిపత్రి) : పెద్దవడుగూరులోని ఆంధ్రా బ్యాంకు అవరణలో కాశేపల్లికి చెందిన కూళ్లాయిరెడ్డి అనే ఖాతాదారుడికి చెందిన రూ.14 వేల నగదు బుధవారం చోరీకి గురైంది. తన ఖాతా నుంచి రూ.24 వేలు డ్రా చేయగా రూ.2 వేల నోట్లను ఎంచుకుని జేబులో ఉంచుకున్నారు. మిగిలిన రూ.100 నోట్లను లెక్కిస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు రూ.14 వేలు నగదును చోరీ చేసినట్లు బాధితుడు పోలీసులు, బ్యాంక్ అధికారులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. నెల రోజుల వ్యవధిలో రెండుసార్లు ఖాతాదారుల నగదు చోరీకి గురవడం ఆందోళన కలిగిస్తోంది. -
బ్యాంకు వద్ద వృద్ధుడికి టోకరా
జీలుగుమిల్లి : మండలంలోని దర్భగూడెంలోని బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖలో బుధవారం ఓ వృద్ధుడి నుంచి రూ.14వేల 500లను ఓ అగంతకుడు చోరీ చేశాడు. ఈ చోరీపై హెడ్‌కానిస్టేబుల్ ఇరపం భాస్కర్ కథనం ప్రకారం.. దర్బగూడెం గ్రామానికి చెందిన రిటైర్డ్ ఉద్యోగి సయ్యద్ నన్నా సాహెబ్ తన పింఛన్ డబ్బు తీసుకోవాడానికి బ్యాంక్ ఆఫ్ ఇండియా దర్బగూడెం శాఖకు బుధవారం ఉదయం వెళ్లాడు. బ్యాంకులో రూ.14.500లు సొమ్ము డ్రాచేసుకుని బయటకు వస్తుండగా పక్కనే ఉన్న ఓ వ్యక్తి మిమ్మలి క్యాషియర్ పిలుస్తున్నారని చెప్పాడు. వృద్ధుడు వెనుకకు తిరిగి కౌంటర్ వైపు వెళ్తుండగా సంచిలో ఉన్న సొమ్మును పట్టుకుని ఉడాయించాడు. ఈ విషయంపై బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ తెలిపారు.