banks merger
-
రెండు రోజుల బ్యాంకుల సమ్మె
సాక్షి, న్యూఢిల్లీ: ప్రభుత్వ బ్యాంకుల విలీనాన్ని మొదటినుంచీ వ్యతిరేకిస్తున్న బ్యాంకింగ్ యూనియన్లు మరోసారి సంచలన నిర్ణయం తీసుకున్నాయి. నాలుగు బ్యాంక్ ఆఫీసర్స్ ట్రేడ్ యూనియన్ సంస్థలు కీలక నిర్ణయాన్ని తీసుకున్నాయి. ఈ మేరకు ప్రతిపాదనలను ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్‌కు ఇచ్చిన నోటీసులిచ్చాయి. ముఖ్యంగా 10 ప్రభుత్వ బ్యాంకుల విలీన నిర్ణయానికి వ్యతిరేకంగా సమ్మె సైరన్ మోగించనున్నాయి. ఈ మేరకు బ్యాంకింగ్ రంగంలో విలీనాలు, సమ్మేళనాలకు వ్యతిరేకంగా సెప్టెంబర్ 25 అర్ధరాత్రి నుంచి 27 అర్ధరాత్రి వరకు నిరంతర సమ్మెకు పిలుపునిచ్చాయి. అలాగే నవంబర్ రెండవ వారం నుండి నిరవధిక సమ్మెకు వెళ్లాలని ప్రతిపాదించాయి. ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ (ఏఐబీఓసీ) ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ (ఏఐబీఓఏ), ఇండియన్ నేషనల్ బ్యాంక్ ఆఫీసర్స్ కాంగ్రెస్ (ఐఎన్‌బీఓసీ), నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ బ్యాంక్ ఆఫీసర్స్ (ఎన్ఓబీఓ) సంయుక్తంగా ఈ సమ్మె నోటీసును అందించాయి. 4 Bank Officers' Trade Union Organisations have proposed to go on a continuous strike from midnight of 25 Sept to midnight of 27 Sept and on an indefinite strike from second week of Nov 2019, against the mergers & amalgamations in banking sector. pic.twitter.com/o3YGUisbAZ — ANI (@ANI) September 13, 2019 -
విజయా, దేనా బ్యాంక్ విలీనం?
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనంపై కేంద్రం దృష్టి సారించిన నేపథ్యంలో తాజాగా మరో రెండు బ్యాంకులు ఈ దిశగా కసరత్తు చేస్తున్నాయి. మధ్య స్థాయి పీఎస్‌యూ బ్యాంకులైన విజయా, దేనా బ్యాంక్ దీనిపై ప్రాథమిక చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. విలీనమైతే చేకూరే ప్రయోజనాలు, ఎదురయ్యే సవాళ్లు మొదలైన అంశాలపై రెండు బ్యాంకుల బోర్డులు చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తే..ఈ ఆర్థిక సంవత్సరం ఆఖరు నాటికే విలీనం పూర్తి కావొచ్చన్న అంచనాలు నెలకొన్నాయి. విజయా బ్యాంకుకు దక్షిణాది రాష్ట్రాల్లో పట్టు ఉండగా, దేనా బ్యాంక్‌కు మహారాష్ట్ర, దాని పొరుగు రాష్ట్రాల్లో కార్యకలాపాలు ఉన్నాయి. ఈ రెండూ కలిస్తే ఓబీసీ తరహాలో మధ్య స్థాయి పెద్ద బ్యాంకుల్లో ఒకటిగా నిలవొచ్చని భావిస్తున్నారు. పశ్చిమ, దక్షిణాది రాష్ట్రాల్లో బ్యాంకింగ్ సేవలు మరింతగా విస్తరించే అవకాశం ఉంటుంది. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో విజయా బ్యాంక్ లాభాలు 57% పెరిగి రూ. 255 కోట్లకు చేరగా, మొండిబకాయిలు 7.3%గా ఉన్నాయి. క్యూ1లో దేనా బ్యాంక్ నష్టాలు రూ.133 కోట్లకు తగ్గగా, ఎన్పీఏలు 17.37 శాతానికి ఎగిశాయి. ప్రస్తుతం దేనా బ్యాంక్ లాభదాయకతను మెరుగుపర్చే పనిలో ఉంది. దేనా బ్యాంకుకు భారీ ఎన్పీఏలు ఉన్న నేపథ్యంలో.. విలీనమైతే ఏర్పడే బ్యాంకు మూలధన అవసరాలు మరింత అధికంగానే ఉండొచ్చు. -
ఎస్బీఐ అనుబంధ బ్యాంకుల విలీనం రికార్డ్ తేదీ ఈ నెల 17
⇒ 10 ఎస్‌బీబీజే షేర్లకు 28 ఎస్బీఐ షేర్లు ⇒ 10 ఎస్బీటీ, ఎస్‌బీఎమ్ షేర్లకు చెరో 22 ఎస్బీఐ షేర్లు న్యూఢిల్లీ: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ)లో అనుబంధ బ్యాంక్‌ల విలీనానికి మరో అడుగు ముందుకు పడింది. అనుబంధ బ్యాంక్‌ల షేర్ల స్వాపింగ్‌కు రికార్డ్ డేట్‌గా ఈ నెల 17ను ఎస్బీఐ నిర్ణయించింది. ఏప్రిల్ 1 కల్లా అన్ని ఎస్బీఐలో ఐదు అనుబంధ బ్యాంక్‌లు విలీనం కానున్న విషయం తెలిసిందే. స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనూర్ అండ్ జైపూర్(ఎస్‌బీబీజే) వాటాదారులు ప్రతి పది షేర్లకు గాను 28 ఎస్బీఐ షేర్లను పొందుతారు. అలాగే స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్(ఎస్‌బీఎమ్), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్కూర్(ఎస్బీటీ) వాటాదారులు ప్రతి పది షేర్లకు గాను 22 ఎస్బీఐ షేర్లను పొందుతారు. ఈ విలీనం తర్వాత ఈ ఎస్బీఐ అనుబంధ బ్యాంక్‌లు స్టాక్ మార్కెట్ నుంచి డీలిస్ట్ అవుతాయి. ఎస్బీపీ, ఎస్‌బీహెచ్‌లు ఎస్బీఐకి పూర్తి అనుబంధ బ్యాంక్‌లు కావడం వల్ల వీటికి షేర్ల స్వాపింగ్ ఉండదు. ఎస్బీఐలో ఐదు అనుబంధ బ్యాంక్‌లు–స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనూర్ అండ్ జైపూర్(ఎస్‌బీబీజే), స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్(ఎస్‌బీఎమ్), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్కూర్(ఎస్బీటీ), స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలా(ఎస్బీపీ), స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్(ఎస్బీహెచ్)లు విలీనం కానున్న విషయం తెలిసిందే. -
బ్యాంకుల విలీనానికి ఎస్బీఐ బోర్డు సై
బ్యాంకుల విలీనాలపై ఎన్ని అభ్యంతరాలు వస్తున్నా.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బోర్డు మాత్రం విలీనాలకే సై అంటోంది. నాలుగు బ్యాంకులను విలీనం చేసుకోడానికి ఆ బోర్డు గురువారం నాడు ఆమోదం తెలిపింది. అయితే ఈ విలీనానికి ఇంకా చాలారకాల అనుమతులు రావల్సి ఉంటుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావన్‌కోర్, భారతీయ మహిళా బ్యాంకుల విలీనానికి బోర్డు ఆమోదం తెలిపింది. భారతీయ స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ సమయం ముగిసిన తర్వాత ఈ విషయం బయటకు వచ్చింది. జూన్ మధ్యవారంలో ప్రభుత్వం ఆరు బ్యాంకులను స్టేట్‌బ్యాంకులో విలీనం చేయడానికి సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. ఇది అందరికీ ఉపయోగకరంగానే ఉంటుందని స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్పర్సన్ అరుంధతీ భట్టాచార్య వ్యాఖ్యానించారు. ఆరింటిలో నాలుగు బ్యాంకుల ఆమోదానికి బోర్డు ఓకే చెప్పింది. మిగిలిన రెండు బ్యాంకులు.. స్టేట్‌బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలా