బ్యాంకుల విలీనానికి ఎస్‌బీఐ బోర్డు సై
బ్యాంకుల విలీనాలపై ఎన్ని అభ్యంతరాలు వస్తున్నా.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బోర్డు మాత్రం విలీనాలకే సై అంటోంది. నాలుగు బ్యాంకులను విలీనం చేసుకోడానికి ఆ బోర్డు గురువారం నాడు ఆమోదం తెలిపింది. అయితే ఈ విలీనానికి ఇంకా చాలారకాల అనుమతులు రావల్సి ఉంటుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావన్‌కోర్, భారతీయ మహిళా బ్యాంకుల విలీనానికి బోర్డు ఆమోదం తెలిపింది.
భారతీయ స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ సమయం ముగిసిన తర్వాత ఈ విషయం బయటకు వచ్చింది. జూన్ మధ్యవారంలో ప్రభుత్వం ఆరు బ్యాంకులను స్టేట్‌బ్యాంకులో విలీనం చేయడానికి సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. ఇది అందరికీ ఉపయోగకరంగానే ఉంటుందని స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్‌పర్సన్ అరుంధతీ భట్టాచార్య వ్యాఖ్యానించారు. ఆరింటిలో నాలుగు బ్యాంకుల ఆమోదానికి బోర్డు ఓకే చెప్పింది. మిగిలిన రెండు బ్యాంకులు.. స్టేట్‌బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలా