బాస్కెట్బాల్ లో తిరుగులేని అమెరికా
మాడ్రిడ్: బాస్కెట్బాల్ లో తమకు ఎదురులేదని అమెరికా మరోసారి రుజువు చేసింది. ప్రపంచకప్ టైటిల్ ను నిలబెట్టుకుని తమ హవా కొనసాగించింది. మాడ్రిడ్ పాలసియో డీ రిపోర్టిస్ లో ఆదివారం జరిగిన ఫైనల్లో సెర్బియాను 129-92 తేడాతో ఓడించి వరల్డ్ కప్ టైటిల్ కైవసం చేసుకుంది.
అయితే ప్రపంచ రికార్డు స్కోరుకు 8 పాయింట్ల దూరంలో నిలిచింది అమెరికా. 1994 నాటి ప్రపంచకప్ ఫైనల్లో 137 పాయింట్లు సాధించింది. తమ కంటే మెరుగ్గా రాణించిన అమెరికాకు ప్రపంచ కప్ టైటిల్ దక్కడం నూటికి నూరుపాళ్లు సమంజసమని సెర్బియా వ్యాఖ్యానించి క్రీడాస్ఫూర్తిని చాటుకుంది.