bbc reporter
-
లైవ్‌లో యాంకర్.. వెనకాల డ్యాన్సర్
-
లైవ్‌లో యాంకర్.. వెనకాల డ్యాన్సర్
లండన్: టీవీలో కనపడాలని చాలా మంది ఆశపడుతుంటారు. ఏదైనా సంఘటన జరిగి.. మీడియా వాళ్లు వస్తే చాలు.. జనాలు ఎగబడిపోతుంటారు. యాంకర్ల తమ పని తాము చేసుకుని పోతుంటే.. టీవీలో కనపడాలనే ఔత్సాహికులు తమ పని తాము చేసుకు పోతుంటారు. తాజాగా ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఓ యాంకర్ బీచ్ నుంచి రిపోర్టింగ్ చేస్తుండగా.. ఆమె వెనకే ఓ పిల్లాడు డ్యాన్స్ చేస్తున్నాడు. విశేషం ఏంటంటే.. ఈ పిల్లాడి చేష్టల గురించి యాంకర్‌కు ఏ మాత్రం తెలియదు. ఈ సంఘటన యూకేలోని సౌత్ షీల్డ్స్‌లోని ఓ బీచ్‌లో చోటు చేసుకుంది. (రాజీవ్ గుప్తాకు యూకే ప్రధాని ప్రశంస) వివరాలు.. బీబీసీ ప్రజెంటర్ జెన్ బార్ట్రామ్ లైవ్‌లో రిపోర్టింగ్ చేస్తున్నారు. ఇది గమనించి లియోగా అనే ఓ పిల్లాడు లైవ్ టెలికాస్ట్ జరుగుతుండగా.. యాంకర్ వెనక చేరి.. పిల్ల చేష్టలు చేయడం ప్రారంభించాడు. షర్ట్ పైకి లేపి.. డ్యాన్స్ కూడా చేశాడు. అయితే దీని గురించి జెన్‌కు ఏ మాత్రం తెలియదు. యాంకర్ రిపోర్టింగ్‌తో పాటు లియోగా చిలిపి చేష్టలు కూడా రికార్డయ్యాయి. ఆ తర్వాత వీడియో చూసి ఆమె ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ వీడియోను తన ట్విట్టర్లో షేర్ చేయడంతో ప్రస్తుతం ఇది తెగ వైరలవుతోంది. ఇది చూసిన నెటిజనులు లియోగా చిలిపి చేష్టలకు తెగ నవ్వుకుంటున్నారు. -
ఎక్కడి నుంచో వచ్చి
ఈ ఫీలింగ్ ప్రతి చోటా ఉంటోంది. కానీ ఉండొచ్చా! అందరం ఈ భూమ్మీది వాళ్లమేగా?! స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఉంటుంది. కిరీటంపై ముళ్లలా జాతి విద్వేషం! బ్రిటన్‌లో గాంధీ విగ్రహం ఉంటుంది. వెనకే.. దాగి ఉండే జాత్యహంకారం. సీమా కొటేచా సీనియర్ జర్నలిస్ట్. సంక్షోభం ఎక్కడుంటే అదే తన జన్మభూమి. ‘ఎక్కడి నుంచో వచ్చి...’ అనే మాట ఈ విశ్వ పౌరురాలికీ తప్పలేదు! బిబిసి సీనియర్ రిపోర్టర్ సీమా కొటేచా లండన్‌లోని తన ప్రధాన కార్యాలయానికి లైవ్ రిపోర్టింగ్ ఇస్తున్నారు. ‘‘ప్రధాని బోరిస్ జాన్సన్ లాక్‌డౌన్‌ని సడలించాలని భావిస్తున్నారు. మీ ఉద్దేశం ఏమిటి?’’.. ప్రజాభిప్రాయాన్ని తెలుసుకుంటున్నారు. ఈస్ట్ మిడ్‌ల్యాండ్ ప్రాంతంలోని లెహ్‌స్టర్ నుంచి రిపోర్ట్ చేస్తున్నారు సీమ, ఆమె కెమెరా బృందం. ఇంగ్లండ్‌లో స్థానికులు కాని వాళ్లు యాభై శాతం కంటే ఎక్కువగా ఉన్న తొలి పట్టణం లెహ్‌స్టర్. గుజరాతీలు ఎక్కువగా ఉంటారు. గాంధీ మహాత్ముడి విగ్రహం కూడా ఉంది. అయితే అక్కడ జాతివిద్వేషం కూడా ఉన్నట్లు ఆదివారం నాడు సీమ రిపోర్టింగ్ చేస్తున్నప్పుడు తొలిసారిగా బయటపడింది! తల్లిదండ్రులతో సీమ , సీమా కొటేచా: ప్రోగ్రామ్‌కి అంతరాయం లెహ్‌స్టర్ సిటీ సెంటర్లో సీమ ఒక్కొక్కరినీ అభిప్రాయం అడుగుతున్నారు. వారిలో కొందరు కరోనా నుంచి కోలుకున్న వారు కూడా ఉన్నారు. సీమ టీమ్ ముందే వారిని ఎంపిక చేసి పెట్టుకుంది. అయితే అభిప్రాయం తెలుసుకునే లోపే సీమ వెనుక నుంచి కెమెరాలో కనిపించేలా ఒక వ్యక్తి సీమను కామెంట్ చేయడం మెదలు పెట్టాడు. ‘యూ.. పాకీ ఉమన్, గో అవే’ అన్నాడు. పాకిస్తానీలను, ఇతర ఆసియా దేశాల వారిని కరడుగట్టిన బ్రిటన్, అమెరికా జాతీయవాదులు అవమానకరంగా అనే మాట అది. ఒంటి రంగును బట్టి కించపరచడం. సీమ భారతీయ సంతతి యువతి. తను పుట్టింది ఇంగ్లండ్‌లోనే. బేసింగ్స్టోక్లో. తనను తిడుతున్న వ్యకిని సీమ మొదట పట్టించుకోలేదు. ఇలాంటివి ఆమెకు కొత్త కూడా కాదు. ఆమె స్వస్థలం బేసింగ్స్టోక్లోనే 2016లో బ్రెగ్జిట్‌పై వోక్స్ పాప్ (జనాభిప్రాయ సేకరణ)లో ఉన్నప్పుడు తొలిసారి ఈ మాట విన్నారు సీమ. తను పుట్టాక తొలిసారి! జాతివిద్వేష దూషణలు ఇంకా ఉన్నాయా అని ఆశ్చర్యపోయారు. మళ్లీ ఇప్పుడు లెహ్స్టర్లో! అతడు ఆ ఒక్కమాటలో ఆగలేదు. బతకడానికి వస్తారని, ఉద్యోగాలన్నీ దోచుకుంటారనీ, తక్కువ జాతివారనీ.. ఇలా సాగుతూనే ఉంది. అవన్నీ లైవ్‌లో వెళ్లిపోతున్నాయని గమనించిన తక్షణం తన ప్రోగ్రామ్ని ఆపేశారు సీమ. అభిప్రాయాల కోసం తను పిలిపించిన వారికి క్షమాపణ కూడా చెప్పారు. రిపోర్టింగ్‌ని అడ్డుకోవడమే కాకుండా, తన ఉద్యోగులపై జాతి విద్వేష దూషణలు చేసిన వ్యక్తిని బిబిసి తీవ్రంగా పరిగణించింది. కొద్ది గంటల్లోనే గ్రెన్‌ఫీల్డ్ రోడ్ అనే యాభై ఏళ్ల ఆ నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆన్లైన్లో కోర్టు ముందు ప్రవేశపెట్టారు. జూన్ పదిహేనున అతడు లెహ్‌స్టర్ క్రౌన్ కోర్టుకు హాజరు కావలసి ఉంటుందని ఆదేశించి బెయిల్‌పై విడుదల చేశారు. దీనర్థం గ్రెన్‌ఫీల్డ్ తగిన శిక్షను అనుభవించబోతున్నాడని. వేరే సాక్ష్యాధారాలు అవసరం లేదు. కెమెరాలో ఉన్నవి చాలు. ఈ విషయంలో బ్రిటన్ మీడియా మొత్తం ఆమెకు మద్దతుగా నిలిచింది. 2003లో బిబిసి రేడియోలో తన కెరియన్‌ని ప్రారంభించారు సీమ. ‘పనోరమా’ రేడియో 4లోని ‘టుడే ప్రోగ్రామ్’, ‘బిబిసి న్యూస్’ ఆమెకు గుర్తింపు తెచ్చిపెట్టాయి. ఆప్ఘనిస్తాన్ యుద్ధ సమయంలో హెల్మండ్ ప్రావిన్స్ నుంచి, సిరియా శరణార్థుల సంక్షోభంలో లెబనాన్ నుంచి, 2010 హైతీ భూకంప బాధిత ప్రాంతాల నుంచి సీమ చేసిన రిపోర్టింగ్ ఆమెను అత్యుత్తమస్థాయి జర్నలిస్టుగా నిలబెట్టింది. సీమ బేసింగ్స్టోక్లోని క్వీన్స్ మేరీ కాలేజ్‌లో చదివారు. లండన్ గోల్డ్స్మిత్స్ యూనివర్శిటీలో జర్నలిజం చేశారు. ఆమె తల్లిదండ్రులు ఇండియా నుంచి వచ్చి బ్రిటన్‌లో స్థిరపడ్డారు. ఇద్దరు పిల్లలు. సీమ, శ్యామ్ (సీమ అన్న). -
కామన్వెల్త్లో ఓ ఫన్నీ సన్నివేశం
-
రిపోర్టర్ పై విరుచుకుపడిన ముఖ్యమంత్రి
పెద్దనోట్ల రద్దుపై ప్రశ్నించిన ఓ రిపోర్టర్ పై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ విరుచుకుపడ్డారు. రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించిన నిర్ణయాన్ని కేజ్రీవాల్ వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా బీబీసీ హిందీ చానెల్ కు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. దేశవ్యాప్తంగా 55 మంది మరణించడానికి కారణం నోట్ల రద్దేనని ఎలా చెబుతారని బీబీసీ రిపోర్టర్ కేజ్రీవాల్‌ను ప్రశ్నించారు. దీంతో కోపోద్రిక్తుడైన ఢిల్లీ సీఎం.. మీడియాలో మీలాంటి ఉద్యోగులందరూ ధైర్యం ఉంటే ఈ ప్రశ్నను డబ్బుకోసం ఏటీఎంల ముందు బారులు తీరుతున్న జనాన్ని అడగాలని సమాధానమిచ్చారు. అందుకు స్పందించిన బీబీసీ రిపోర్టర్. ఆ ప్రశ్నను సంధించడం తన వృత్తిధర్మమని అన్నారు. ఓ రిపోర్టర్ గా తప్పు, ఒప్పులను విడిగొట్టడం తన బాధ్యత అని చెప్పారు. పెద్ద నోట్ల అనంతరం సంభవించిన మరణాలన్నీ దానివల్లే జరిగాయనడం సమజసం కాదని అన్నారు. రిపోర్టర్ ఇచ్చిన సమాధానంపై టీవీ కెమెరా వైపు చూస్తూ మాట్లాడిన కేజ్రీవాల్.. బీబీసీ ఎంత నిజాయితీ కలిగిన మీడియా సంస్ధో గుర్తించాలన్నారు. అదే సమయంలో రిపోర్టర్ జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించగా.. పెద్దస్వరంతో సమస్య ఎంత తీవ్రంగా ఉందో గుర్తించాలని తెలిపారు. పెద్దనోట్ల రద్దే మరణాలకు కారణమని రిపోర్టర్లు చెప్పకపోవడం సిగ్గుచేటని అన్నారు. కేజ్రీవాల్ బదులు ఆయన డ్రైవర్ డబ్బును డ్రా చేశారని రిపోర్టర్ చెప్పగా.. అంతమాత్రాన ఆ 55 మంది మరణానికి పెద్దనోట్ల రద్దు కారణం కాదంటారా అని ప్రశ్నించారు. దేశంలో సంపన్నులెవరూ నోట్లరద్దు వల్ల ఇబ్బందులు ఎదుర్కొలేదని చెప్పారు. దీనికి ప్రతిగా స్పందించిన రిపోర్టర్ అది మీ సొంత వ్యాఖ్యేనని అనడంతో ఉద్రేకంతో ఊగిపోయిన కేజ్రీవాల్.. జర్నలిస్టులు దీన్ని పనికిమాలిన సమస్యగా మార్చాలని చూస్తున్నారని కామెంట్ చేశారు. ఆపై రిపోర్టర్ ను చూస్తూ మాట్లాడిన కేజ్రీవాల్.. ఇంటర్వ్యూ చేయాలంటే సరిగా చేయాలన్నారు. అందుకు ప్రతిగా ప్రశ్నలకు స్పందించకుండా నిందించడం సబబు కాదని రిపోర్టర్ అన్నారు.