bbnagar
-
బీబీనగర్‌లో భారీ అగ్ని ప్రమాదం.. నిప్పురవ్వలు ఎగిసి
సాక్షి, యాదాద్రి: బీబీనగర్ మండలం బ్రాహ్మణపల్లిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. హిందూస్థాన్ శానిటరీ గోడౌన్లో మంటలు ఎగిసిపడుతున్నాయి. గోడౌన్ సమీపంలో ఉన్న వ్యవసాయ క్షేత్రంలో రైతులు గడ్డి తగులబెట్టారు. ఈ క్రమంలో నిప్పు రవ్వలు ఎగిరి గోడౌన్‌లోని కాటన్ బాక్స్‌లపై పడ్డాయి. దీంతో మంటలు వ్యాపించాయి. చుట్టుపక్కల ప్రాంతాల్లో దట్టంగా పొగ అలుముకుంది. ఫైర్ సిబ్బంది మంటలార్పుతున్నారు. -
టీబీ రోగులకు డ్రోన్ సేవలు
బీబీనగర్ : టీబీ రోగుల కోసం బీబీనగర్ ఎయిమ్స్ ప్రయోగాత్మకంగా చేపట్టిన డ్రోన్ సేవలు విజయవంతమయ్యాయి. టీబీ రోగులు, అనుమానితుల నుంచి రక్త పరీక్షలకు నమునాలు సేకరించి వెనువెంటనే ల్యాబ్‌లకు పంపించడం, తిరిగి అవసరమైన మందులను రోగులకు పంపేందుకు డ్రోన్ సాయం తీసుకున్నారు. గ్రామీణ ప్రాంతాలు, తండాలపరిధిలో 150 మంది నమునాలను సేకరించి డ్రోన్ ద్వారా ల్యాబ్‌లకు పంపి.. తిరిగి మందులు చేరవేశారు. ఆదివారం ఎయిమ్స్ డైరెక్టర్ వికాస్‌భాటియా డ్రోన్ సేవల గురించి వెల్లడించారు.రెండు నెలలుగా డ్రోన్ సేవలపై చేపట్టిన ప్రయోగాలు ఫలించడంతో టీబీ రోగులకు చాలా సులువుగా సేవలు అందుతున్నాయి. పైలెట్ ప్రాజెక్ట్ కింద చేపట్టిన డ్రోన్ సేవలను ఇటీవల ఎయిమ్స్‌కు వచ్చిన కేంద్రమంత్రి ఆర్కే.సింగ్ పరిశీలించి హర్షం వ్యక్తం చేశారు. పీహెచ్‌సీలు, సబ్‌సెంటర్లకు అనుసంధానం భువనగిరి, రామన్నపేట, బీబీనగర్ బొమ్మల రామారం మండలాల పరిధిలోని పీహెచ్‌సీలు, సబ్‌సెంటర్లకు డ్రోన్లను అనుసంధానం చేశారు. ఇక్కడి నుంచి రోగుల నమునాలను సేకరించి రిమోట్ ద్వారా జిల్లా కేంద్రంలోని క్షయవ్యాధి యూనిట్లకు డ్రోన్ ద్వారా పంపుతారు. తిరిగి అక్కడి నుంచి రోగులకు అవసరమయ్యే టీబీ మందులు, ట్యూబ్‌లు, రియాజెంట్లను డ్రోన్‌లో అమర్చి రోగులకు పంపుతారు. దీని కోసం ప్రస్తుతం ఎయిమ్స్‌లోని 3 డ్రోన్ పైలెట్లు, 2 డ్రోన్లు అందుబాటులో ఉంచారు. రోగుల ఖర్చు తగ్గించేందుకు సహాయపడుతుంది డ్రోన్ సేవల ద్వారా టీబీ నిర్థారణలో ట్యూమరౌండ్ సమయం తగ్గించడం, దూర ప్రాంతాల్లో, రవాణా సరిగ్గా లేని చోట నివసించే వ్యక్తులకు రవాణా ఖర్చులు తగ్గించేలా డ్రోన్ సేవలు సహాయపడతాయి, జిల్లా టీబీ కార్యాలయం నుంచి డ్రోన్ కార్యకలాపాలను పీహెచ్‌సీలతో పాటు సబ్‌సెంటర్లకు సైతం విస్తరిస్తున్నాం. – వికాస్‌భాటియా, డైరెక్టర్, ఎయిమ్స్ -
ఎయిమ్స్ మాస్టర్‌ప్లాన్‌కు నిధులు
సాక్షి, యాదాద్రి: రాష్ట్రంలోని బీబీనగర్ ఎయిమ్స్‌కు మాస్టర్ ప్లాన్ మంజూరు చేసిన కేంద్రం, నిర్మాణ పనుల కోసం రూ.799 కోట్లు విడుదల చేసింది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ మంత్రిత్వశాఖ ఆధ్వర్యం లో ఈ నెల 23న ఆన్లైన్లో టెండర్లను ఆహ్వానిస్తూ ప్రకటన జారీచేసింది. ఈపీసీ పద్ధతిలో ఈ టెం డర్లను ఆహ్వానించారు. ఎయిమ్స్‌లో రూ. 776.13 కోట్లతో నూతనంగా భవనాల నిర్మాణం చేపట్టను న్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎయిమ్స్‌కు కేటాయించిన ఖాళీ స్థలంలో కేంద్రం ఆమోదించిన మాస్టర్‌ప్లాన్ ప్రకారం 24 నెలల్లో నిర్మాణాలు పూర్తి చేయాలి. అలాగే ఆపరేషన్, నిర్వహణ కోసం రూ.23.50 కోట్లు కేటాయించారు. ఏ, బీ విభాగాలుగా పనులు విభజించి ఈనెల 23 నుంచి బిడ్ డాక్యుమెంట్ ఆన్లైన్లో అందుబాటులో ఉంచారు. ఆగస్టు 4 వరకు టెండర్లలో ఉన్న సందేహాలు ఈ మెయిల్ లేదా వెబ్సైట్ పోర్టల్ ద్వారా తెలుసుకోవచ్చు. ఈ టెండర్ వేయడానికి ఆగస్టు 25 తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు చివరి గడువు కాగా, ఆగస్టు 26న మధ్యాహ్నం 3 గంటలకు ఈ బిడ్లను తెరుస్తారు. కాగా, ఎయిమ్స్‌కు కేంద్రం నిధులు మంజూరు చేయడం పట్ల భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. కిషన్‌రెడ్డి సహకారంతోనే.. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి చొరవతోనే బీబీనగర్ ఎయిమ్స్‌కు నిధులు మంజూరయ్యాయని యాదాద్రి జిల్లా బీజేపీ అధ్యక్షుడు పీవీ శ్యాంసుందర్ రావు చెప్పారు. ఇటీవల కిషన్‌రెడ్డి బీబీనగర్ ఎయిమ్స్‌ను సందర్శించిన సందర్భంగా మాస్టర్‌ప్లాన్ టెండర్లు వేస్తారన్న విషయాన్ని వెల్లడించారన్నారు. -
బీబీనగర్‌లో భారీ వడగండ్ల వాన
-
బీబీనగర్‌లో భారీ వడగండ్ల వాన
బీబీనగర్: యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌లో మంగళవారం సాయంత్రం భారీ వడగండ్ల వాన కురిసింది. ఏకధాటిగా వాన పడటంతో రోడ్లపై ఉన్న జనం తలదాచుకునేందుకు తలోదిక్కు పరుగులు తీశారు. అరగంట పాటు కురిసిన వానతో మండల కేంద్రంలో తెల్లటి మంచు కప్పినట్లయింది. మరోవైపు మంగళవారం మధ్యాహ్నం నుంచి ఒక్కసారిగా హైదరాబాద్, చుట్టుపక్కల ప్రాంతాల్లో వాతావరణం మారిపోయింది. ఎండ తీవ్రత తగ్గి చలిగాలులు వీచాయి. కాగా తెలంగాణ రాష్ట్రంలో చాలాచోట్ల వర్షాలతో పాటు వడగండ్లు పడ్డాయి. దీంతో చేతికొచ్చిన పంట నేలపాలు కావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. -
బీబీనగర్ - నడికుడి రైల్వేలైన్.. మెగాబ్లాక్
మిర్యాలగూడ, న్యూస్‌లైన్ : బీబీనగర్ - నడికుడి రైల్వేలైన్ మెగా బ్లాక్‌ను దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. రైల్వేలైన్‌లో అత్యంత ప్రధానమైన కాపలా లేని రైల్వే క్రాసింగ్‌ల వద్ద బ్రిడ్జిల నిర్మాణానికి గాను మెగాబ్లాక్‌ను ప్రకటించింది. బీబీనగర్ నుంచి నడికుడి వరకు పగిడిపల్లి-నాగిరెడ్డిపల్లి మధ్యలో ఒకచోట, విష్ణుపురం-పొందుగుల స్టేషన్ల మధ్య మరో చోట బ్రిడ్జిలను నిర్మిస్తున్నారు. ఈ మేరకు 23, 25 తేదీలలో సికింద్రాబాద్ నుంచి గుంటూరు వైపునకు వెళ్లే రైళ్లలో కొన్నింటిని రద్దు చేయడంతో పాటు మరికొన్నింటిని పాక్షికంగా రద్దు చేశారు. అంతే కాకుండా ఇంకొన్ని రైళ్లను దారి మళ్లించడంతో పాటు సమయాన్ని క్రమబద్ధీకరించారు. దారి మళ్లించే రైళ్లు.. నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్ : హైదరాబాద్ నుంచి రాత్రి 10.10 గంటలకు బయలుదేరి నల్లగొండ, మిర్యాలగూడ మీదుగా వెళ్లే నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్‌ను ఖాజీపేట, విజయవాడ మీదుగా ఈ నెల 23, 25వ తేదీలలో దారి మళ్లించనున్నారు. డెల్టా పాస్ట్ ప్యాసింజర్ : కాచిగూడ నుంచి రాత్రి 8.15 గంటలకు బయలుదేరి నల్లగొండ, మిర్యాలగూడ మీదుగా రేపల్లెకు వెళ్లే ప్యాసింజర్‌ను ఈ నెల 23, 25వ తేదీలలో ఖాజీపేట, విజయవాడ, కొత్త గుంటూరు మీదుగా మళ్లిస్తారు. రేపల్లె ప్యాసింజర్ పాక్షికంగా రద్దు.. రేపల్లె ప్యాసింజర్ రైలును పాక్షికంగా రద్దు చేశారు. రేపల్లె నుంచి సికింద్రాబాద్‌కు వెళ్లు ప్యాసింజర్ రైలు నడికుడి - నల్లగొండ మధ్య పాక్షికంగా రద్దు చేసి నడికుడి నుంచి రేపల్లెకు అక్టోబర్ 1న వెళ్తుంది. సికింద్రాబాద్ నుంచి రేపల్లెకు వెళ్లే నల్లగొండ - నడికుడి మధ్య పాక్షికంగా రద్దయి నల్లగొండ నుంచి సికింద్రాబాద్‌కు అక్టోబర్ 1న తిరిగి వస్తుంది. ఆలస్యంగా వెళ్లే రైళ్లు.. విశాఖపట్నం - సికింద్రాబాద్‌లకు వెళ్లే జన్మభూమి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ అక్టోబర్ 1న 45 నిమిషాలు ఆలస్యంగా వస్తుంది. అదే విధంగా సికింద్రాబాద్‌లో రాత్రి 12.25 గంటలకు బయలుదేరి నల్లగొండ, మిర్యాలగూడ మీదుగా కోచువేలి (తిరువనంతపురం) వెళ్లే శబరి ఎక్స్‌ప్రెస్ ఒక గంట ఆలస్యంగా వెళ్తుంది.