bean
-
చిక్కుడుకాయ తీపికూర
క్విక్ఫుడ్ కావలసినవి: చిక్కుడుకాయలు – అర కిలో;శనగపప్పు – టేబుల్ స్పూను;మినప్పప్పు – టేబుల్ స్పూను;ఆవాలు – టీ స్పూను;జీలకర్ర – టీ స్పూను;ఎండుమిర్చి – 8;చింతపండుగుజ్జు – టేబుల్ స్పూను;బెల్లం తురుము – 2 టేబుల్ స్పూన్లు;బియ్యప్పిండి – టేబుల్ స్పూను;పసుపు – చిటికెడు; నూనె – 2 టేబుల్ స్పూన్లు;ఉప్పు – తగినంత;కరివేపాకు – 2 రెమ్మలు; కొత్తిమీర – కొద్దిగా తయారి: చిక్కుడుకాయలను శుభ్రంగా కడిగి ఈనెలు తీసి పెద్దపెద్ద ముక్కలు చేయాలి.బాణలిలో నూనె వేసి స్టౌ మీద ఉంచి కాగాక, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వరసగా వేయాలి. చిక్కుడుకాయ ముక్కలు, ఉప్పు వేసి బాగా కలిపి మూత పెట్టాలి. బాగా ఉడుకుపట్టాక బెల్లం తురుము, చింతపండు గుజ్జు, బియ్యప్పిండి, పసుపు వేసి కలిపి ఐదు నిముషాలు ఉంచి దించేయాలి కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి. -
చిక్కుడు కాయ పచ్చడి
హెల్దీ కుకింగ్ కావలసినవి: చిక్కుడుకాయలు – పావు కిలో; చింతపండు– కొద్దిగా; ఎండు మిర్చి – 4; ఆవాలు – టీ స్పూను; జీలకర్ర – టీ స్పూను; మెంతులు – అర టీ స్పూను; పసుపు – కొద్దిగా; ఇంగువ – చిటికెడు; ఉప్పు – తగినంత; కొత్తిమీర – కొద్దిగా; నూనె – 2 టీ స్పూన్లు తయారీ: ⇔ బాణలిలో నూనె వేసి కాగాక ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండు మిర్చి వరసగా వేసి, దోరగా వేగాక తీసి పక్కన ఉంచాలి ⇔ అదే బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక చిక్కుడుకాయ ముక్కలు (చిక్కుడుకాయలను శుభ్రంగా కడిగి ఈనెలు తీసి, ముక్కలుగా చేయాలి) వేసి, కొద్దిగా వేగిన తర్వాత... ఉప్పు, చింతపండు, పసుపు, ఇంగువ వేసి బాగా కలిపి మూత పెట్టాలి ⇔ ముక్కలు బాగా మెత్తబడ్డాక బాణలి దించేయాలి ⇔ మిక్సీలో ముందుగా పోపు వేసి, మెత్తగా చేయాలి ⇔ చిక్కుడుకాయ ముక్కలు, కొత్తిమీర జతచేసి మరోమారు మిక్సీ పట్టి తీసేయాలి.