చిక్కుడు కాయ పచ్చడి
హెల్దీ కుకింగ్
కావలసినవి:
చిక్కుడుకాయలు – పావు కిలో; చింతపండు– కొద్దిగా;
ఎండు మిర్చి – 4; ఆవాలు – టీ స్పూను; జీలకర్ర – టీ స్పూను;
మెంతులు – అర టీ స్పూను; పసుపు – కొద్దిగా; ఇంగువ – చిటికెడు;
ఉప్పు – తగినంత; కొత్తిమీర – కొద్దిగా; నూనె – 2 టీ స్పూన్లు
తయారీ:
⇔ బాణలిలో నూనె వేసి కాగాక ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండు మిర్చి వరసగా వేసి, దోరగా వేగాక తీసి పక్కన ఉంచాలి
⇔ అదే బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక చిక్కుడుకాయ ముక్కలు (చిక్కుడుకాయలను శుభ్రంగా కడిగి ఈనెలు తీసి, ముక్కలుగా చేయాలి) వేసి, కొద్దిగా వేగిన తర్వాత... ఉప్పు, చింతపండు, పసుపు, ఇంగువ వేసి బాగా కలిపి మూత పెట్టాలి
⇔ ముక్కలు బాగా మెత్తబడ్డాక బాణలి దించేయాలి
⇔ మిక్సీలో ముందుగా పోపు వేసి, మెత్తగా చేయాలి
⇔ చిక్కుడుకాయ ముక్కలు, కొత్తిమీర జతచేసి మరోమారు మిక్సీ పట్టి తీసేయాలి.