Off Beat Occasion
-
మనదేశంలో చూడదగ్గ 'బెస్ట్ ఆఫ్‌బీట్' పర్యాటక ప్రదేశాలు!
కొత్త కొత్త ప్రదేశాలకు వెళ్లడం ఇష్టం చాలామందికి. అందుకని విదేశాలకు చెక్కేస్తుంటారు. కానీ మన గడ్డపైనే ఎంతో విలక్షణమైన ప్రదేశాలు, కట్టిపడేసే సహజమైన ప్రకృతి దృశ్యాలు, మిస్టరీ ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. వెరైటీ వంటకాలకు నెలవైన ప్రదేశాలతో సహా వైవిధ్యభరితంగా, ఆహ్లాదంగా ఉండే సుందర ఉద్యానవనాలు ఎన్నెన్నో ఉన్నాయి. స్వదేశానికి మించిన గొప్ప పర్యాటక ప్రదేశం మరొకటి లేదు అనేలా బెస్ట్ ఆఫ్‌బీట్ ప్రదేశాలు ఎన్నో మన నేలలోనే ఉన్నాయి. అంతేగాదు ఈ ఏడాది 'బెస్ట్ ఆఫ్‌బీట్' ప్రదేశంగా ఓ ప్రసిద్ధ లోయ గోల్డ్‌ని దక్కించుకుంది కూడా. ఇంతకీ మన సొంత గడ్డలో ఉన్న అద్భుతమైన పర్యాటక ప్రదేశాలు ఏంటంటే.. ప్రకృతి అందానికి ప్రశాంతతకు కేరాఫ్ అడ్రస్.. ప్రతిష్టాత్మకమైన ఔట్లుక్ ట్రావెలర్ అవార్డ్ 2023లో బెస్ట్ ఆఫ్‌బీట్ ప్రదేశంగా ఉత్తర కాశీలో కుప్వారా జిల్లాలోని లోలాబ్ వ్యాలీ బంగారు పతకాన్ని దక్కించుకుంది గెలుచుకుంది. వాడి ఈలో లాబ్ లేదా లోలోవ్ అని పిలిచే ఈ లోలాబ్ వ్యాలీ అద్భుతమైన ప్రకృతి అందానికి, ప్రశాంతతకు కేరాఫ్ అడ్రస్‌గా ఉంటుంది. పైగా దీన్ని భారత్‌లో దాగున్న అద్భతమైన రత్నంగా ఈ ప్రదేశాన్ని అభివర్ణిస్తారు. యాపిల్ తోటలు, మెలికలు తిరిగిన నదులతో పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తుంది. కుప్వారాకు ఉత్తరంగా 9 కిలోమీటలర్ల దూరంలో ఈ ఐకానిక్ ప్రదేశం ఉంది. ఈ లోలాబ్ వ్యాలీ ఎంట్రీ గేట్ నుంచే అద్భతమైన ప్రకృతి దృశ్యాలు ప్రారంభమవుతాయి. విశాలమైన పర్వత శ్రేణులతో ఓవల్ ఆకారపు లోయ నుంచి జర్నీ మొదలవుతుంది. పర్యాటకులు ముఖ్యంగా ఇక్కడ ఉన్న కలరూస్ గుహలకు ఆకర్షితలవుతారు. ఇక్క నుంచి నేరుగా రష్యాకు చేరుకునేలా మార్గం ఉందని, పైగా ఈ గుహ లోపల భారీ నీటి వనరులను దాచి పెట్టారని స్థానిక ప్రజలు కథకథలుగా చెప్పుకుంటుంటారు. అలాగే జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం కూడా తన వంతుగా ఈ లోయని మంచి పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దింది. విద్యుత్ సౌకర్యం లేని గ్రామానికి నెలవు.. ఈ ఆదునిక కాలంలో విద్యుత్ సౌకర్యం లేని గ్రామాలు లేనేలేవు కదా! కానీ ఇదే కాశ్మీర్లో శ్రీనగర్‌కి 80 కిలోమీటర్ల దూరంలో విద్యుత్ సౌకర్యం లేని చత్పాల్ అనే విచిత్రమైన గ్రామం ఉంది. పర్యాటకులు తప్పనసరిగా చూడాల్సిన గొప్ప పర్యాటక ప్రదేశం. ఇక్కడ మంత్ర ముగ్దుల్ని చేసే పైన్ అడవులు సూర్యరశ్మిని ముద్దాడే హిమాలయాల అద్భుతాలను తిలకించాల్సిందే. ఈ గ్రామంలో ప్రత్యేకంగా చూసేందుకు ఏమీ ఉండదు కానీ అక్కడ ప్రకృతి రమ్యత పర్యాటకులను పులకించిపోయేలా చేస్తుంది. కొద్ది దూరంలో ఉన్న తిమ్రాన్ గ్రామంలోని పాఠశాల, ఆపిల్, వాల్నట్ తోటలు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. అక్కడ స్థానికులు పర్యాటకులతో స్నేహపూర్వకంగా ఉండటమే గాక అక్కడ వారందించే సుగంధభరితమైన టీ చాలా రుచిగా ఉంటుంది. తొలి సముద్ర జాతీయ ఉద్యానవనం.. చూడదగ్గ మరో పర్యాక ప్రదేశం గుజరాత్‌లోని నరరా మెరైన్ నేషనల్ పార్క్. ఇది భారత్‌లోని తొలి సముద్ర జాతీయ ఉద్యానవనంగా చెబుతారు. గుజరాత్‌లోని జామ్‌నగర్‌కు కొద్ది దూరంలో ఉంది. ఇది మూడు పార్క్‌లుగా విభజించబడి, 42 చిన్న ద్వీపాల మాదిరి విస్తరించి ఉంది. ఇక్క పగడాలు, ఆక్టోపస్, ఎనిమోన్స్, పఫర్ ఫిష్, సముద్ర గుర్రాలు, పీతలు వంటికి నెలవు. కళాకారులకు నిలయం.. హిమచల్ ప్రదేశ్‌లోని ఆండ్రెట్టా పర్యాటకులను ఎంతగానే ఆకర్షించే ప్రదేశం. ఇది పారాగ్లైడింగ్‌కి ప్రసిద్ధి. అంతేగాదు ఈ ఆండ్రెట్టాని కళాకారుల కాలనీ అని కూడా అంటారు. దీన్ని 1920లలో ఐరిష్ థియేటర్ ఆర్టిస్ట్ నోరా రిచర్డ్స్ స్థాపించారు. ఇక్కడ కుమ్మరి దగ్గర నుంచి హస్తకళకారుల వరకు ఎందరో కళకారులు ఉంటారు. వారందరి నైపుణ్యాలను తిలకించొచ్చు, నేర్చుకోవచ్చు కూడా. ఇక్కడ శోభా సింగ్ ఆర్ట్‌గ్యాలరీ మరింత ప్రసిద్ధి. దేవాలయల భూమి.. తమిళనాడులో ఉన్న తరంగంబాడి మరో ప్రసిద్ధ పర్యాటక ప్రాంతం. ఈ పేరుని అనువదిస్తే 'గాన తరంగాల భూమి' అని అర్థం. గతంలో ట్రాన్క్విబార్ అనిపిలిచేవారు. ఇది అనేక బీచ్ టౌన్లు కలిగిన ప్రదేశం. ఇది చరిత్రలో నిలిచిన పట్టణం. గత కాలం గురించి లోతుగా తెలుసుకోవాలనుకునేవారికి ఇది మంచి పర్యాటక ప్రాంతం. ఇక్కడ ఉన్న డానిష్ కోట మరింత ఆకర్షిస్తుంది. దీన్ని 1620లలో నిర్మించారు. ఈ కోటని డానిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ దళాలు స్థావరంగా ఉపయోగింకున్నట్లు చెబుతారు చరిత్రకారులు. ఇక్కడ తప్పక సందర్శించాల్సింది న్యూ జెరూసలేం చర్చి. దీన్ని భారతీయ యూరోపియన్ నిర్మాణాల కలయికతో ఆకట్టుకునేలా నిర్మించారు. ఆనంద నగరం సందక్ఫు.. ఇది పశ్చిమబెంగాల్లో ఉంది. ఎత్తైన శిఖరాలనకు నిలయం ఈ ప్రాంతం.ఇది భారత్ నేపాల్ సరిహద్దులో ఎంది. ఎవరెస్ట్, కాంచనజంగా, లోట్సే మకాలులను కప్పి ఉంచే అద్భుతమైన పర్వత దృశ్యాన్ని ఆస్వాదించవచ్చు. ఈ దృశ్యం బుద్ధుడి ఆకృతిని తలపించేలా ఉందని స్థానికులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. హన్లే డార్క్ స్కై రిజర్వ్.. లద్దాఖ్‌లో ఉంది హన్లే డార్క్ స్కై రిజర్వ్. విలక్షణమైన ప్రకృతి దృశ్యాలు చూడాలనుకునేవారికి ది బెస్ట్ ప్లేస్ ఇది. ఈ రిజర్వ్‌లో కాంతి పొల్యూషన్‌ని చూడొచ్చు. ఇక్కడ ఆకాశం పూర్తి చీకటితో నిర్మలంగా ఉంటుంది కాబట్టి అక్కడ ఏం జరుగుతుందో నిశితంగా చూడొచ్చు. ఇక్కడ దాదాపు వెయ్చి చదరపు కిలోమీటర్ల విస్తీర్ణలో భారతీయ ఖగోళ అబ్జర్వేటరీ ఉంది. అలాగే హన్లేలో సరస్వతి పర్వతంపై సుమారు 4 వేల మీటర్ల ఎత్తులో టెలిస్కోప్ ఉంది. ఇది ప్రపంచంలోని ఎత్తైన అబ్జర్వేటరీలలో ఒకటిగా నిలిచింది. (చదవండి: చలో టూర్) -
కొ...క్కొ...రొ...క్కో....
హేయ్ ఎక్కడుంది.. ఎక్కడుంది.. నా కోడి, ఏ తట్ట కింద నక్కినాది? అరే, ఎక్కడుంది.. ఎక్కడుంది.. నా కోడి, నా చేత చిక్కి తీరుతాది! ఈ చరణం వింటే పల్లవి పదాలు గుర్తు లేకపోయినా.. ట్యూన్ తలుచుకుంటూ.. కూని రాగాలతో ఊగిపోతాం. ఈ పాటతో కోడిని పెంచి, పోషించే వారికి మల్లే.. మనకు కూడా, తొడకొట్టే కోడేదో? తలదించే కోడేదో అంతలా అర్థమయిపోయింది. మరి, నిత్యం కాళ్లావేళ్లాపడుతూ.. పొద్దుపొద్దున్నే పలకరించే కోడమ్మ కథకు చరిత్రలో కొన్ని పేజీలు ఉన్నాయి. వాటి గురించి మీకు తెలుసా?బలగం పెద్దదే!: 2003లో జరిపిన అధ్యయనంలో ప్రపంచ వ్యాప్తంగా 2400 కోట్ల కోళ్లు ఉన్నాయి. ఈ లెక్కల ప్రకారం మన జనాభాతో పోల్చుకుంటే కోళ్ల సంఖ్య మూడు రెట్లు పైమాటే. ఇక పక్షి జాతిలో అత్యధిక సంఖ్యలో ఉన్న పక్షిగా కోడి రికార్డు సృష్టించింది.చైనా కోక్కొరోకో..: అత్యధిక జనాభా కలిగిన చైనాలో 300 కోట్ల కోళ్లు ఉన్నాయి. ఇక అమెరికాలో 45 కోట్లు జీవిస్తున్నాయన్నది ఓ సర్వే. ప్రపంచంలోనే అత్యధికంగా పెంచుకుంటున్న పెంపుడు పక్షుల్లో కోడి మొదటిది. ఎగరలేని పక్షి: నక్కినక్కి వచ్చే కుక్కో, పిల్లో మీదకి దూకినప్పుడు.. గద్దో, కాకో దాడి చేసినప్పుడే కోళ్లు కాస్త ఎగిరినట్లు కనిపిస్తాయి. నిజానికి కోళ్లకు సరిగా ఎగరటం రాదు. మహా అయితే ఓ మోస్తరు గోడను దాటడం, ఇంటిపై కప్పు ఎక్కడం చూస్తుంటాం. అది కూడా ఎక్కిన అరగంటకు కానీ దిగలేక, దూకలేక, ఎగరాలా, వద్దా అంటూ అటు, ఇటూ బెదురు చూపులు చూస్తుంటాయి కోళ్లు. ఎక్కువలో ఎక్కువ ఇవి ఎంతసేపు గాల్లో ఉండగలవంటే సరిగ్గా 13 సెకన్లు మాత్రమేనని ఓ అంచనా. రంగు గుడ్లు: కొన్ని కోళ్లు.. తెలుపు, బ్రౌన్ కలర్ గుడ్లనే కాకుండా, రంగురంగుల గుడ్లను కూడా పెడుతుంటాయి. అలా పెట్టిన నీలం, పచ్చ గుడ్లనే.. రెడీమేడ్ ఈస్టర్ ఎగ్స్ అని పిలుస్తారు.‘పవర్’ కోడి: అదిరిస్తే అదురుతాది, బెదిరిస్తే బెదురుతాది. కాస్త లొట్టలేస్తే కూరై కూర్చుంటుంది. ఈ మాత్రానికే, కోడికి ఇంత బిల్డప్పా అనిపిస్తుంది కదూ? కానీ ఈ మాటలు కోడిగానీ వింటే, ‘‘కోడే కదా అని తీసి పారేస్తే రెట్ట వేయడం మానేస్తా’’ అంటూ సినిమా డైలాగ్‌ని ఓన్ చేసుకుంటుందేమో! ఎందుకంటే.. కోడి విసర్జనతో పవర్ కూడా తయారు చేసుకోవచ్చు. ఒక కోడి జీవిత కాలంలో.. ఒక 100 వాల్ట్‌ల బల్బ్‌ను 5 గంటల పాటు వెలిగించగలదట. మరి ఓ సలాం చేసుకోండి కోడమ్మకి. స్త్రీ–కోడి: కోడి జాతిలో పెట్టలదే రాజ్యమట. వీటిల్లో భ్రూణ హత్యలు లేని కారణంగా పుంజుల సంఖ్య కంటే పెట్టలదే హవా నడుస్తో్తంది. ప్రపంచ వ్యాప్తంగా 1:6 నిష్పత్తిలో పుంజు–పెట్ట ఉన్నాయని సర్వేలు అంచనా వేస్తున్నాయి.పుంజు పాట్లు పుంజువి: మనుషుల్లానే కోళ్లకు సంభాషణ తీరుంటుంది. అవి కొన్ని సంకేతాలు, సందేశాలు ఇచ్చిపుచ్చుకుంటాయి. అయితే, పుంజులు, పెట్టలను ఆకట్టుకోవడానికి నానా తంటాలు పడుతుంటాయి. రకరకాల శబ్దాలతో, వింత చేష్టలతో పెట్టలకు సైట్ కొట్టి పడగొడుతుంటాయి. కొండ గుర్తు కాదు కోడి గుర్తు: కోళ్లు మనల్ని గుర్తుపడతాయి. వీటికి కలర్ బ్లైండ్ నెస్ ఉండదు. అన్ని కలర్స్‌ను ఇట్టే గుర్తించగలవు. ఏనుగులానే కోడికి కూడా జ్ఞాపకశక్తి ఎక్కువగా ఉంటుంది. ఒక కోడి సుమారు 100 ముఖాలను గుర్తు పెట్టుకోగలదు. అలాగే తమ బాస్ ఎవరో..? తమ పరిధులు ఏమిటో..? అన్ని గుర్తెరిగి మసలుకుంటాయి కోళ్లు. కోడా.. మజాకా?: కోడిని బ్లేమ్ చేయడం చాలా కష్టం. ఇవి మనుషులను, కుక్కలను, పిల్లులను, ఇతర జంతువులను చీకట్లో కూడా గుర్తుపట్టగలవు. శత్రువు పన్నాగాన్ని ముందుగానే గుర్తించి తప్పించుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంటాయి. కోడి మామా..!: సమాజంలో పెంపుడు పక్షిగా ఎదిగిన కోడి, సినిమాల్లోనూ చాలా సార్లు తళుకుమంది. ఇక కోడిపై పాట అనగానే మెగా‘ధీరులను గుర్తు చేస్తుంది. బంగారు కోడిపెట్ట సాంగ్‌తో చిరు, చరణ్‌లు తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగించిన సన్నివేశాలు మన కళ్లముందు కదలాడతాయి. సంకురాత్రి కోడి పెట్ట అంటూ ‘యువ’ సినిమాలో మీరా జాస్మిన్ హŸయలు బాగా యాదికొస్తాయి. ఇక ‘‘పట్టు పక్కింటి కోడి పెట్టని’’ అంటూ ‘డాడీ’ సినిమాలో.. ‘‘కోడి కూర చిల్లుగారి’’ అంటూ ‘అందరివాడు’ సినిమాలో.. ‘‘కొ..కొ.. కోడి బాగుంది. కు..కు..కూత బాగుంది’’ అంటూ ‘జై చిరంజీవ’ సినిమాలో చిరు స్టెప్లు వేశారు. ఇక పాత సినిమాల్లో కోడి పాటలకు కొదవేలేదు.మొత్తానికీ కోడి చరిత్రను ఓసారి అలా.. అలా.. తిరగేశాం. బహుశా! మీరు చదువుతున్నప్పుడు మీ ఇంట్లో కోడిగానీ విందేమో? చూసుకోండి. ‘వింటే ఏమవుతుంది..? మనతో పోట్లాటకొస్తే.. (బాగా బలిసిన కోడి చికెన్ సెంటర్ కొచ్చి తొడ కొట్టినట్లే) అంటారా?’ అయితే అలాగే, కానివ్వండి. – సంహిత నిమ్మన