Beer lovers
-
ఈ బీరు తాగితే కరోనా వైరస్ సోకుతుందా..!
న్యూఢిల్లీ: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ తాజాగా భారత్‌లో బీర్ల అమ్మకాలకు గండికొడుతోందని ఆ కంపెనీ వాపోతోంది. భారత్‌లో ఇప్పటివరకు ఈ వైరస్ బారిన పడిన కేసులు నమోదు కానప్పటికీ.. ఈ వైరస్ వ్యాపించిందేమోనని ప్రజల్లో భయం నెలకొంది. దీని గురించి రకరకాల వదంతులు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. దీంతో జనాలు భయాందోళనలకు గురి అవుతున్నారు. దీని ప్రభావంతో తాజాగా భారత్‌లో కరోనా బ్రాండ్ పేరుతో ఉన్న బీరు అమ్మకాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతోంది. ఈ బీరు తాగితే వైరస్ సోకుతుందా అంటూ భారత్‌లో బీరు ప్రియుల్లో అనుమానాలు తలెత్తుతున్నాయి. దీంతో ఆ బ్రాండ్ ను కొనుగోలు చేయటానికి వెనకంజవేస్తున్నారు. దీనిపై తమ అనుమానాలను నివృత్తి చేసుకోవడానికి గుగూల్ ను ఆశ్రయిస్తున్నారు. కరోనా వైరస్, కరోనా బీరుతో సోకుతుందా అని టైప్ చేస్తూ వెబ్ సైట్లో వెతుకుతున్నారు. ఈ ప్రశ్నలను సందిస్తున్న వారిలో ముఖ్యంగా భారత్‌లోని కరోనా బ్రాండ్ బీరు ప్రియులతోపాటు, ఆస్ట్రేలియా, కెనడా, అమెరికా ప్రజలు కూడా ఉంటున్నారు. చదవండి: (ఎకానమీపై కరోనా ఎటాక్!) (చైనాలో 131కి పెరిగిన మృతుల సంఖ్య) -
చల్లని బీరు.. అమ్మకాల జోరు
సాక్షి, విశాఖపట్నం: ఎండలు మండుతున్నాయి. ఉదయం 9 గంటల నుంచి చెమటలు గక్కాల్సి వస్తోంది. దీంతో మందుబాబుల కళ్లన్నీ బీర్లపైనే పడుతున్నాయి. అందుకే వీటి అమ్మకాలు గణనీయంగా పెరుగుతున్నాయి. సహజంగా వేసవిలో చల్లని బీర్లకు డిమాండ్ ఉంటుంది. అయితే ఈ వేసవిలో ఎండల తీవ్రత అధికంగా ఉంది. మార్చి రెండో వారం నుంచే వేసవి తాపం మొదలయింది. ఏప్రిల్ నుంచి మరింత తీవ్రరూపం దాల్చింది. మే వచ్చే సరికి ఉష్ణతాపం అదుపు తప్పి జనాన్ని అల్లాడిస్తోంది. వేడి తీవ్రత నుంచి జనం శీతలపానీయాలు, పండ్ల, చెరుకు రసాలు, కొబ్బరిబొండాలు వంటివి సేవించి ఉపశమనం పొందుతున్నారు. కానీ మద్యం సేవించే అలవాటున్న వారు మాత్రం బీర్లను గటగటా తాగేస్తున్నారు. మద్యం కంటే బీర్లపైనే ఆసక్తి జిల్లావ్యాప్తంగా గత ఏడాది ఏప్రిల్‌లో 2,54,729 కేసుల బీరు బాటిళ్లు అమ్ముడయ్యాయి. అప్పట్లో ఈ అమ్మకాలకే ఎక్సైజ్ అధికారులు అచ్చెరువొందారు. అయితే ఈ ఏడాది ఏప్రిల్‌లో 3,91,005 బాటిళ్ల బీరును లాగించేశారు. అంటే గత ఏడాది ఏప్రిల్‌తో పోల్చుకుంటే.. 53.50 శాతం అమ్మకాలు అధికమన్నమాట. ఏకధాటిగా అధిక ఉష్ణోగ్రతలతో ఎండలు మండుతుండడంతో మే నెలలో మరింతగా బీర్ల విక్రయాలు పెరుగుతాయని ఎక్సైజ్ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ వేసవి మొదలయినప్పట్నుంచి మద్యం కంటే (బ్రాందీ, విస్కీ వంటివి) బీర్ల అమ్మకాలే ఎక్కువగా జరుగుతున్నాయని లిక్కర్ వ్యాపారులు చెబుతున్నారు. మామూలు రోజుల్లో రోజుకు ఒక షాపులో 500 బీరు బాటిళ్లు అమ్మితే ఇప్పుడు 800 వరకు అమ్ముడవుతున్నాయి. ఎండల నుంచి ఉపశమనం పొందడానికి మద్యానికి అలవాటుపడ్డ వారు బీర్లపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారని అంటున్నారు. మొత్తంమ్మీద ఉష్ణతాపంతో పాటే బీర్ల విక్రయాలూ రోజురోజుకూ ఊపందుకున్నాయి. కొన్ని సందర్భాల్లో మద్యం షాపుల డిమాండ్‌కు తగినట్టు బీర్లు సరఫరా చేయడం కూడా కష్టతరమవుతోందని చెబుతున్నారు. -
బీరు ప్రియులకు శుభవార్త!
ముంబై: బీరు ప్రియులకు శుభవార్త. సంప్రదాయ బీరులో కృత్రిమ రుచులు, ప్రిజర్వేటివ్స్ వాడడం వల్ల అది తాగితే అనారోగ్యం వస్తుందని అందరికీ తెలుసు. దీనికి ప్రత్యామ్నాయం లేక, ఆరోగ్యానికి హానికరమని తెలిసినా బీరు ప్రియులు అదే తాగుతున్నారు. ఈ సమస్యకు పరిష్కారం చూపాయి ముంబై, పుణేల్లోని ఆరు చిన్న బీరు పరిశ్రమలు. సంప్రదాయ బీరుకు పోటీగా ‘క్రాఫ్ట్‌బీరు’ పేరుతో సరికొత్త బీరును రంగంలోకి దించాయి. దీన్ని తాగడం ఆరోగ్యానికి హానికరం కాదు..శ్రేయస్కరం అంటున్నారు నిపుణులు. అంతేకాదు సాధారణ బీరు కన్నా ఇది ఎక్కువ నాణ్యతతో, కృత్రిమ రుచులు కలపకుండా సహజసిద్ధంగా ఉంటుంది. దీన్ని తయారు చేయడానికి మాల్ట్, హాప్స్ (బీరు తయారీలో వాడే ఒకరకం పువ్వులు), ఈస్ట్, నీరు వాడతారు. కాబట్టి పోషక విలువలూ ఉంటాయి. సంప్రదాయ బీరు తాగితే అనారోగ్యం వస్తే..క్రాఫ్ట్ బీరు తాగితే ఆరోగ్యం మెరుగుపడుతుంది. అయితే ఇది ఇంకా విస్తృతంగా అందుబాటులోకి రాలేదు. లెసైన్సులు పొందడం నుంచి మద్యం దుకాణాలకు పంపిణీ వరకు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటోంది. వీటిని అధిగమించి, క్రాఫ్ట్‌బీరుకు ప్రచారం కల్పించే పనిలో తయారీదారులు ఉన్నారు. ఇందుకోసం, శుక్రవారం ప్రపంచ బీరు దినాన్ని పురస్కరించుకుని ముంబైలో శనివారం నుంచి రెండు రోజులపాటు ‘క్రాఫ్ట్‌బీరు వీకెండర్’ పార్టీని నిర్వహిస్తున్నారు. సాధారణ బీరుతో పోలిస్తే క్రాఫ్ట్‌బీరు ధర కాస్త ఎక్కువేననీ, ముడిసరుకుల అధిక ధరలే ఇందుకు కారణమని తయారీదారులు వివరించారు.