బీరు ప్రియులకు శుభవార్త! | 10 Expensive Beers In Craft Beer's Sketchy Resale Market | Sakshi
Sakshi News home page

బీరు ప్రియులకు శుభవార్త!

Published Sun, Aug 7 2016 1:23 AM | Last Updated on Mon, Sep 4 2017 8:09 AM

బీరు ప్రియులకు శుభవార్త!

బీరు ప్రియులకు శుభవార్త!

ముంబై: బీరు ప్రియులకు శుభవార్త. సంప్రదాయ బీరులో కృత్రిమ రుచులు, ప్రిజర్వేటివ్స్ వాడడం వల్ల అది తాగితే అనారోగ్యం వస్తుందని అందరికీ తెలుసు. దీనికి ప్రత్యామ్నాయం లేక, ఆరోగ్యానికి హానికరమని తెలిసినా బీరు ప్రియులు అదే తాగుతున్నారు. ఈ సమస్యకు పరిష్కారం చూపాయి ముంబై, పుణేల్లోని ఆరు చిన్న బీరు పరిశ్రమలు. సంప్రదాయ బీరుకు పోటీగా ‘క్రాఫ్ట్‌బీరు’ పేరుతో సరికొత్త బీరును రంగంలోకి దించాయి. దీన్ని తాగడం ఆరోగ్యానికి హానికరం కాదు..శ్రేయస్కరం అంటున్నారు నిపుణులు. అంతేకాదు సాధారణ బీరు కన్నా ఇది ఎక్కువ నాణ్యతతో, కృత్రిమ రుచులు కలపకుండా సహజసిద్ధంగా ఉంటుంది.

దీన్ని తయారు చేయడానికి మాల్ట్, హాప్స్ (బీరు తయారీలో వాడే ఒకరకం పువ్వులు), ఈస్ట్, నీరు వాడతారు. కాబట్టి పోషక విలువలూ ఉంటాయి. సంప్రదాయ బీరు తాగితే అనారోగ్యం వస్తే..క్రాఫ్ట్ బీరు తాగితే ఆరోగ్యం మెరుగుపడుతుంది. అయితే ఇది ఇంకా విస్తృతంగా అందుబాటులోకి రాలేదు. లెసైన్సులు పొందడం నుంచి మద్యం దుకాణాలకు పంపిణీ వరకు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటోంది. వీటిని అధిగమించి, క్రాఫ్ట్‌బీరుకు ప్రచారం కల్పించే పనిలో తయారీదారులు ఉన్నారు. ఇందుకోసం, శుక్రవారం ప్రపంచ బీరు దినాన్ని పురస్కరించుకుని ముంబైలో శనివారం నుంచి రెండు రోజులపాటు ‘క్రాఫ్ట్‌బీరు వీకెండర్’ పార్టీని నిర్వహిస్తున్నారు. సాధారణ బీరుతో పోలిస్తే క్రాఫ్ట్‌బీరు ధర కాస్త ఎక్కువేననీ, ముడిసరుకుల అధిక ధరలే ఇందుకు కారణమని తయారీదారులు వివరించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement