being raped
-
నాపై లైంగికదాడి చేశాడు: మహిళా ఎంపీ
లండన్: బ్రిటన్ మహిళా ఎంపీ మిచెల్లీ థామ్సన్ తన చిన్నతనంలో జరిగిన దారుణాన్ని వెల్లడించారు. మహిళలపై జరుగుతున్న దారుణాల గురించి గురువారం పార్లమెంట్లో ఆమె మాట్లాడుతూ.. తాను కూడా లైంగికదాడి బాధితురాలినని చెప్పారు. ‘14 ఏళ్ల వయసులో నాపై లైంగిక దాడి జరిగింది. ఎంతో భయపడ్డాను. దాడి నుంచి తప్పించుకోలేకపోయాను. ఏడుస్తూ ఒంటరిగా ఇంటకి వెళ్లిపోయాను. తల్లిదండ్రులకు ఈ విషయం చెప్పలేదు. స్నేహితులకు కూడా చెప్పలేదు. పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. ఈ దారుణ విషయాన్ని నాలోనే దాచుకుని కుమిలిపోయాను’ అని మిచెల్లీ చెప్పారు. నిందితుడు తనకు తెలిసినవాడేనని, మాయమాటలతో నమ్మించి అఘాయిత్యానికి పాల్పడ్డాడని వెల్లడించారు. తన జీవితం నాశనమైందని భావించానని, కోలుకోవడానికి చాలా సమయం పట్టిందని చెప్పారు. తనపై జరిగిన దారుణం గురించి చెప్పడానికి భయపడటం లేదని అన్నారు. సమాజంలో మహిళలపై జరుగుతున్న దారుణాలను అరికట్టాలని పిలుపునిచ్చారు. మహిళల భద్రతకు చర్యలు తీసుకోవాలని కోరారు. మిచెల్లీ ప్రసంగం ఆలోచింపచేసే విధంగా ఉందని ఎంపీలు అన్నారు. ఆమె ప్రసంగాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మరో మహిళా ఎంపీ ట్రేసీ బ్రాబిన్ మాట్లాడుతూ తాను 20 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఓ వ్యక్తి అత్యాచారయత్నం చేశాడని, లక్కీగా తప్పించుకోగలిగానని తెలిపారు. ఆ తర్వాత ఎప్పుడూ పక్కన కత్తి పెట్టుకుని నిద్రించేదాన్నని చెప్పారు. -
'టర్కీ తిరుగుబాటుదారులను రేప్ చేస్తున్నారు'
లండన్: ప్రభుత్వంపై తిరుగుబాటుకు విఫలయత్నం చేసిన వారిని టర్కీ ప్రభుత్వం క్రూరంగా హింసిస్తోందా.. అవుననే అంటోంది అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్. సైనిక తిరుగుబాటులో సహకరించిన 13,165 మందిని ఇప్పటివరకు టర్కీ ప్రభుత్వం అదుపులోకి తీసుకుంది. వీరిలో సైనిక అధికారులు, లాయర్లు, జడ్జీలు, పోలీసు అధికారులు, పౌరులు ఉన్నారు. అయితే.. వీరందరిపట్ల టర్కీ ప్రభుత్వం కర్కశంగా వ్యవహరిస్తోందని ఆమ్నెస్టీ వెల్లడించింది. అదుపులోకి తీసుకున్న వారికి అహారం అందించకుండా, తీవ్రంగా కొడుతూ.. కొందరిపై లైంగిక దాడులకు కూడా పాల్పడుతున్నారని ఆమ్నెస్టీ సంస్థ సోమవారం వెల్లడించింది. దీనికి సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని, మానవహక్కులను కాలరాయొద్దని ఆ సంస్థ టర్కీ ప్రభుత్వానికి సూచించింది. మరోవైపు ఇవాళ ప్రభుత్వ మద్దతుదారులు రాజధాని ఇస్తాంబుల్లో భారీ ప్రదర్శన నిర్వహించారు. బంధీలను తీవ్రంగా హింసిస్తున్నారంటూ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ వెల్లడించిన విషయాలను టర్కీ ప్రభుత్వం తోసిపుచ్చింది. మానవహక్కులను కాలరాసే పనులను తమ ప్రభుత్వం చేయడంలేదని టర్కీ అధికారులు వెల్లడించారు. యూరోపియన్ యూనియన్లో సభ్యత్వం కోసం చూస్తున్న తమ దేశం అనుచిత చర్యలకు పాల్పడదని ఓ సీనియర్ అధికారి వెల్లడించారు.