bejawada gopalreddy
-
విశేషాల కొలువు.. ఉద్దండుల నెలవు..
సాక్షి, ఎలక్షన్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి శాసనసభకు సంబంధించిన విశేషాల గురించి రాష్ట్రంలోని సీనియర్ ప్రజాప్రతినిధులు ఇప్పటికీ గుర్తుచేసుకుంటుంటారు. శాసనసభకు ఎన్నికైంది ఒకే పర్యాయమైనా ఏడేళ్ల సుదీర్ఘకాలం ఎమ్మెల్యేలుగా కొనసాగిన అరుదైన అవకాశం, ఆంధ్ర రాష్ట్రం, ఏపీ అసెంబ్లీల్లో ప్రాతినిధ్యం వహించిన రికార్డు ఆంధ్ర ప్రాంతీయులకే సొంతమైంది. 1956లో ఏర్పాటైన ఏపీ మొదటి శాసనసభ.. మూడు ప్రాంతాలకు చెందిన ఉద్దండులతో మొత్తం తెలుగువారికి వేదికగా కనిపించేది. బూర్గుల రామకృష్ణారావు, నీలం సంజీవరెడ్డి, బెజవాడ గోపాల్‌రెడ్డి లాంటి తెలుగు ప్రముఖులంతా ఈ సభలో ప్రాతినిధ్యం వహించిన వారే. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు అంతర్భాగంగా ఉన్న సమయంలో (1952) మొదటి సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. పొట్టి శ్రీరాములు ఆత్మాహుతి ఫలితంగా 1953లో శ్రీకాకుళం నుంచి కర్నూలు వరకూ ఉన్న ప్రాంతం ఆంధ్ర రాష్ట్రంగా ఆవిర్భవించింది. రాష్ట్రానికి టంగుటూరి ప్రకాశం సీఎంగా ఎన్నికయ్యారు. మద్యనిషేధం అంశంపై అవిశ్వాస తీర్మానం కారణంగా ఆయన స్వల్పకాలంలోనే పదవీచ్యుతులయ్యారు. 1955 ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించడంతో ఆంధ్ర రాష్ట్రానికి బెజవాడ గోపాల్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. 1956లో ఆంధ్ర, తెలంగాణా(హైదరాబాద్ రాష్ట్రం) కలిసి తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్‌కు నీలం సంజీవరెడ్డి మొదటి ముఖ్యమంత్రి అయ్యారు. 1957లో దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరిగాయి.తెలంగాణా ప్రాంతంలోని 104 అసెంబ్లీ నియోజకవర్గాలకు మాత్రమే 1957లో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించారు. ఆంధ్ర ప్రాంతంలో ఉప ఎన్నికలు జరిగి రెండేళ్లు మాత్రమే అయినందున 1957 సార్వత్రిక ఎన్నికలు ఇక్కడ నిర్వహించలేదు. ఫలితంగా ఆంధ్ర ప్రాంతం నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేలు 1955 నుంచి 1962 వరకూ సుమారు ఏడున్నరేళ్లపాటు శాసనసభ్యులుగా కొనసాగారు. ఇలా ఆంధ్రప్రదేశ్ మొదటి అసెంబ్లీ మూడు పర్యాయాలు ఎన్నికైన (1952, 1955, 1957) వారికి వేదికగా నిలిచి ప్రత్యేకతను సంతరించుకుంది. ఆంధ్ర రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్న నీలం సంజీవరెడ్డి ఆంధ్రప్రదేశ్‌కు సీఎం కావడం మొదటి శాసనసభలో కనిపించిన అరుదైన విశేషాల్లో ఒకటిగా చెప్పవచ్చు. నీలం సంజీవరెడ్డి.. తర్వాత కాలంలో దేశ ప్రథమ పౌరునిగా అత్యున్నత పీఠాన్ని అధిష్ఠించగా పీవీ నరసింహారావు ప్రధాని అయ్యారు. ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన బెజవాడ గోపాల్‌రెడ్డి తన కింద ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన నీలం సంజీవరెడ్డి వద్ద తర్వాత మంత్రిగా పనిచేయడం ఈ కాలంలో చోటుచేసుకొన్న మరో ఆసక్తికర సన్నివేశం. 1955 నుంచి 1962 వరకూ ఏడేళ్లు సభలో ఉన్న వారిలో గౌతు లచ్చన్న, పీవీజీ రాజు, పుచ్చల పల్లి సుందరయ్య, కాసు బ్రహ్మానందరెడ్డి, వావిలాల గోపాలకృష్ణయ్య, కడప కోటిరెడ్డి, ఆనం చెంచు సుబ్బారెడ్డి ప్రముఖులు ఉన్నారు.1952, 1955లో తెలంగాణ ప్రాంతం నుంచి గెలిచినవారు కూడా మొదటి శాసనసభలో ఉన్నారు. – లేబాక రఘురామిరెడ్డి, సాక్షి ప్రతినిధి -
11 స్థానాలు.. 14 మంది ఎమ్మెల్యేలు
సాక్షి, కోట: 1955లో తొలిసారిగా నిర్వహించిన సాధారణ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి జిల్లా నుంచి తొలిసారిగా 14 మంది ఎమ్మెల్యేలు ఎన్నికయ్యారు. జిల్లాలో 11 నియోజక వర్గాలు కాగా ప్రకాశం జిల్లాతో మూడు ఉమ్మడి నియోజక వర్గాలు ఉన్నాయి. ప్రకాశం జిల్లాలోని కందుకూరు, కొండెపి, నందిపాడు ఇందులో ఉండేవి. భారత జాతీయ కాంగ్రెస్ పార్టీతో పాటు, ప్రజాపార్టీ, ప్రజాసొసైటీ పార్టీ, కమ్యూనిస్టు పార్టీ ప్రధానమైనవిగా ఉన్నాయి. ప్రధాన పార్టీలు ఉన్నా ఈ ఎన్నికల్లో కొందరు స్వతంత్రులు ఎన్నికవడం విశేషం. 1955లో జరిగిన తొలి అసెంబ్లీ ఎన్నికల్లో 8,89,214 మంది ఓటర్లు ఉన్నారు. నెల్లూరు, కావలి, ఉదయగిరి, బుచ్చిరెడ్డిపాళెం, ఆత్మకూరు, వెంకటగిరి, గూడూరు, సర్వేపల్లి, నందిపాడు, కందుకూరు, కొండేపి అసెంబ్లీ స్థానాలకు ఓపెన్ కేటగిరిలో ఎన్నికలు జరిగాయి. వెంకటగిరి, గూడూరు, బుచ్చిరెడ్డిపాళెం ఉమ్మడి నియోజకవర్గాలుగా ఉండేవి. రెండు సార్లు బెడవాడ విజయం తొలిసాధారణ ఎన్నికల్లో బెజవాడ గోపాల్‌రెడ్డి ఆత్మకూరు, సర్వేపల్లి స్థానాల్లో జాతీయ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. కాంగ్రెస్ నుంచి నెల్లూరులో ఆనం చెంచుసుబ్బారెడ్డి, ఉదయగిరి నుంచి షేక్ మౌలాసాహెబ్, కందుకూరు నుంచి కొండయ్యచౌదరి, కొండెపి నుంచి చెంచురామానాయుడు వంటి ప్రముఖులు విజయం సాధించారు. నందిపాడు నుంచి వెంకటరెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా, కావలి నుంచి బత్తెన రామకృష్ణారెడ్డి ప్రజాపార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. ఉమ్మడి స్థానాల్లో ఆరుగురు ఎంపికయ్యారు. బుచ్చిరెడ్డిపాళెం నుంచి బసవరెడ్డి శంకరయ్య, స్వర్ణ వేమయ్య సీపీఐ తరపున గెలుపొందారు. వెంకటగిరి నుంచి పాదిలేటి వెంకటస్వామి, కమతం షణ్ముగం, గూడూరు నుంచి పెల్లేటి గోపాలకృష్ణారెడ్డి, మేర్లపాక మునుస్వామి జాతీయ కాంగ్రెస్ అభ్యర్థులుగా ఈ ఎన్నికల్లో విజయం సాధించారు.. -
ఈవెంట్
బెజవాడ గోపాలరెడ్డి సంస్మరణ ప్రసంగం తెలంగాణ సారస్వత పరిషత్తు ఆధ్వర్యంలో, డిసెంబర్ 8న సాయంత్రం 6 గంటలకు పరిషత్తులోని దేవులపల్లి రామానుజరావు కళామందిరంలో ‘డాక్టర్ బెజవాడ గోపాలరెడ్డి సంస్మరణ ప్రసంగం’ జరగనుంది. అధ్యక్షత: సి.నారాయణరెడ్డి. వక్త: ద్వానా శాస్త్రి. కవిసంగమం సీరీస్-31 డిసెంబర్ 10న సాయంత్రం 6 గంటలకు గోల్డెన్ త్రెషోల్డ్, ఆబిడ్స్, హైదరాబాద్‌లో జరిగే ఈ నెల ‘కవిసంగమం’ కార్యక్రమంలో మూడు తరాల కవులు సిద్ధార్థ, మునాసు వెంకట్, అరవింద రాయుడు దేవినేని, పోర్షియా దేవి, అశోక అవారి తమ కవితల్ని వినిపించనున్నారు. సుంకిరెడ్డి సాహిత్య సమాలోచన సుంకిరెడ్డి నారాయణరెడ్డి నాలుగు దశాబ్దాల సాహిత్య సమాలోచన సదస్సు డిసెంబర్ 11న హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో జరగనుంది. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు జరిగే ఈ సమాలోచనలో సుంకిరెడ్డి ‘తావు’, ‘దాలి’ పుస్తకాల ఆవిష్కరణ ఉంటుంది. అలాగే, ‘తెలంగాణలో తొలి సాహిత్య చరిత్ర- ముంగిలి’, ‘విమర్శ పరిశోధన కలనేత- గనుమ’, ‘తెలంగాణ అస్తిత్వ కేతనం- తెలంగాణ చరిత్ర’, ‘తెలుగు సాహిత్యంలో సునారె విశిష్టత’, ‘ఉద్యమాలను మలుపు తిప్పే ప్రశ్న- తోవ ఎక్కడ’, ‘జముకు పత్రిక నిర్వహణ’, ‘సుంకిరెడ్డి రచనలు స్త్రీ దృక్కోణం’ వంటి అంశాలపై ప్రసంగాలుంటాయి. పలువురు ప్రొఫెసర్లు, కవులు, రచయితలు పాల్గొనే ఈ సదస్సు నిర్వహణ కమిటీ అధ్యక్షుడు: సంగిశెట్టి శ్రీనివాస్. సాహితీ స్రవంతి కార్యశాల సాహితీ స్రవంతి కార్యశాల డిసెంబర్ 11న విజయవాడలోని రాఘవయ్య పార్కు వద్ద గల ఎం.బి.విజ్ఞాన కేంద్రంలో జరగనుంది. ఉదయం 10:30కు మొదలై పూర్తిరోజు జరిగే ఈ కార్యక్రమంలో సాహిత్య ప్రస్థానం ప్రత్యేక సంచిక ‘స్వేచ్ఛా స్వరం’ ఆవిష్కరణతోపాటు, ‘తెలుగు కథ- ప్రపంచీకరణ’, ‘తెలుగు కథ- సామాజిక వివక్ష’, ‘ప్రపంచీకరణ- కవిత్వం’ అంశాలపై సదస్సులు ఉంటాయి. అలాగే, కొందరు యువకవులు తమ కవిత్వానుభవాన్ని వినిపిస్తారు. మరిన్ని వివరాలకు ప్రధాన కార్యదర్శి వొరప్రసాద్ ఫోన్: 9490099059