bekary
-
వాఫీ డే .. ప్రత్యేకత ఏంటో తెలుసా ?
హైదరాబాద్: పెద్దలు కాఫీలను ఇష్టపడితే చిన్న పిల్లలు వాఫీలను ఇష్టపడుతారు. అందుకే ప్రతీ ఏడు జులై 3న వాఫీ డేను నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది డ్యూక్ ఆధ్వర్యంలో హైదరాబాద్ నగరంలో వాఫీ డే వేడుకలు నిర్వహించారు. వాఫీ రుచులను ప్రతిబింబించేలా పలు కార్యక్రమాలను చేపట్టింది. క్షేత్రస్థాయిలో కార్యక్రమాలతోపాటు డిజిటల్ , రేడియో మాధ్యమాల ద్వారా వాఫీ డే ప్రచారాన్ని డ్యూక్ నిర్వహిస్తోంది. వాఫీ డే స్పెషల్ డ్యూక్స్ బ్రాండ్ బిస్కట్స్.. మొదటిసారిగా 1999 జూలై 3న వాఫీని మార్కెట్లోకి తీసుకొచ్చింది. బేకరీ ఐటమ్స్ ప్రేమికులను ఎంతగానో ఆకట్టుకున్న వాటిలో వాఫీ కూడా ఒకటిగా నిలిచింది. అందుకే వాఫీ మార్కెట్లోకి వచ్చిన రోజును ‘వాఫీ డే’గా జరుపుతున్నారు. 9 రుచుల్లో డ్యూక్స్ వాఫీ 9 రకాల రుచుల్లో లభిస్తోంది. క్రీమ్‌తో నిండిన వాఫీలు చిరువేడుకల్లో, ప్రయాణాల్లో తమకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాయి. రవి ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఆర్ఎఫ్పీఎల్) ఆధ్వర్యంలో డ్యూక్స్ బ్రాండ్ పేరుతో వాఫీలు ప్రపంచవ్యాప్తంగా ప్రజల ఆదరాభిమానాలు అందుకుంటోంది. -
తాగిన మైకంలో నటుడు వీరంగం
యశవంతపుర : తాగిన మైకంలో హుచ్చ వెంకట్ వీరంగం సృష్టించిన ఘటన రాజ రాజేశ్వరినగరలో చోటు చేసుకొంది. గురువారం ఉదయం నిద్రలేచి సమీపంలోని ఓ బేకరివద్దకు హుచ్చవెంకట్ వెళ్లాడు. ఏమి మాట్లాడకుండానే దుకాణం వద్ద ఉన్నవారిపై కాళ్లతో తన్ని అలజడి సృష్టించాడు. బేకరి యజమానిపై కూడా దాడికి దిగాడు. బేకరి యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో హుచ్చ వెంకట్‌ను హెచ్చరించి పంపివేశారు. అనంతరం వెంకట్ కనిపించకుండా పోయాడు. -
బేకరీలో బెల్ట్ షాపు
బోడుప్పల్: పేరుకు బేకరీ..కానీ లోపల జరిగేది మద్యం వ్యాపారం..నగరంలోని బోడుప్పల్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. మద్యం బాటిల్స్ పెట్టి విక్రయిస్తున్న ఓ వ్యక్తిని సోమవారం ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. అతని వద్ద ఉన్న 51 బాటిల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం ఆయనను మేడిపల్లి పోలీసులకు అప్పగించారు. ఎస్ఐ నాగయ్య సమాచారం మేరకు... పర్వతాపూర్‌కు చెందిన సుర్వి రవిగౌడ్ స్థానికంగా బేకరీ నిర్వహిస్తున్నాడు. మద్యం దుకాణాలను నుంచి బాటిల్స్ తీసుకొచ్చి బేకరిలో వాటిని విక్రయిస్తున్నాడు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు సోమవారం ఎస్ఓటీ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసుల దాడిలో 51 మద్యం బాటిల్స్ దొరికాయి. దీంతో అతనిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.