Belfast
-
అందరూ చస్తారు: ప్రయాణికురాలి హల్చల్
లండన్: కరోనా కాలంలో మాస్కు ధరించడం తప్పనిసరిగా మారింది. పొరపాటున మాస్కు లేకుండా బస్సెక్కామనుకోండి. ఎన్నడూ చూడని కళ్లు మనల్ని శత్రవులా కన్నెర్ర చేసి చూస్తాయి. దీంతో ముఖాన్ని కవర్ చేసుకోలేక పడే తంటాలు అన్నీ ఇన్నీ కావు. కానీ ఇక్కడో మహిళ మాత్రం మాస్కు లేకుండానే విమానమెక్కేసింది. అంతేనా.. కావాలని గట్టిగా అరుస్తూ దగ్గుతూ అందరూ చస్తారు అంటూ శాపనార్థాలు పెట్టింది. ఈ విచిత్ర ఘటన ఉత్తర ఐర్లాండ్‌లోని బెల్ఫాస్ట్ నుంచి స్కాట్లాండ్లోని ఈడిన్‌బర్గ్ వెళ్లడానికి సిద్ధమైన ఈజీజెట్ విమానంలో చోటు చేసుకుంది. ఎగరడానికి సిద్ధంగా ఉన్న విమానంలో ఓ మహిళ మాస్కు లేకుండానే ఎక్కగా సిబ్బంది ఆమెను దిగిపోవాలని సూచించినట్లున్నారు. దీంతో కోపం నషాళానికంటిన సదరు మహిళ తోటి ప్రయాణికులపై తన ప్రతాపాన్ని చూపించింది. వాళ్ల ముఖాల్లోకి తొంగి చూస్తూ కావాలని దగ్గింది. (చదవండి: నెటిజన్లను ఆశ్చర్యంలో ముంచెత్తిన వీడియో) "అందరూ చస్తారు, అది కరోనానే కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. ప్రతిఒక్కరూ చచ్చిపోతారు. ఇది తప్పకుండా జరిగి తీరుతుంది" అని పదే పదే అరిచింది. వెంటనే అక్కడున్న సిబ్బంది ఆమెను విమానం దిగిపోవాలని సూచించగా మళ్లీ మళ్లీ అదే శాపనార్థాలు పెడుతూ అక్కడి నుంచి వెళ్లిపోయింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు భిన్నరకాలుగా స్పందిస్తున్నారు. 'ఎంతో కష్టపడి టికెట్ రిజర్వేషన్ చేయించుకుని, విమానాశ్రయంలో చాలాసేపు పడిగాపులు కాసి, తర్వాత లైనులో నిలబడి, లగేజ్ అంతా ఎక్కించేసి, చివరాఖరకు లోపలకు వెళ్లి కూర్చుంటే కేవలం మాస్కు లేదన్న కారణంతో ఆమెను గెంటేస్తారా?' అని ప్రశ్నిస్తున్నారు. మరికొందరు మాత్రం ఇలాంటి వాళ్లను కేవలం విమానంలో నుంచి వెళ్లగొడితే సరిపోదు, అరెస్టు చేయాలని కామెంట్లు చేస్తున్నారు. (చదవండి: సెకన్లలో ప్లేట్ ఖాళీ.. రికార్డుకెక్కింది..) A rare, Shakespearean tragedy Karen, coughing and yelling “everybody dies!” pic.twitter.com/uICdy0z2QJ — Sarah Cooper (@sarahcpr) October 19, 2020 -
భారత్‌లో స్కోర్‌తో యూకే వర్సిటీలో సీటు
న్యూఢిల్లీ: భారత్‌లో జరుగుతున్న వివిధ ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్రవేశం కోసం జరిగే పరీక్షల నాణ్యతా ప్రమాణాల్ని బ్రిటన్‌కు చెందిన బెల్ఫాస్ట్ యూనివర్సిటీ పరిశీలిస్తోంది. తమ యూనివర్సిటీ అడ్మిషన్ల ప్రమాణాలకు లోబడి భారత్‌లో ఏయే యూనివర్సిటీల ఎంట్రన్స్ పరీక్ష స్కోర్లు ఉంటాయో అన్వేషిస్తున్నామని బెల్ఫాస్ట్ వైస్ చాన్స్‌లర్ ఇయాన్ గ్రీర్ చెప్పారు. భారత్‌లో జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్(జేఈఈ)లో విద్యార్థులు సాధించిన స్కోర్లనే తమ వర్సిటీలో ప్రవేశ పరీక్షకు అర్హతగా పరిగణిస్తామని గతంలో యూనివర్సిటీ ప్రకటించింది. ఇతర ఎంట్రన్స్ పరీక్షల నాణ్యతను పరిశీలించడానికి ఇప్పుడు సిద్ధమైంది. ‘ప్రతిభగల విద్యార్థుల్ని ఆకర్షించడం కోసం భారత్‌లో విశ్వసనీయత కలిగిన ఎంట్రన్స్ పరీక్షల్లో వచ్చే స్కోర్లు తమ వర్సిటీకి ఎంతవరకు పనికి వస్తాయో పరీక్షించి చూస్తున్నాం. అలాగని మేము ఏ యూనివర్సిటీని తగ్గించి చూడటం లేదు. మా యూనివర్సిటీ ప్రమాణాలకు సరితూగే ఎంట్రన్స్ పరీక్షల స్కోర్ల కోసం చూస్తున్నాం’’అని చెప్పారు. యూకే ప్రభుత్వం భారత్ విద్యార్థులకు పోస్ట్ స్టడీ వర్క్ వీసా నిబంధనల్ని సరళీకృతం చేయడంవల్ల ప్రతిభ కలిగిన విద్యార్థులకు, యూకేకి మంచే జరుగుతుందని వీసీ చెప్పారు. భారత్‌లో నాణ్యతా ప్రమాణాలు కలిగిన యూనివర్సిటీలను గుర్తించడానికి ఇక్కడ కొన్ని సంస్థల్ని భాగస్వాములుగా చేసుకొని అన్వేషణ కొనసాగిస్తున్నట్టు గ్రీర్ వెల్లడించారు. -
బెల్ఫాస్ట్లో నిటా ఉగాది సంబరాలు
నార్తర్న్ ఐర్లాండ్ తెలుగు అసోసియేషన్(నిటా) ఆధ్వర్యంలో ఈ నెల 21న బెల్ఫాస్ట్లో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమాన్ని బెల్ఫాస్ట్ లార్డ్ మేయర్ నికోలా మల్లోన్, లార్డ్ దాల్జిత్ రానా ప్రారంబించారు. ప్రముఖ గాయకులు హేమచంద్ర, శ్రావణ భార్గవి తమ గాన మధుర్యుం తో అలరించారు. ఈ కార్యక్రమానికి సుమారు 400 మంది హాజరయ్యారు. నిటా అసోసియేషన్ వాలంటీర్స్ కుమార్ జల్లూరి, డాక్టర్ రఘు రెడ్డి, రమేష్ గుమ్మడవెల్లి, సురేష్ గోపిడి, శ్రీ వెంకట చౌడల, సతీష్ దారం, శ్రీకాంత్ గుండం, శ్రీనివాస్ కోటప్రోలు, రజినికర్, శశాంక్, గోపి, నాగార్జున, నగేష్, కళ్యాణ్, శర్మ, ఉష పేరి, సుమ, కోమల,పూర్ణిమ, మౌనిక, జయశ్రీ, శ్రీ పద్మ, నిహారిక, సౌజన్య, జ్యోతి కోటప్రోలు, పవిత్ర, సుష్మిత, సత్య జల్లూరి తదితరులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. -
మూర్ఛను గుర్తించేందుకు, పక్షవాత చికిత్సకూ మొబైల్ ఆప్స్!
న్యూయార్క్: మూర్ఛ వ్యాధి వల్ల వచ్చే సీజర్స్‌ను గుర్తించేందుకు, పక్షవాత రోగులకు మెరుగైన చికిత్స చేసేందుకు ఉపయోగపడే రెండు వినూత్న మొబైల్ అప్లికేషన్లను బ్రిటన్‌లోని ‘బెల్ఫాస్ట్’కు చెందిన పరిశోధకులు రూపొందించారు. వీటిలో ‘ఎపిలెప్సీ ఆప్’తో వైద్య పరిజ్ఞానం లేనివారు సైతం ఒక వ్యక్తికి మూర్ఛవ్యాధి వల్ల సీజర్స్ (కంపించిపోతూ కూలిపోవడం) వస్తున్నాయా? లేదా వేరే కారణమా? అనేది గుర్తించవచ్చు. మూర్ఛవ్యాధి ఉన్నవారిలో నాడీవ్యవస్థ అసాధారణంగా స్పందించడం వల్ల ఒక్కసారిగా ప్రకంపనలతో బిగుసుకుపోయి కుప్పకూలుతుంటారు. ఇతర సమస్యల వల్లా సీజర్స్ వచ్చే అవకాశముంటుంది కాబట్టి.. మూర్ఛ వల్లే ఆ సీజర్స్ వచ్చాయా అన్నది తెలుసుకోవడం కష్టం. అందుకే వైద్యులు అందుబాటులో లేనప్పుడు సీజర్స్‌ను గుర్తించేలా ఈ ఆప్‌ను రూపొందించారు. మూర్ఛరోగులపై అధ్యయనం చేసి.. రూపొందించిన ఈ ఆప్‌ను భారత్, నేపాల్‌లో 132 మందిపై పరీక్షించగా.. 96 శాతం మందిలో కచ్చితమైన ఫలితాలు వచ్చాయట. అలాగే మరో అప్లికేషన్ ‘స్ట్రోక్ ఆప్’ కూడా పక్షవాత రోగులకు మెరుగైన చికిత్స అందించేందుకు, పర్యవేక్షించేందుకు బాగా ఉపయోగపడుతుందని పరిశోధకులు తెలిపారు. ఈ ఆప్‌ను ప్రస్తుతం యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ వైద్యులు ఉపయోగిస్తున్నారు.