శ్రీకృష్ణప్రియ ఓటమి
లెయువెన్ (బెల్జియం): గతవారం ఫోర్జా ఖార్కివ్ అంతర్జాతీయ టోర్నీలో రన్నరప్‌గా నిలిచిన హైదరాబాద్ బ్యాడ్మింటన్ యువతార శ్రీకృష్ణప్రియ బెల్జియం ఓపెన్ ఇంటర్నేషనల్ టోర్నీలో రెండో రౌండ్లో నిష్క్రమించింది. మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో ఆరో సీడ్ శ్రీకృష్ణప్రియ 13–21, 11–21తో జూలీ జాకబ్సన్ (డెన్మార్క్) చేతిలో ఓడిపోయింది.
మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ చుక్కా సాయిఉత్తేజిత రావు తొలి రౌండ్లో 21–15, 16–21, 10–21తో భారత్‌కే చెందిన క్వాలిఫయర్ శ్రుతి ముందాడ చేతిలో ఓటమి చవిచూసింది.