శ్రీవారి నిత్యాన్నదాన ట్రస్ట్‌కు రూ.1.50 లక్షలు విరాళం
ద్వారకాతిరుమల : ద్వారకాతిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి నిత్యాన్నదాన ట్రస్ట్‌కు ఓ భక్తుడు బుధవారం రూ.1,50,000 విరాళంగా అందజేశారు. పెనుగొండ మండలం దొంగరావిపాలెంకు చెందిన కందుకూరి నాగరాజు విరాళం మొత్తాన్ని కందుకూరి విశ్వనాథ్ పేరున జమచేశారు. దాతను ఆలయ ఈవో వేండ్ర త్రినాథరావు అభినందించి విరాళం బాండ్ అందజేశారు.