Bendapudi
-
ఆస్ట్రేలియాకు పాకిన బెండపూడి విద్యార్థుల ఖ్యాతి.. యూట్యూబ్ చూసి..
కాకినాడ సిటీ: తుని నియోజకవర్గం బెండపూడి ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు అమెరికన్ యాక్సెంట్ ఇంగ్లిష్‌లో మాట్లాడుతున్న వీడియోలు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసిన వీడియోలు యూట్యూబ్‌లో చూసిన ఆస్ట్రేలియా దేశం సిడ్నీ నుంచి వినోద్, వీవీఎన్ కుటుంబ సమేతంగా గురువారం బెండపూడి పాఠశాలను సందర్శించారు. ఇంగ్లిషు ఉపాధ్యాయుడు ప్రసాద్ మాస్టర్ విద్యార్థులకు సులభంగా ఆంగ్ల భాషలో మాట్లాడించిన విధానం, అనుసరించిన మెళకువలను అడిగి తెలుసుకున్నారు. చదవండి: గ్రామీణ క్రీడల్లో నవశకం.. అనంతరం గురువారం రాత్రి కాకినాడ కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ కృతికా శుక్లాను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వినోద్, వీవీఎన్ దంపతులు బెండపూడి పాఠశాల విద్యార్థుల మాదిరిగా జిల్లాలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలు ఇంగ్లిషులో మాట్లాడే విధంగా ప్రత్యేకంగా ఇంగ్లిష్ లాంగ్వేజ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్‌ను పైలెట్ ప్రాజెక్టుగా తుని నియోజకవర్గంలో ప్రారంభించిన రీడ్‌నెస్ ఇనిషియేటీవ్ ఫర్ సిట్యూవేషనల్ ఇంగ్లిష్ (రైజ్) కార్యక్రమాన్ని అమలు చేస్తున్నందుకు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లాను అభినందించారు. ఇంగ్లిష్ లాంగ్వేజ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ విధానాన్ని పరిశీలించేందుకు ఆస్ట్రేలియా దేశం నుంచి కాకినాడ జిల్లాకు విచ్చేసినందుకు కలెక్టర్ కృతికా శుక్లా సంతోషం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌కు చెందిన వినోద్ ఆ్రస్టేలియాలో స్థిరపడ్డారు. ఆ్రస్టేలియాకు చెందిన వీవీఎన్ను వివాహం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో బెండపూడి ఇంగ్లిష్ టీచర్ రైజ్ ప్రాజెక్టు కో ఆర్డినేటర్ జి. ప్రసాద్, కె.పాల్‌రాజ్ తదితరులు ఉన్నారు. -
బెండపూడి జెడ్పీ హైస్కూల్: మీ ఆంగ్లం అద్భుతం: యూఎస్ కాన్సులేట్ జనరల్
తొండంగి: కాకినాడ జిల్లా బెండపూడి జెడ్పీ హైస్కూల్ విద్యార్థులు ఆంగ్ల భాషలో కనబరుస్తున్న ప్రతిభను గుర్తించిన అమెరికన్ కాన్సులేట్ జనరల్ డోనాల్డ్ హెప్లిన్ వారితో శుక్రవారం వెబ్ ఎక్స్ కాన్ఫరెన్స్ ద్వారా ముచ్చటించారు. అమెరికా యాసలో విద్యార్థులు ఇంగ్లిష్ మాట్లాడడంపై ఆయన అభినందనలు తెలిపారు. బెండపూడి జెడ్పీ హైస్కూల్ విద్యార్థులు అమెరికా యాసలో ఇంగ్లిష్‌ను అనర్గళంగా మాట్లాడడంతో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేకంగా విద్యార్థులను పిలిపించుకుని ముచ్చటించారు. ఇది కాస్తా జాతీయ మీడియాలో ప్రసారం కావడంతో అమెరికన్ కాన్సులేట్ అధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో బెండపూడి జెడ్పీ హైస్కూల్ విద్యార్థులతో మాట్లాడేందుకు ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి కార్యాలయాన్ని అమెరికన్ కాన్సులేట్ అధికారులు కోరారు. ఈ మేరకు విద్యాశాఖ ఆధ్వర్యంలో వెబ్ ఎక్స్ ద్వారా విద్యార్థులతో యూఎస్ కాన్సులేట్ జనరల్ డోనాల్డ్ హెప్లిన్ మాట్లాడేందుకు బెండపూడి హైస్కూల్లో ఏర్పాట్లు చేశారు. డోనాల్డ్ హెప్లిన్‌తో విద్యార్థులు మేఘన, రీష్మ, తేజస్విని, వెంకన్నబాబు మాట్లాడారు. సుమారు 20 నిమిషాలు విద్యార్థులు, ఉపాధ్యాయులతో ఆయన ముచ్చటించారు. ఎంత మందికి అమెరికాలో చదువుకోవాలని ఆసక్తి ఉందని ప్రశ్నించారు. విద్యార్థులంతా అమెరికాలో చదువుకునేందుకు ఆసక్తిగా ఉన్నామని బదులిచ్చారు. ఆంధ్రప్రదేశ్, అమెరికా సత్సంబంధాల అభివృద్ధికి ఆంగ్లభాష వారధిగా నిలుస్తుందని హెప్లిన్ పేర్కొన్నారు. విద్యార్థులను తీర్చిదిద్దిన ఉపాధ్యాయుడు ప్రసాద్‌ను కూడా హెప్లిన్ ప్రత్యేకంగా అభినందించారు. -
AP: ప్రభుత్వ పాఠశాలల్లో ‘స్పోకెన్ ఇంగ్లిష్’ క్లాసులు
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులు అనర్గళంగా ఆంగ్లంలో మాట్లాడేలా విద్యాశాఖ మరో ముందడుగు వేసింది. 26 జిల్లాల్లో తొలి దశలో భాగంగా జిల్లాకు 5 హైస్కూళ్లను ఎంపిక చేసి ప్రత్యేక ‘స్పోకెన్ ఇంగ్లిష్’ తరగతులు నిర్వహించేలా ప్రణాళికలు రూపొందించింది. దశల వారీగా అన్ని పాఠశాలల్లోనూ అమలు చేయనుంది. సాధారణ తరగతులతో పాటే ఆసక్తి కలిగిన విద్యార్థులకు ‘స్పోకెన్ ఇంగ్లిష్’ నేర్పిస్తారు. బెండపూడి.. నిడమానూరులో సక్సెస్ తూర్పుగోదావరి జిల్లాలోని బెండపూడి, గన్నవరం సమీపంలోని నిడమానూరు ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు ఇచ్చిన స్పోకెన్ ఇంగ్లిష్ శిక్షణతో అద్భుత ఫలితాలొచ్చాయి. దీనిని స్ఫూర్తిగా తీసుకుని రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో తొలుత ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చి.. ఆ తర్వాత విద్యార్థులకు ప్రత్యేక క్లాసులు బోధించేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. (క్లిక్: బాలయ్య ఏందయ్యా ఇది.. పాపం పిల్లలు మాడిపోయారు?) -
బాలికల విద్యకు భరోసా.. ప్రతి మండలానికో జూనియర్ కళాశాల: సీఎం జగన్
కాకినాడ జిల్లా బెండపూడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఇంగ్లిష్‌పై మంచి పట్టు సాధించారని అధికారులు సీఎం జగన్ దృష్టికి తీసుకురాగా.. ఆయన విద్యార్థులతో ముచ్చటించారు. అక్కడి ఇంగ్లిష్ టీచర్ ప్రసాద్ విద్యార్థులకు నేర్పించిన ఆంగ్ల బోధనా విధానాన్ని స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్ఓపీ)గా రూపొందించాలన్నారు. ఏడాదిలో రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో ఈ తరహా బోధనా విధానాన్ని ప్రవేశ పెట్టాలని సీఎం ఆదేశించారు. ఫొనెటిక్స్(ధ్వనిశాస్త్రం)పై ప్రస్తుతం పరిశోధన చేస్తున్న వారిని ఇందులో భాగస్వాములను చేయాలని, భాష సమగ్రంగా నేర్చుకోవడంలో యాక్సెంట్ (యాస), డైలెక్ట్ (మాండలికం) చాలా ప్రధానమైన అంశాలని చెప్పారు. వీటిపై ఎక్కువగా దృష్టి పెట్టాలని సూచించారు. గూగుల్ రీడ్ ఎలాంగ్ యాప్ ప్రతి టీచర్ మొబైల్లో ఉండేలా చూడాలన్నారు. ఇంగ్లిష్ టీచర్ ప్రసాద్‌ను ముఖ్యమంత్రి జగన్ ప్రత్యేకంగా అభినందించారు. పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య బాగా పెరిగింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 37 వేల అదనపు తరగతి గదులు అవసరం. నాడు–నేడు రెండో దశలో వీటి నిర్మాణం చేపట్టనున్నాం. ఇంగ్లిష్ భాషా బోధన, అభ్యాసం, ఫొనెటిక్స్ కోసం ప్రత్యేకంగా గూగుల్ సహకారంతో ‘గూగుల్ రీడ్ ఎలాంగ్ యాప్’ను రూపాందించాం. దీనిని శుక్రవారం (నేడు) అందుబాటులోకి తేనున్నాం. సమగ్రమైన ఇంగ్లిష్ బోధనకు ఈ యాప్ చాలా ఉపయోగకరం. అమ్మ ఒడికి బదులుగా రాష్ట్రంలో 8.21 లక్షల మంది విద్యార్థులు ల్యాప్‌టాప్‌లు కావాలని ఆప్షన్ ఎంచుకున్నారు. – సీఎం వైఎస్ జగన్‌తో అధికారులు సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇంటర్మీడియట్ స్థాయి విద్యావకాశాలను విస్తృత పరచడంలో భాగంగా ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలల సంఖ్యను పెంచాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా బాలికల కోసం మండలానికి ఒక జూనియర్ కళాశాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. తద్వారా ప్రభుత్వ విద్యా విధానం మెరుగు పడడమే కాకుండా ఎక్కువ మంది వినియోగించుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో విద్యా శాఖపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు మరుగుదొడ్ల నిర్వహణను సమర్థంగా నిర్వహించాలని ఆదేశించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 245 మండలాల్లో మాత్రమే బాలికల జూనియర్ కళాశాలలు ఉన్నాయని, మిగిలిన 434 మండలాల్లో జూనియర్ కాలేజీలను అందుబాటులోకి తేవాలని సూచించారు. అందుకోసం కేజీబీవీ లేదా హైస్కూల్‌ను ప్లస్ 2 స్థాయికి పెంచడం లేదా ఉన్న కాలేజీల్లోనే బాలికలకు ప్రత్యేక కాలేజీ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ అంశంపై విస్తృతంగా ప్రచారం చేస్తే విద్యార్థులు వినియోగించుకునే అవకాశాలు మెరుగు పడతాయని చెప్పారు. అందుకు అవసరమైన ఏర్పాట్లు చేశామని అధికారులు వివరించారు. ఈ సమీక్షలో సీఎం ఇంకా ఏమన్నారంటే.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో మాట్లాడుతున్న బెండపూడి జెడ్పీ హైస్కూల్ విద్యార్థులు మేఘన, తేజస్విని, రిష్మ, అనుదీప్, వెంకన్నబాబు 23,975 స్కూళ్లలో నాడు–నేడు రెండోదశ ► పాఠశాలల ప్రమాణాలను పెంచేందుకు నాడు–నేడు కార్యక్రమం చేపట్టాం. రెండో దశలో భాగంగా 23,975 స్కూళ్లలో రూ.8 వేల కోట్లతో సమూల మార్పులు చేయాలి. అన్ని స్కూళ్లలో నెల రోజుల్లో పనులు నూరు శాతం ప్రారంభించి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి. ► ప్రతి పాఠశాలలో విద్యార్థులకు ఇంగ్లిష్ భాషా పరిజ్ఞానం పెంచేలా చర్యలు తీసుకోవాలి. అన్ని పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన, మరుగుదొడ్ల నిర్వహణ సమర్థవంతంగా ఉండేలా చూడాలి. అందుకోసం పక్కాగా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్ఓపీ) పాటించాలి. ► గోరుముద్ద (మధ్యాహ్న భోజనం)పై అధికారులు మరింత శ్రద్ధ పెట్టాలి. ఎక్కడా రాజీ పడకుండా పూర్తి నాణ్యతతో ఈ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలి. అప్పుడే ఆశించిన లక్ష్యాన్ని చేరుకుంటాం. టాయిలెట్ మెయింటెనెన్స్ ఫండ్ (టీఎంఎఫ్), స్కూల్ మెయింటెనెన్స్ ఫండ్ (ఎస్ఎంఎఫ్), గోరుముద్ద పథకాన్ని మరింత మెరుగ్గా ఎలా అమలు చేయవచ్చో అధికారులు ఆలోచించాలి. ► విద్యార్థులకు అందించే విద్యా కానుక నాణ్యత విషయంలో ఎక్కడా రాజీపడొద్దు. ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా కిట్లు ఉండాలి. వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు తిరిగి తెరిచే జూలై 4 నాటికి కిట్లు పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి. జూన్‌లో అమ్మ ఒడి అమలు చేసేందుకు సన్నద్ధంగా ఉండాలి. ► ఈ సమీక్షా సమావేశంలో విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ, పాఠశాల విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బుడితి రాజశేఖర్, విద్యా శాఖ కమిషనర్ ఎస్.సురేష్ కుమార్, సర్వశిక్షా అభియాన్ ఎస్పీడీ వెట్రిసెల్వి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మీ స్ఫూర్తితోనే ఇంగ్లిష్‌లో ప్రావీణ్యం ► బెండపూడి జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థులు సీఎం వైఎస్ జగన్‌తో అనర్గళంగా ఇంగ్లిష్‌లో మాట్లాడారు. ప్రభుత్వ స్కూళ్లలో నాడు–నేడు, ఇంగ్లిష్ మీడియంలో బోధన వంటి గొప్ప కార్యక్రమాల ద్వారా మీరే మాకు స్ఫూర్తిగా నిలిచారని చెప్పారు. ► విభజన తర్వాత రాష్ట్రంలో ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ఇన్ని గొప్ప పథకాలు ప్రవేశపెడుతున్నారని, మీ వల్లే ఇంత గొప్పగా ప్రభుత్వ స్కూళ్లలో చదువుకోగలుగుతున్నామని ఎనిమిదో తరగతి విద్యార్థిని తేజస్విని ఆనందం వ్యక్తం చేసింది. తన చెల్లితో కలిసి కిడ్డీ బ్యాంక్‌లో దాచుకున్న డబ్బులు రూ.929 సీఎంకు విరాళంగా అందజేసింది. అయితే బాలిక గుర్తుగా సీఎం కేవలం రూ.19 తీసుకుని మిగతా డబ్బును తిరిగిచ్చారు. ► పదో తరగతి విద్యార్థిని మేఘన ఇంగ్లిష్‌లో మాట్లాడుతూ.. అమ్మ ఒడి పథకం ఎంతోమంది పేద విద్యార్థులకు ఉపయోగపడిందని, తాను తన ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో ఆంగ్ల భాషపై పట్టు సాధించానని చెప్పింది. అంతర్జాతీయ ఇంగ్లిష్ న్యూస్ చానెళ్లు కూడా తన భాషా పరిజ్ఞానానికి ఎంతో ఉపయోగపడ్డాయంది. ► మరో విద్యార్థిని రిష్మ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ విద్యను ప్రవేశపెట్టింది సీఎం జగన్ మాత్రమేనని, తనకు ఎంతో ఆనందంగా ఉందని చెప్పింది. ప్రపంచంతో అనుసంధానం అయ్యేందుకు ఇంగ్లిష్ మాత్రమే ఉపయోగ పడుతుందని పేర్కొంది. ► ఏడో తరగతి విద్యార్థి అనుదీప్ మాట్లాడుతూ.. ‘ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంపై వస్తున్న విమర్శలను పట్టించుకోవద్దు. మీ నిర్ణయంపై మీరు (సీఎం) య«థావిధిగా ముందుకెళ్లాలి. మీ నమ్మకాన్ని మేం వమ్ము చేయం. మీ వెనుక మేముంటాం. నేను బాగా చదువుకుని ఐఏఎస్ అవుతా. అప్పుడూ మీరే సీఎంగా ఉండాలి. నేను మీ వద్ద సెక్రటరీగా పనిచేసి ఇప్పుడు విమర్శిస్తున్న అందరి నోళ్లు మూయిస్తా. నాకు ఆ అవకాశం ఇస్తానని మాటివ్వండి’ అని కోరాడు. అనుదీప్ మాటలపై సీఎం జగన్‌తో పాటు అక్కడున్న అధికారులంతా ఆనందపడ్డారు. -
నేను ఐఏఎస్ అయ్యేదాకా మీరే సీఎంగా ఉండాలి సార్
సాక్షి, తాడేపల్లి: ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టడంపై కొందరు అనవసర రాద్ధాంతం సృష్టించిన సంగతి తెలిసిందే. కానీ వారి వాదనను తప్పని నిరూపించారు కాకినాడ బెండపూడి విద్యార్థులు. దీనివల్ల పేద విద్యార్థులకు మేలు జరుగుతోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వద్ద ప్రస్తావించారు బెండపూడి విద్యార్థులు. జిల్లా పరిషత్ హైస్కూల్లో చదువుతున్న ఆ విద్యార్థుల ఆంగ్ల భాషా పటిమకు సీఎం జగన్ ఫిదా అయిపోయారు. గురువారం తాడేపల్లికి ఆ విద్యార్థులను రప్పించుకుని కాసేపు మాట్లాడారాయన. ఈ సందర్భంగా.. రేష్మా అనే పదో తరగతి విద్యార్థిని మాట్లాడిన తీరుకు సీఎం జగన్ మురిసిపోయారు. హామీలన్నింటిని నెరవేరుస్తున్న ముఖ్యమంత్రి మీరని(సీఎం జగన్‌ను ఉద్దేశించి).. ఇంగ్లీష్ నేర్చుకుంటే అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడవచ్చని చెప్పింది రేష్మా. ఇక మేఘన అనే విద్యార్థి మాట్లాడుతూ.. అమ్మ ఒడి పథకం పేదలకు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పింది. సగటు విద్యార్థిగా ఉన్న తనను.. మంచి వక్తంగా, అదీ ఇంగ్లీష్ ద్వారా రాటుదేల్చారని సంతోషం వ్యక్తం చేసింది. ప్రత్యేకించి.. మీ(సీఎం జగన్‌ను ఉద్దేశించి) ఇంగ్లీష్ ఇంటర్వ్యూలు ఎంతో ఉపయోగపడ్డాయని చెప్పింది మేఘన. అనుదీప్ అనే విద్యార్థి మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాల్లలో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టడం ఆనందంగా ఉందని, అందుకు కృతజ్ఞతలని అన్నాడు. ఎవరెన్ని విమర్శలు చేసినా.. విద్యార్థులంతా మీ వెన్నంటి ఉంటామని చెప్పాడు. తనకు ఐఏఎస్ ఆఫీసర్ కావడమే తన లక్ష్యమని, తాను ఐఏఎస్ ఆఫీసర్ అయ్యేదాకా మీరు సీఎంగా కొనసాగాలని, మీ దగ్గర పని చేయడం తన కోరికని, ప్రామిస్ చేయమని సీఎం జగన్‌ను కోరాడు అనుదీప్. ఆ చిన్నారి మాటలకు సీఎం జగన్ సహా అక్కడున్న వాళ్లంతా నవ్వుల్లో మునిగిపోయారు. ఇంగ్లీష్ మాట్లాడటంలో మంచి ప్రతిభను చూపుతున్న బెండపూడి విద్యార్థులను అభినందించిన సీఎం జగన్.. ఉన్నత శిఖరాలను అందుకోవాలని మనసారా ఆశీర్వదించారు. చదవండి: ‘బెండపూడి’ జెడ్పీ హైస్కూల్ విద్యార్థులతో ముచ్చటించిన సీఎం జగన్ -
విద్యార్థులతో ముచ్చటించిన సీఎం జగన్
-
విద్యార్థులతో సీఎం జగన్ ముచ్చట
-
‘బెండపూడి’ విద్యార్థులతో ముచ్చటించిన సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: కాకినాడ జిల్లా తొండంగి మండలంలోని బెండపూడి జిల్లాపరిషత్ హైస్కూలు విద్యార్థులు.. విదేశీ శైలి ఆంగ్లంతో అనర్గళంగా మాట్లాడి అందరినీ అబ్బురపరిచారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు ఈ తరహాలో ఇంగ్లిష్‌లో మాట్లాడడం సోషల్ మీడియాలోనూ విపరీతంగా వైరల్ అయ్యింది. ‘ఇంగ్లిష్‌పై బెండపూడి జెండా’ కథనం ద్వారా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి వెళ్లింది ఈ విషయం. ఈ నేపథ్యంలో.. ఆయన స్వయంగా రప్పించుకుని ఆ విద్యార్థులతో ముచ్చటించారు. గురువారం బెండపూడి జిల్లా పరిషత్ హై స్కూల్ విద్యార్థులు తాడేపల్లికి వెళ్లి.. సీఎం జగన్‌ను కలిశారు. ఈ సందర్భంగా.. వాళ్లతో సీఎం జగన్ సంభాషణ దాదాపుగా ఆంగ్లంలోనే కొనసాగింది. వాళ్ల ప్రతిభను మెచ్చుకుని.. భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అందుకోవాలని దీవించారు సీఎం జగన్. మేఘన అనే స్టూడెంట్ తన కిడ్డీ బ్యాంక్‌లోని రూ. 929 సీఎం జగన్‌కు ఇచ్చింది. అయితే మేఘన నుంచి కేవలం రూ.19 మాత్రమే తీసుకుని మిగతా డబ్బును ఆమెకే ఇచ్చారు సీఎం జగన్. ఈ దృశ్యం అక్కడున్నవాళ్లను ఆకట్టుకుంది. సీన్ రివర్స్ అయ్యింది: టీచర్ తాను తెలుగు మీడియం విద్యార్థిని కావడంతోనే.. ఇంగ్లిష్‌పరంగా వాళ్లకు ఇబ్బందులు ఎదురు కాకుండా బోధించానని, తద్వారా విద్యార్థుల్లో ఆంగ్ల భాషపై పట్టు వచ్చిందని విద్యార్థుల కూడా వచ్చిన ప్రభుత్వ టీచర్ తెలిపారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉపాధ్యాయులంతా నిబద్ధతతో పని చేస్తున్నారని తెలిపారాయన. గత రెండేళ్లలో సీన్ రివర్స్ అయ్యిందని, కార్పొరేట్.. ప్రైవేట్ స్కూళ్లలోనూ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల వీడియోలను ప్రదర్శిస్తుండగా విశేషం అని చెప్పారాయన. -
బెండపూడి విద్యార్థుల ప్రతిభకు సీఎం జగన్ ఫిదా
తొండంగి: కాకినాడ జిల్లా తొండంగి మండలంలోని బెండపూడి జెడ్పీ హైస్కూలు విద్యార్థులు విదేశీ శైలిలో అనర్గళంగా ఇంగ్లిష్‌లో మాట్లాడి అబ్బురపరచిన వైనం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి వెళ్లింది. ‘ఇంగ్లిష్‌పై బెండపూడి జెండా’ శీర్షికతో ఇటీవల ‘సాక్షి’లో కథనం వెలువడిన సంగతి తెలిసిందే. దీనిపై సీఎం స్పందించారు. తనను కలవాల్సిందిగా సీఎం నుంచి తమకు సమాచారం అందిందని బెండపూడి జెడ్పీ హైస్కూలు హెడ్మాస్టర్ జి.రామకృష్ణారావు, ఇంగ్లిష్ ఉపాధ్యాయుడు జి.వి.ప్రసాద్ తెలిపారు. గురువారం విద్యార్థులను తోడ్కొని వెళ్లి సీఎంను కలవనున్నట్టు వారు వివరించారు. -
మరణ ప్రయాణం
బెండపూడి(తొండంగి), న్యూస్‌లైన్ :పెళ్లి పనుల్లో అక్కరకొస్తుందనుకున్న మోటార్ బైక్ మృత్యు వాహనంగా మారింది. వద్దన్నా వినకుండా బావ మరిది పెళ్లికి బైక్‌ను తీసుకెళ్లిన వ్యక్తి.. అదే బైక్‌పై తిరిగొస్తూ ప్రమాదానికి గురయ్యాడు. బస్సును క్రాస్ చేస్తుండగా.. అదుపుతప్పి రోడ్డు పక్కనున్న గార్డ్ పోస్టు(స్తంభాలు)లను ఢీకొని అక్కడికక్కడే మరణించాడు. జాతీయ రహదారిపై బెండ పూడి శివారు తమ్మయ్యపేట వద్ద శనివారం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతుడి బంధువులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.సామర్లకోట మఠం సెంటర్‌కు చెందిన జామి నరసింహారావు(40) ఆదిత్య మెడికల్స్‌ను నిర్వహిస్తున్నాడు. అతడి బావమరిది ఏఎస్ రావు పెళ్లి విశాఖపట్నంలో ఏర్పాటు చేయడంతో కొద్ది రోజుల క్రితం నరసింహారావు తన కుటుంబ సభ్యులతో కలిసి అక్కడికి వెళ్లాడు. బావమరిది పెళ్లిలో సాయంగా ఉంటుందని తన మోటార్ బైక్‌ను తీసుకెళ్లాడు. వివాహ వేడుకలు ముగిశాక శనివారం ఉదయం విశాఖపట్నం నుంచి మోటార్ బైక్‌పై సామర్లకోటకు తిరుగు పయనమయ్యాడు. పెళ్లి సందర్భంగా ఆడపడుచుకు ఇచ్చిన బియ్యం మూటను తీసుకుని అతడు బయలుదేరాడు. ఇతర బంధువులతో కలిసి అతడి భార్య రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌లో పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు బయలుదేరింది. ఇలాఉండగా జాతీయ రహదారిలోని బెండపూడి శివారు తమ్మయ్యపేట దాటాక బస్సును బైక్‌తో క్రాస్ చేస్తూ నరసింహారావు అదుపుతప్పి రోడ్డు పక్కనున్న గార్డ్ పోస్ట్‌లను ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో నరసింహారావు తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే చనిపోయాడు. స్థానికులు ఈ విషయాన్ని నరసింహారావు సెల్‌ఫోన్ ద్వారా అతడి బంధువులకు తెలిపారు. విశాఖపట్నం నుంచి రైలులో అత్తవారింటికి వెళ్తున్న ఏఎస్ రావుకు ఈ విషయం తెలిసింది. అప్పటికే రైలు అన్నవరం చేరుకోవడంతో.. ఏఎస్ రావు రైలు దిగి సంఘటన స్థలానికి చేరుకున్నాడు. దగ్గరుండి తన పెళ్లిని సందడిగా జరిపించిన బావ తిరిగిరాని లోకానికి వెళ్లిపోయాడని ఏఎస్ రావు విలపించిన తీరు చూపరులను కంటతడి పెట్టించింది. బంధువులకు అతడు సమాచారం అందించడంతో వారంతా అక్కడికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. వద్దన్నా వినలేదు ‘బావా.. బైక్‌ను పార్శిల్లో పంపుదాం, రైలులో మావెంట వచ్చేయ్’ అని చెప్పినా వినకుండా నరసింహారావు బైక్‌పై బయలుదేరాడని ఏఎస్ రావు సంఘటన స్థలంలో భోరున విలపించాడు. నరసింహారావుకు భార్య పద్మ, కుమార్తెలు అనూష, శ్రీవర్ష ఉన్నారు. సామర్లకోట మఠం సెంటర్లో మెడికల్ షాపు నిర్వహిస్తూనే, ఆయిల్ వ్యాపారం కూడా చేస్తున్నట్టు బంధువులు తెలిపారు. తొండంగి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తుని ఏరియా ఆస్పత్రికి తరలించారు.