Bengal politics
-
బీజేపీతో టచ్‌లో 45మంది టీఎంసీ ఎమ్మెల్యేలు!
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో ప్రతిపక్ష నేతల మాటలతో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. తాజాగా కేంద్ర మంత్రి, బీజేపీ నేత నిశిత్ ప్రమానిక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ(టీఎంసీ)కి చెందిన 40-45 మంది ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్‌లో ఉన్నారని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో కీలక పరిణాణాలు చోటు చేసుకోనున్నాయని తెలిపారు. అంతకు ముందు బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు సైతం ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అరెస్ట్ కాబోతోందని, 40 మంది టీఎంసీ ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్‌లో ఉన్నారని పేర్కొన్నారు. కూచ్ బెహర్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమం వేదికగా ఈ వ్యాఖ్యలు చేశారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిశిత్ ప్రమానిక్. తృణమూల్ కాంగ్రెస్ పునాదులు బలహీనంగా మారాయని ఆరోపించారు. ‘తృణమూల్ కాంగ్రెస్ పార్టీ సంస్థాగత పునాదులు చాలా బలహీనంగా ఉన్నాయి. ఇసుక మేటల వలే ఉన్నాయి. పేకమేడలా ఎప్పుడైనా కూలిపోవచ్చు. అది మాకు అర్థమవుతోంది. బెంగాల్ ప్రజలకు సైతం తెలుసు. 40 నుంచి 45 మంది టీఎంసీ ఎమ్మెల్యేలు మాతో టచ్‌లో ఉన్నారు. భవిష్యత్తులో ఏం చేయాలనేదానిపై ఆలోచన చేస్తున్నాం.’ అని పేర్కొన్నారు కేంద్ర మంత్రి. ఇదీ చదవండి: పార్లమెంట్లో మహిళా సభ్యురాలిపై చేయి చేసుకున్న ఎంపీ.. వీడియో వైరల్ -
బెంగాల్లో ‘దళిత రాజకీయం’!
సాక్షి, న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ రాజకీయాలు ఎన్నికల సమయంలో రసవత్తరంగా మారాయి. ఇప్పటికే నాలుగు విడతల ఎన్నికలు పూర్తవగా, మిగతా నాలుగు దశల్లో తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించుకొనేందుకు అధికార టీఎంసీతో పాటు కమలదళం ఉవ్విళూరుతున్నాయి. బెంగాల్ గడ్డపై కాషాయ జెండా ఎగురవేసేందుకు భారతీయ జనతా పార్టీ పూర్తిగా ఎటాక్ మోడ్‌లోనే పనిచేస్తోంది.రాష్ట్రంలో కీలకంగా, నిర్ణయాత్మకంగా ఉన్న దళితులను మచ్చిక చేసుకొనేందుకు చిన్న అవకాశాన్ని టీఎంసీ, బీజేపీలు వదులుకోవట్లేదు. రాష్ట్రంలోని 294 అసెంబీ నియోజకవర్గాల్లో షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) కు 68, షెడ్యూల్డ్ తెగల (ఎస్టీ)\కు 16 స్థానాలు ఉన్నాయి. అయితే రాష్ట్ర ఓటర్లలో 23.5 శాతం, జనాభాలో 25-30 శాతం మంది ఉన్న దళితులు రాష్ట్రంలోని కనీసం 100-110 సీట్ల ఫలితాలను ప్రభావితం చేయగలరు. ఈనెల 17 నుంచి 29వ తేదీ మధ్య జరుగబోయే చివరి నాలుగు దశల్లోని ఎక్కువ స్థానాల్లో వీరి ప్రభావం ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తు న్నారు. తృణమూల్ కాంగ్రెస్‌కు దూరంగా ఉన్న మాతువా, ఆదివాసి, రాజవంశీ, బౌరి,బాగ్డి వంటి కులాలను తాయిలాలు ప్రకటించడం ద్వారా తమవైపు తిప్పుకొనేందుకు మమతా బెనర్జీ ఒకవైపు ప్రయత్నిస్తుంటే, మరోవైపు ఈ వర్గాలను ఆకర్షిం చేందుకు బీజేపి నాయకులు సైతం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఉత్తర బెంగాల్‌లోని కూచ్ బెహార్, ఇతర సరిహద్దు జిల్లాల్లో నివసిస్తున్న రాజ్‌వంశీలు, తూర్పు పాకిస్తాన్ నుంచి వచ్చిన శరణార్థులు మతువాలు. దళితుల్లోని ఈ రెండు బలమైన సామాజిక వర్గాలు దక్షిణ బెంగాల్‌లోని 30-40 సీట్లలో తమ ప్రభావాన్ని చూపిస్తారు. ఆ సామాజిక వర్గమే కీలకం మతువాలకు సంబంధించి అనేక అంశాల్లో కీలక ప్రకటనలు చేయడంతో పాటు, 2019 సార్వత్రిక ఎన్నికల్లో అనుసరించిన వ్యూహాన్ని అమలు చేసే ప్రక్రియపై కమలనాథులు ప్రణాళికలు అమలు చేస్తున్నారు.మతువా సామాజిక వర్గానికి పౌరసత్వం ఇచ్చేందుకు సవరించిన పౌరసత్వ చట్టం (సీఏఏ)ను అమలు చేయడంపై వారికి బీజేపీ నాయకులు హామీ ఇచ్చారు. అంతేగాక ఇతర రాష్ట్రాల్లో తమ విజయానికి కారణమైన ఎంతో నమ్మకమున్న పాత ఫార్ములాను పూర్తిస్థాయిలో కమలదళం అమలుచేస్తోంది. గిరిజనులు, దళితులు, రైతుల ఇళ్ళలో భోజనం చేయడం, స్థానిక దేవాలయాల్లో పూజలు చేయడం వంటి పాత ఫార్ములాను అనుసరించడంతో పాటు బెంగాల్లో కొత్త ప్రయోగాలను అమలు చేస్తోంది. అందులోభాగంగా ఇంటింటికి వెళ్ళి పిడికిలి బియ్యం తీసుకోవడం, సహపంక్తి భోజనాలు చేయడం వంటి కార్యక్రమాల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో తమ పట్టును పెంచుకొనే ప్రయత్నాలు గత ఏడాదిగా ముమ్మరం చేశారు. బీజేపీ దశ మార్చిన సార్వత్రిక ఎన్నికలు ఈ అసెంబ్లీ ఎన్నికల్లో 79 మంది దళిత అభ్యర్థులను తృణమూల్ కాంగ్రెస్ నిలబెట్టగా, ఒక టీఎంసీ అభ్యర్థి దళితులను బిచ్చగాళ్లతో పోల్చినట్లు ఆరోపణలు రావడం రాష్ట్రంలో పెద్ద ఎత్తున వివాదాస్పదంగా మారింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కమలదళం రాష్ట్రంలోని రిజర్వ్ సీట్లలో ఎక్కువ భాగం గెలుచుకుంది. ఆ తర్వాత మమతాబెనర్జీ దిద్దుబాటు చర్యలు తీసుకున్నారు. అందులో భాగంగా సీఎఎ అమలు ఆలస్యంతో పాటు అన్ని శరణార్థుల కాలనీలను క్రమబద్ధీకరించడానికి, వారికి భూమి హక్కులు ఇవ్వడం అంశాలపై దీదీ దృష్టిపెట్టింది. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో రిజర్వు చేసిన 50 స్థానాల్లో తృణమూల్ విజయం సాధించగా, 2019 లోక్‌సభ ఎన్నికల్లో కమలదళం ఎస్సీ ఆధిప త్య ప్రాంతాల్లో తమదైన ముద్ర వేసుకొని 46 స్థానా ల్లో ఆధిక్యం సాధించింది. దీంతో ఇప్పుడు అధికార పీఠంపై కూర్చొనేందుకు నిర్ణయాత్మకంగా ఉన్న దళి తుల విషయంలో ఇరు పార్టీలు అత్యధిక శ్రద్ధ చూపిస్తున్నారు. అందులో భాగంగా అధికారంలోకి వచ్చిన వెంటనే మండల కమిషన్ సిఫారసుల ప్రకారం మహిష్య, తేలి, తముల్, సాహా వంటి సామాజిక వర్గాలను ఓబిసి జాబితాలో చేర్చుతామని బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్‌లు హామీ ఇచ్చాయి. దళితుల అంశంలో ఇరు పార్టీల నాయకుల మధ్య మాటల యుద్ధాలు ప్రచారం ప్రారంభమైనప్పటి నుంచి కొనసాగుతూనే ఉన్నాయి. మరోవైపు విభజన రాజకీయాల ద్వారా పశ్చిమ బెంగాల్ రాజకీయాల స్థాయిని బీజేపీ, టీఎంసీలు తగ్గిస్తున్నాయని సీపీఐ (ఎం) నిందించింది. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండి పశ్చిమ బెంగాల్లో ఎన్నికలు ఎప్పుడూ సైద్ధాంతిక మార్గాల్లోనే పోరాడుతున్నాయి. ఎప్పుడూ మతం, కుల ఆధారిత రాజకీయాలు వెనకబడే ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీదీ బాటలో బీజేపీ మతపరమైన మైనారిటీలతో పాటు దళితుల ఓట్లను టీఎంసీకి అనుకూలంగా ఏకీకృతం చేయాలని తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ మొదట్లో భావించారు. 2011 ఎన్నికలలో టీఎంసీ అభ్యర్థులుగా మతువాల అధికార స్థానమైన మాతువా ఠాకుర్బారి సభ్యులను దీదీ నామినేట్ చేసింది. ఈ కారణంగా మమతా బెనర్జీ విజయానికి మార్గం సుగమం అయ్యింది. అనంతరం టీఎంసీ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా వివిధ సామాజిక వర్గాల అభివృద్ధి బోర్డులను ఏర్పాటు చేశారు. దీంతో 2014 లోక్‌సభ, 2016 అసెంబ్లీ ఎన్నికలలో పార్టీకి కలిసి వచ్చింది. సీఏఏను అమలు చేస్తామని బిజెపి ఇచ్చిన వాగ్దానం, దళితుల్లో అత్యల్ప వర్గాలైన బౌరిస్, బాగ్డిస్ల మధ్య ఆర్ఎస్ఎస్ పని చేయడం, మాతువా ఠాకూర్బారి సభ్యులను నామినేట్ చేయాలన్న వ్యూహం కమలదళానికి అనుకూలంగా మారింది. అంతేగాక తృణమూల్ కాంగ్రెస్ మైనార్టీలను సంతృప్తిపరచడమే కాకుండా కాకుండా, బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వలసదారులకు అనుకూలంగా ఉందని బీజేపీ ఆరోపిస్తోంది. -
బెంగాల్ దంగల్
-
ముకుల్ రాయ్‌తో మోదీకి ఒరిగేదేమిటీ?
సాక్షి, కోల్‌కతా : దుర్గా మాతా ఉత్సవాలు శనివారం నాడు ముగియగానే తాను తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని తణమూల్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ముకుల్ రాయ్ ప్రకటించగానే ఆయనపై పార్టీ అధిష్టానం చర్య తీసుకుంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలపై ఆయన్ని ఆరేళ్ల పాటు బహిష్కరించింది. ఇవన్నీ కూడా ముందుగానే ఊహించిన పరిణామాలే. గత కొంతకాలంగా బీజేపీ అధినాయత్వంతో రాసుకుపూసుకు తిరుగుతున్న ముకుల్ రాయ్ త్వరలోనే ఆ పార్టీలో చేరుతారన్న విషయాన్ని ప్రజలు ఇప్పటికే గ్రహించారు. శారదా చిట్‌ఫండ్ కంపెనీ స్కామ్‌లో ఇరుక్కుని సీబీఐ చేతిలో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ముకుల్ రాయ్‌కి గాలంవేస్తే ఇట్టే పడిపోతారన్న విషయాన్ని గ్రహించిన బీజేపీ అందుకు అనుగుణంగా పావులు కదుపుతూ వస్తోంది. బెంగాల్ రాష్ట్రంలో లక్షలాది మంది ప్రజలను మోసం చేసిన చిట్‌ఫండ్ కేసులో తీవ్ర నేరారోపణలు ఎదుర్కొంటున్న ముకుల్ రాయ్, అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు బీజేపీ మార్గదర్శకత్వంలో పనిచేస్తున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి మమతా బెనర్జీ వెన్నంటి ఉన్న ఆయన ఎప్పటికప్పుడు తణమూల్ పార్టీకి సంబంధించిన సమాచారాన్ని బీజేపీకి చేరవేస్తూ వస్తున్నారు. అందులో భాగంగానే తాను రాజ్యసభకు రాజీనామా చేయబోతున్నానని ప్రకటించారు. ఎలాగు ఆయన బీజేపీలో చేరేందుకే పార్టీ వీడుతున్నారన్న విషయాన్ని ముందుగానే గ్రహించిన తణమూల్ ఆయన్ని పార్టీ నుంచి బహిష్కరించింది. ఆయన నిర్వహిస్తున్న పార్టీ ఉపాధ్యక్ష పదవిని ఈ నెల 20వ తేదీనే తెలివిగా రద్దు చేసింది. 1998లో తణమూల్ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేసినప్పటి నుంచి ముకుల్ రాయ్ మమతా బెనర్జీతోనే ఉన్నారు. 2007లో సింగూరు, నందిగ్రామ్ పారిశ్రామిక ప్రాజెక్టుల కోసం రైతుల భూములను స్వాధీనం చేసుకోవడానికి వ్యతిరేకంగా పార్టీ ఆందోళనను నడిపించడంలో మమతతోపాటు ముందున్నారు. 2011లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 34 ఏళ్ల వామపక్షాల ప్రభుత్వాన్ని కూలదోయడంలో కూడా ఆయన కీలక పాత్ర వహించారు. 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బలంగా వీచిన పవనాలను అడ్డుకొని 42 సీట్లకుగాను 34 పార్లమెంట్ సీట్లను పార్టీ కైవసం చేసుకోవడంలో కీలక భూమికను పోషించారు. 2006లో ఎగువ సభకు ఎన్నికైన ఆయన మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో షిప్పింగ్, రైల్వే శాఖల్లో సహాయ మంత్రిగా పనిచేశారు. 2016లో జరిగిన ఎన్నికల్లో కూడా ముకుల్ రాయ్ పార్టీ విజయానికి తీవ్రంగా కషి చేశారు. అదే ఎన్నికల్లో మున్నెన్నడు లేనివిధంగా బీజేపీకి కూడా 10.2 శాతం ఓట్లు రావడంతో ఆ పార్టీకి కూడా కొత్త ఆశలు చిగురించాయి. ముకుల్ రాయ్ లాంటి నాయకులను పార్టీలోకి లాక్కుంటే పార్టీని మరింత బలోపేతం చేయవచ్చని భావించిన బీజేపీ అందుకు అనుగుణంగా పార్టీలోకి తణమూల్ నేతలకు ఆహ్వానం పలికింది. అయితే ఎవరూ ముందుకు రాలేదు. కేసులో ఇరుక్కోవడం వల్ల ముకుల్ రాయ్ ముందుకు వచ్చారు. మమత వెన్నంటి ఉండి పార్టీని విజయపథాన నడిపించడంలో ఎంత కీలక పాత్ర వహించినప్పటికీ ప్రజల్లో మమతా బెనర్జీకున్న పలుకుబడి ముకుల్ రాయ్‌కు లేదు. పైగా ఆయన మాస్ లీడర్ కారు. పైగా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఇప్పట్లో లేవు. ఇలాంటి పరిస్థితుల్లో ముకుల్ రాయ్ బీజేపీలో చేరడం వల్ల ఆ పార్టీకి ఒరిగేదేమీ ఉండదు. బీజేపీ ఇలాంటి నేతలపై ఆధారపడడం కన్నా పార్టీని పునాదుల స్థాయి నుంచి బలోపేతం చేయడం పట్ల దష్టిని కేంద్రీకరించడం మంచిది. -
బెంగాల్ రాజకీయ గణితం
బైలైన్: ఎం.జె. అక్బర్, సీనియర్ సంపాదకులు రాజ్యసభ ఎన్నికల్లో బెంగాల్లో ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ముగ్గురు వామపక్ష ఎమ్మెల్యేలు తృణమూల్‌కు ఫిరాయించారు. వామపక్షాలు మరణిస్తుండగా, కాంగ్రెస్ అపస్మారకస్థితిలో ఉన్నదనేదే వారి సందేశం. వామపక్షాలు అధికారంలో ఉన్నప్పుడు మమత వారికి ముప్పుగా ఉండేది. వాళ్లిప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు, వారి భవిష్యత్తుకు ముప్పు ఇప్పుడు బీజేపీ నుంచే. రాజకీయవేత ్తలు ఎప్పుడు ఎందుకు పార్టీ ఫిరాయిస్తారు? సమాధానం సర్వసాధారణంగా వినవచ్చేదే గానీ అంత సులభమైనదేమీ కానిది... డబ్బు. రాజకీయవేత్తల నైతికత గురించి మనకు బొత్తిగా సదభిప్రాయం లేకపోవడానికి సజావైన కారణమే ఉంది. అలా అని శాసనసభ సభ్యుల విధేయతను కొనుక్కోడానికి డబ్బు మాత్రమే సరిపోయేట్టయితే... పరంపరాగతమైన అస్థిరతే నెలకొం టుంది. ఆస్కార్ వైల్డ్ ఎన్నడో అన్నదాన్ని నా మాటల్లో చెప్పాలంటే... రాజకీయవేత్తల్లో చాలా మంది దేన్నయినా తిరస్కరించగలుగుతారు... ఒక్క ప్రలోభాన్ని తప్ప. ఎంతైనా డబ్బు ఒకేసారి జరిగే చెల్లింపు. కాబట్టి ఫిరాయింపులు అప్పుడప్పుడు జరిగేవిగానే ఉంటాయి. రాజకీయవేత్తలు కూడా ఇతర వృత్తి నిపుణులవలెనే పదవీ విరమణానంతర ప్రయోజనాలను కోరు కుంటారు. గతవారం జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో బెంగాల్‌కు చెందిన ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ముగ్గురు వామ పక్ష ఎమ్మెల్యేలు తృణమూల్‌లోకి ఫిరాయించారు. తద్వారా వాళ్లు ప్రజాజీవితంలో డబ్బు నిర్వహించే చలనశీలమైన పాత్రకు మించి పరిగణనలోకి తీసుకోగలిగిన అంశాన్ని సూచించారు. వామపక్షాలు మరణిస్తుండగా, కాం గ్రెస్ అపస్మారక స్థితిలో ఉన్నదనేదే వారి రాజకీయ సందేశం. సీపీఐ(ఎం) పరిస్థితి బాగా లేదు గానీ ఇంకా బతికే ఉంది. వామపక్ష కూటమిలోని ప్రధాన, జూనియర్ భాగస్వాములంతా కలిసి ఆధునిక చరిత్రలోనే అత్యంత అసాధారణమైన రాజకీయ యంత్రాంగాన్ని నిర్మించారు. ఆ కూటమికి సంతాప సందేశం చిత్తుప్రతిని తయారు చేసుకోవాల్సిన సమయమిది. సీపీఎంకు ఎర్రజెండాను ఊపడానికి తగిన బలం ఇం కా ఉంది. దాని ఓట్ల శాతానికి చేర్పులే అయినా కీలక శాతాలను చేర్చిన చిన్న పార్టీలు రాజకీయ సరిహద్దుల అంచులకు ఒత్తుకుపోయి ఉన్నాయి. దశరథ్ తిర్కే, అనంత అధికారి అనే ఇద్దరు ఎమ్మెల్యేలు వామపక్షాలను వదిలిపెట్టేశారు. వారిద్దరు ఒకప్పుడు విప్లవాన్ని, సోషలిజాన్ని తెస్తామని వాగ్దానం చేసిన రివల్యూషనరీ సోషలిస్టు పార్టీకి చెందినవారు. ఇక మూడో ఎమ్మెల్యే సునీల్ మండల్ ఇంకా ఎందుకు అస్థిత్వంలో ఉన్నదో అర్థంకాని ఫార్వర్డ్ బ్లాక్‌కు చెందినవారు. ముగ్గురూ షెడ్యూల్డ్ కులాలు, తెగల నేతలే. బడుగువర్గాలు మార్క్సిస్టు దుర్గాన్ని విడిచిపోయాయి. ఆ బురుజులు ఖాళీ అయిపోయాయనేది తెలిసిందే. కాంగ్రెస్ కూడా అంత ప్రమాదకరమైన సమస్యనే ఎదుర్కొంటోంది. మాల్దాలో కూడా అది మద్దతును కోల్పోయింది. ఘనీ ఖాన్ చౌదరి కుటుంబానికి స్థానికంగా అక్కడ ఉన్న పలుకుబడి పుణ్యమాని వామపక్షాల బలం పెంపొందుతున్న దశాబ్దాల్లో సైతం అది కాంగ్రెస్‌కు విధేయంగా నిలిచింది. సీనియర్ నేత ఘనీఖాన్ మరణించారు. ఆయన సోదరుడు ఎమ్మెల్యే అబూ నాజర్ పార్టీ చెప్పిన వారికి ఓటు వేయలేదు. పొరుగు నియోజకవర్గమైన ముర్షిదాబాద్‌కు చెందిన ఆయన సహచరుడు ఇమానీ బిశ్వాస్ పార్టీ అర్ధమనస్క చర్యలపై రాజీకి తిరస్కరించి మమతా బెనర్జీకి ఓటు చేశారు. ఈ తిరుగుబాటు బెంగాల్ కాంగ్రెస్‌ను వచ్చే సార్వత్రిక ఎన్నికల తదుపరి ఒకే ఒక్క సీటుకు కుదించేయగలుగుతుంది. ఆవిర్భవిస్తున్న రాజకీయ గణితం మర్మాలను విప్పడం ఎలాగో తెలిస్తే తప్ప బెంగాల్లో సాగుతున్న ఈ మహా మథనం అర్థం కాదు. మమతా బెనర్జీ నూతన వ్యవస్థ. రాబోయే మరి కొన్నేళ్లు కూడా ఆమె అలాగే ఉంటారు. అయితే మార్క్సిస్టులు ప్రతిపక్షం స్థానాన్ని సైతం శాసించగల స్థితిలో లేరు. ఆ పార్టీ అంతర్గత నిర్మాణం కుప్పకూలిపోవడం మాత్రమే అందుకు కారణం కాదు. క్యాడర్ వ్యవస్థపై నిర్మితమైన ఆ పార్టీ ఓటమి వల్ల కలిగిన దిగ్భ్రాంతి నుంచి శ్రేణులు బయటపడ్డంతోనే తిరిగి కేడర్లను భర్తీ చేసుకోగలుగుతుంది. కాకపోతే అది తన భావజాలపరమైన కథనానికి ప్రత్యామ్నాయాన్ని అందించడం కాదు గదా మరమ్మతులు సైతం చేసుకోలేని స్థితిలో ఉంది. అదే దాని అసలు సమస్య. బెంగాల్ ఓటర్ స్థానిక రకం సోషలిజాన్ని తగినంతగానే చూశాడు, ఏదైనా భిన్నమైనదాన్ని వినాలని అనుకుంటున్నాడు. మమత జనాకర్షణకు మించి వాగ్దానం చేసిందేమీ లేదు. కాబట్టి దానితోనే నెట్టుకుపోగలుగుతారు. బోధించినదాన్ని ఆచరించి చూపడమే ఆమె ముందున్న సవాలు. కాకపోతే ఆమెకు సమయం అనే విలాసవంతమైన సౌలభ్యం ఉంది. అది ఆమె లేదా ఆమె పార్టీ అనుకుంటున్నంత ఎక్కువేమీ కాదు. అలా అని మార్క్సిస్టులు కోరుకునేటంత తక్కు వ కూడా కాదు. ప్రస్తుతానికయితే ఆమె సురక్షితంగానే ఉన్నారు. మార్క్సిస్టుల పరిస్థితి ఆశాజనకంగా లేదు. వాళ్లు అధికారంలో ఉండగా మమతా బెనర్జీ వారికి ముప్పుగా ఉండేది. వాళ్లిప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు, వారి భవిష్యత్తుకు ముప్పు ఇప్పుడు బీజేపీ నుంచే. కోల్‌కతాలోని బ్రిగేడ్ పెరేడ్ గ్రౌండ్లో నరేంద్రమోడీ సభ విజయవంతం కావడంలోని అర్థం అదే. ఇండోర్ స్టేడియం నిండిపోతేనే బీజేపీ నేతలు ఒకరినొకరు అభినందించుకుని ఎంతో కాలంకాలేదు. ఒకప్పుడు ఎర్రజెండా ఆధిపత్యం వహించిన చోట ప్రస్తుతం మమత ఆకుపచ్చ జెం డాలు రెపరెపలాడుతున్నాయి. అక్కడే ఈ ఎన్నికల సీజన్లో కాషాయం కూ డా కనిపిస్తోంది. ఒక సభకు హాజరైన వారి సంఖ్యను లెక్కగట్టడానికి ఐన్స్టీన్లు కానవసరం లేదు. టెలివిజన్ కెమెరాలు ఆ పని చేసిపెడతాయి. మమతకు బీజేపీ గురించి బెంగలేదు. బెంగపడాల్సింది బెంగాల్ వామపక్షాలే. త్వరితగతిని అవి తమను తాము పునరుజ్జీవింప చేసుకోలేకపోతే తమ రాజకీయ ‘సామ్రాజ్యాన్నంతటినీ’ పోగొట్టుకుంటాయి. అలా అని మనమేమీ నాటకీయంగా ముందుకు గంతేయడం గురించి మాట్లాడటం లేదు. బీజేపీ ఈ ఏడాది ఎన్నికల్లో ఎన్నో సీట్లు గెలవబోవడం లేదు. ఓట్లను లెక్కింపు సమయంలో దానికి నేడు పెరుగుతున్న మద్దతు స్పష్టమవుతుంది. రాజకీయ పార్టీ కొంతవరకు ఒక సైన్యం లాగా ముందుకు కదులుతుంది. కమాండర్లు ప్రతికూల పరిస్థితుల్లో సైన్యాన్ని కలిపి ఉంచలేకపోతే ఓటమి కుప్పుకూలిపోవడం తథ్యం. పురోగమనం ఎప్పుడూ దశల వారీగా మాత్రమే జరుగుతుంది. మార్క్సిస్టులు గతితర్కంపై ఆధారపడే వృద్ధి చెందుతారు. కాబట్టి వాళ్లకు ఈ విషయం సులువుగానే అర్థమవుతుంది. బెంగాల్ కాంగ్రెస్‌కు బెంగాల్‌తో సంబంధం తెగిపోయింది. మహా అయితే కాంగ్రెస్ చేస్తున్నదేమైనా ఉందంటే రాయిని విసిరి ఆడే తొక్కుడు బిళ్ల ఆటలో లాగా ఒక గడి నుంచి మరొక గడికి గెంతడమే. కాంగ్రెస్ రాజ్యసభ ఎన్నికల్లో వామపక్షాలతో చేతులు కలపడంలో సఫలం కాలేదు. అదే సమయంలో ఎలాంటి షరతుల మీదైనా ఎన్నికల పొత్తుకు సిద్ధమేనంటూ తృణమూల్‌కు తెరచాటు సందేశాలను పంపింది. ఏదో సామెత చెప్పినట్టు బిచ్చగాళ్లకు ఎంచుకునే స్వేచ్ఛ ఉండదు. ఈ ఏడాది ఎన్నికల్లో తమ పార్టీలు గెలిచే అవకాశం ఉన్నదని కాంగ్రెస్, వామపక్ష ఎమ్మెల్యేలు విశ్వసిస్తే అసలు ఫిరాయింపులు జరిగేవే కావు.