జిల్లా ఉత్తమ హెల్త్ అసిస్టెంటుగా రమేష్
తిమ్మంపల్లి(యల్లనూరు) :
జిల్లా ఉత్తమ హెల్త్ అసిస్టెంట్‌గా తిమ్మంపల్లి ప్రభుత్వ పీహెచ్‌లో పనిచేస్తున్న రమేష్‌ను జిల్లా వైద్యాధికారులు ఎన్నిక చేశారు. ఇందులో భాగంగానే అనంతపురంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి వెంకటరమణ రూ.వెయ్యి గిఫ్ట్ ఓచర్‌తో పాటు ప్రశంసాపత్రాన్ని అందచేశారు. ఈ సందర్భంగా తిమ్మంపల్లి వైద్యాధికారి వినయ్ మాట్లాడుతూ పీహెచ్ పరిధిలో రమేష్‌కు అవార్డు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు.
సీనియర్ అసిస్టెంట్ నజీర్‌హుస్సేన్, హెల్త్ సూపర్ వైజర్ రాము, ఎంపీహెచ్ఈఓ శ్రీనివాసరెడ్డి, హెల్త్ అసిస్టెంట్ భాస్కర్, ఫార్మాసిస్ట్ బాబురావు తదితరులు రమేష్‌కు అభినందనలు తెలిపారు. చేసిన సేవకు గుర్తింపు రావడంతో చాలా సంతోషంగా ఉందని రమేష్ అన్నారు.