Best Performance award
-
రామ్‌కో సిమెంట్స్ విండ్ఫార్మ్కు అవార్డ్
హైదరాబాద్: రామ్‌కో సిమెంట్స్‌కు చెందిన విండ్ ఫార్మ్ (పవన విద్యుత్ పార్క్)కు ‘ఉత్తమ పనితీరు చూపిస్తున్న విండ్‌ఫార్మ్’గా విండ్ పవర్ అసోసియేషన్ అవార్డ్ ప్రకటించింది. 2 మెగావాట్ల సామర్థ్యానికి మించిన విభాగంలో ఈ అవార్డ్‌కు ఎంపిక చేసింది. జోన్ 1, జోన్ 2 పరిధిలోని తమిళనాడులో రామ్‌కో సిమెంట్స్‌కు చెందిన పవన విద్యుత్ పార్క్‌లను అవార్డ్‌కు పరిగణనలోకి తీసుకుంది. రామ్‌కో సిమెంట్స్ 1992–93లోనే పర్యా వరణ అనుకూల ఇంధనానికి ప్రాధాన్యత ఇచ్చింది. పవన విద్యుత్ సామర్థ్యం 4 మెగావాట్ల నుండి ఇప్పుడు 166 మెగావాట్లకు చేరింది. రామ్‌కో సిమెంట్స్‌కు ఉన్న మొత్తం క్యాపిటివ్ పవర్లో పునరుత్పాదక ఇంధన వాటా 45 శాతానికి చేరుకుంది. -
పిట్ట కొంచెం... డ్యాన్స్ ఘనం
సాక్షి, సీతమ్మధార(విశాఖపట్నం) : పిట్ట కొంచెం..డ్యాన్స్ ఘనం అంటే ఆశినిచంద్రెడ్డి.మూడేళ్ల వయసులోనే కూచిపూడి నృత్యంలో తనకుంటూ ప్రత్యేకత చాటుకుంటోంది. ఇప్పటికే అనేక ప్రదర్శనలిస్తూ మెప్పిస్తోంది. రెండేళ్ల వయసులోనే టీవీలో వచ్చే డ్యాన్స్ షోలు ఆసక్తిగా చూసేది. రానురానూ డ్యాన్స్ ప్రొగ్రామ్స్ పెట్టమని గొడవ చేసేది. నాట్యంలో ఆసక్తిని గమనించిన తల్లిదండ్రులు శ్వేతరెడ్డి, చందు కూచిపూడి నేర్పించాలని నిర్ణయించుకున్నారు. నాట్య గురువు బేత సత్యనారాయణ సమక్షంలో కూచిపూడి శిక్షణ పొందుతోంది. ఇప్పటికే నగరంలో చాలా స్టేజ్ షోలిచ్చి ఆకట్టుకుంది. ఆమె స్టేజ్‌పై కాళ్లకు గజ్జెలు కట్టుకుని డ్యాన్స్ చేస్తూంటే ఆహూతులంతా కళ్లార్పకుండా చూస్తారు. రూపం..హావభావాలు... పాటకు తగ్గట్టు, లయ తప్పకుండా నాట్యం చేస్తుండడం ఆ చిన్నారి ప్రత్యేకత. ఇప్పటికే సామర్లకోట, విజయవాడ, అన్నవరంలోని దేవస్థానంలో, అలాగే భీమేశ్వరస్వామి ఆలయం కూచుపూడి నాట్య ప్రదర్శన చేసి మెప్పిచ్చింది. ఎన్నో అవార్డులు, ప్రశంసలు అందుకుంది. భవిష్యత్తులో ఆశిని ఉత్తమ నాట్యకారిణిగా గుర్తింపు పొందాలని ఆశిస్తున్నట్టు తల్లిదండ్రులు పేర్కొన్నారు. -
ఓఎన్జీసీ రాజమండ్రి అసెట్‌కు ప్రతిష్టాత్మక గుర్తింపు
హైదరాబాద్: ఓఎన్జీసీ రాజమండ్రి అసెట్ మరోసారి బెస్ట్ పెర్ఫార్మెన్స్ పురస్కారాన్ని సొంతం చేసుకుంది. ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్‌లోని సంస్థ ప్రధాన కార్యాలయంలో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఈ పురస్కార ప్రదానం జరిగింది. రాజమండ్రి అసెట్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్- అసెట్ మేనేజర్ పాసల కృష్ణారావుకు సంస్థ సీఎండీ డీకే షరాఫ్ ట్రోఫీని, ప్రశంసా పత్రాన్ని అందజేశారు. 2011-12లో ఈ అవార్డును నెలకొల్పారు. ఆ సంవత్సరమే రాజమండ్రి అసెట్ దీన్ని దక్కించుకుంది. 2012-13లో రన్నరప్‌గా నిలిచింది. తాజాగా 2013-14 ఏడాదికి గాను తిరిగి అవార్డు అందుకుంది. అధిక ఒత్తిడి, ఉష్ణోగ్రత తదితర ప్రతికూల పరిస్థితుల్లో సైతం కంపెనీ గణనీయమైన స్థాయిలో ఆయిల్, గ్యాస్, విలువ ఆధారిత ప్రోడక్టుల ఉత్పత్తి సాధించింది.