హైదరాబాద్: రామ్‌కో సిమెంట్స్‌కు చెందిన విండ్ ఫార్మ్ (పవన విద్యుత్ పార్క్)కు ‘ఉత్తమ పనితీరు చూపిస్తున్న విండ్‌ఫార్మ్’గా విండ్ పవర్ అసోసియేషన్ అవార్డ్ ప్రకటించింది. 2 మెగావాట్ల సామర్థ్యానికి మించిన విభాగంలో ఈ అవార్డ్‌కు ఎంపిక చేసింది.
జోన్ 1, జోన్ 2 పరిధిలోని తమిళనాడులో రామ్‌కో సిమెంట్స్‌కు చెందిన పవన విద్యుత్ పార్క్‌లను అవార్డ్‌కు పరిగణనలోకి తీసుకుంది. రామ్‌కో సిమెంట్స్ 1992–93లోనే పర్యా వరణ అనుకూల ఇంధనానికి ప్రాధాన్యత ఇచ్చింది. పవన విద్యుత్ సామర్థ్యం 4 మెగావాట్ల నుండి ఇప్పుడు 166 మెగావాట్లకు చేరింది. రామ్‌కో సిమెంట్స్‌కు ఉన్న మొత్తం క్యాపిటివ్ పవర్‌లో పునరుత్పాదక ఇంధన వాటా 45 శాతానికి చేరుకుంది.
Comments
Please login to add a commentAdd a comment