హైదరాబాద్: రామ్‌కో సిమెంట్స్ ఢిల్లీలో జరిగిన 6వ విడత సీఐఐ డీఎక్స్ (డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్) అవార్డుల కార్యక్రమంలో ఆపరేషనల్ ఎక్సలెన్స్ పురస్కారాన్ని దక్కించుకుంది. అత్యంత వినూత్న టాప్ 10 ప్రాజెక్టుల జాబితాలో ‘రామ్‌కో బిజినెస్ ఇంటెలిజెన్స్’ ప్రాజెక్టు ఒకటిగా నిల్చింది. ఆపరేషనల్ ఎక్సలెన్స్ కేటగిరీలో పురస్కారం దక్కించుకున్న ట్లు సీఈవో ఏవీ ధర్మకృష్ణన్ తెలిపారు.
అవార్డును కంపెనీ వైస్ ప్రెసిడెంట్ జి. మురుగేశన్, డిప్యుటీ జీఎంలు పీఎల్ సత్యనారాయణ, అబ్దుల్ బాసిత్ అందుకున్నారు. సీఐఐ–టాటా కమ్యూనికేషన్స్ సెంటర్ ఫర్ డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ నిర్వహించిన కార్యక్రమంలో ఈ ఏడాది 300 పైగా కంపెనీలు ప్రతిష్టాత్మక పురస్కారాల కోసం పోటీపడ్డాయి.
Comments
Please login to add a commentAdd a comment