ఓఎన్‌జీసీ రాజమండ్రి అసెట్‌కు ప్రతిష్టాత్మక గుర్తింపు | prestigious recognition to ONGC rajahmundry asset | Sakshi
Sakshi News home page

ఓఎన్‌జీసీ రాజమండ్రి అసెట్‌కు ప్రతిష్టాత్మక గుర్తింపు

Published Sun, Aug 17 2014 12:22 AM | Last Updated on Sat, Sep 2 2017 11:58 AM

ఓఎన్‌జీసీ రాజమండ్రి అసెట్‌కు ప్రతిష్టాత్మక గుర్తింపు

ఓఎన్‌జీసీ రాజమండ్రి అసెట్‌కు ప్రతిష్టాత్మక గుర్తింపు

హైదరాబాద్: ఓఎన్‌జీసీ రాజమండ్రి అసెట్ మరోసారి బెస్ట్ పెర్ఫార్మెన్స్ పురస్కారాన్ని సొంతం చేసుకుంది. ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్‌లోని సంస్థ ప్రధాన కార్యాలయంలో జరిగిన స్వాతంత్య్ర  దినోత్సవ వేడుకల్లో ఈ పురస్కార ప్రదానం జరిగింది.  రాజమండ్రి అసెట్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్- అసెట్ మేనేజర్ పాసల కృష్ణారావుకు సంస్థ సీఎండీ డీకే షరాఫ్ ట్రోఫీని, ప్రశంసా పత్రాన్ని అందజేశారు.  
 
2011-12లో ఈ అవార్డును నెలకొల్పారు. ఆ సంవత్సరమే రాజమండ్రి అసెట్ దీన్ని దక్కించుకుంది. 2012-13లో రన్నరప్‌గా నిలిచింది. తాజాగా 2013-14 ఏడాదికి గాను తిరిగి అవార్డు అందుకుంది. అధిక ఒత్తిడి, ఉష్ణోగ్రత తదితర ప్రతికూల పరిస్థితుల్లో సైతం కంపెనీ గణనీయమైన స్థాయిలో ఆయిల్, గ్యాస్, విలువ ఆధారిత ప్రోడక్టుల ఉత్పత్తి సాధించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement