ప్రపంచంలో ఎక్కువ మంది సందర్శించే అద్భుతాలు మనవే!
ప్రపంచ వారసత్వ ప్రదేశాలకు గుర్తింపునిచ్చే యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్‌లో అత్యధికంగా భారతీయ సందర్శనీయ స్థలాలే ఉన్నాయి. దీనికి కారణం ప్రపంచంలో అతి ఎక్కువ మంది సందర్శిస్తున్న దర్శనీయ స్థలాలలో ఈ ప్రాచీన వారసత్వ సంపద ప్రముఖంగా నిలిచాయి.ఖజరహో శిల్పాలుదేశంలోనేకాదు ప్రపంచంలోనే ఎన్ని చారిత్రక కట్టడాలు ఉన్నా ఖజరహో శిల్పకళకు మరేదీ సాటిరాదని మరోసారి రుజువైంది. మధ్య ప్రదేశ్ ఛత్తర్పూర్ జిల్లాలో కొలువై ఉన్న ఖజరహోను ప్రపంచంలో ఎక్కువ మంది సందర్శించే కళా వైభవం గల స్థలంగా పేరొందింది. శిల్ప సోయగాలతో ఆకట్టుకునే ఖజరహో గ్రూప్ ఆప్ మాన్యుమెంట్స్ గురించి కళ్లారా చూడాల్సిందే తప్ప ఒక్క మాటలో వివరించలేం. అలాంటి ఖజరహో శిల్పాలతో పాటు బుద్ధిస్ట్ మాన్యుమెంట్స్, సాంచీ అండ్ రాక్స్ షెల్టర్స్ ఆఫ్ భీమ్బెట్కా కూడా ఈ జాబితాలో ఉన్నాయి.ఎల్లోరా గుహలుమహారాష్ట్రాలోని ఎల్లోరా, అజంతా, ఎలిఫెంటా గుహలు, ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్‌తో పాటు విక్టోరియన్ అండ్ ఆర్ట్ డెకో కూడా ఈ జాబితాలో ఉన్నాయి.నేషనల్పార్క్పింక్ సిటీగా పేరొందిన జైపూర్ సిటీ, రాజస్థాన్ హిల్ ఫోర్ట్స్, కొలడియో నేషనల్పార్క్. జంతర్ మంతర్‌ను ప్రపంచంలో ఎక్కువ మంది సందర్శించిన స్థలాలుగా పేరొందాయి. వెన్నెల దీపంయునెస్కో హెరిటేజ్ సైట్స్‌లో ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది సందర్శించిన జాబితాలో నాల్గవ స్థానంలో తాజమహల్. దీంతో పాటు ఆగ్రా ఫోర్ట్, ఫతేపూర్ సిక్రీ ఉన్నాయి.రాణీకి వావ్గుజరాత్లోని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్‌లో రాణీ కి వావ్, ది హిస్టోరిక్ సిటీ ఆఫ్ అహ్మదాబాద్ అండ్ చంపనీర్–పవగడ్, ఆర్కియలాజికల్ పార్క్ లు ఉన్నాయి.