తిరుపతి ఎయిర్‌పోర్టుకు అవార్డు
ప్రపంచ పర్యాటక దినోత్సవం సదర్భంగా తిరుపతి విమానాశ్రయానికి బెస్ట్ టూరిజం ఫ్రెండ్లీ అవార్డు లభించినట్లు తిరుపతి సబ్ కలెక్టర్ హిమాంశు శుక్లా మంగళవారం ఉదయం తెలిపారు. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్బంగా తిరుపతిలో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో 2కే రన్ నిర్వహించారు. తిరుపతి రామానుజ సర్కిల్ నుంచి శిల్పారామం వరకూ ఈ రన్ కొనసాగింది. ఈ సందర్భంగా సబ్‌కలెక్టర్ మాట్లాడారు.