ట్రైలర్ అండ్ ఎర్రర్
జైలు గండం నుంచి బయట పడ్డాక కండల వీరుడు జై భజరంగ భళి అంటున్నారు. ఆయన కొత్త సినిమా ‘భజరంగీ భాయ్‌జాన్’ ట్రైలర్, పోస్టర్ రెండూ అభిమానులకు తెగ నచ్చేశాయి. మెడలో ఆంజనేయస్వామి గదతో పోలిన లాకెట్‌తో దర్శనమిచ్చారు. తన కుటుంబం నుంచి తప్పిపోయిన ఓ పాపను ఎలా మళ్లీ కలిపే పాత్రలో సల్మాన్ నటిస్తున్నారని ఈ ప్రచార చిత్రం చూస్తే తెలుస్తోంది. కానీ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖ్ మాత్రం ఈ ట్రైలర్ విషయంలో పెదవి విరుస్తున్నారు. సినిమాలో తనది చాలా ముఖ్యమైన పాత్ర అయినా ట్రైలర్లో తక్కువ సేపు చూపించారని ఈ చిత్ర బృందం దగ్గర నవాజ్ తన అసంతృప్తిని వెల్లిబుచ్చారట.