'గుట్ట'లో రోడ్డు విస్తరణ పనులకు శ్రీకారం
నల్లగొండ జిల్లా యాదగిరిగుట్ట పట్టణం అభివృద్ధి పనుల్లో భాగంగా రోడ్డు విస్తరణ పనులకు సోమవారం శ్రీకారం చుట్టారు. గుళ్లపల్లి నుంచి గుట్ట వైకుంఠ ద్వారం వరకు రోడ్డు పనులకు అధికారులు మార్కింగ్ చేశారు. కాగా, రోడ్డు విస్తరణ కారణంగా షాపులు, ఇళ్లు కోల్పోయే బాధితులకు ముందుగా పరిహారం ఇచ్చిన తర్వాతే పనులు మొదలుపెట్టాలని డీసీసీ అధ్యక్షుడు భిక్షమయ్య గౌడ్ డిమాండ్ చేశారు.