కాంగ్రెస్ పార్టీకి డబుల్ షాక్
కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి శుక్రవారం షాక్ మీద షాక్ తగిలింది. కాంగ్రెస పార్టీ సీనియర్ నేతలు, మాజీ మంత్రులు బూటా సింగ్, సత్పాల్ మహారాజ్‌లు శుక్రవారం ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఉత్తరాఖండ్ రాష్ట్రానికి చెందిన సత్తాల్ మహారాజు శుక్రవారం న్యూఢిల్లీలో బీజేపీ అధ్యక్షుడు రాజనాథ్ సింగ్ సమక్షంలో బీజేపీలో చేరారు.
ఆయనతోపాటు ఉత్తరాఖండ్ రాష్ట్రానికి చెందిన మరో10 మంది ఎమ్మెల్యేలు కూడా బీజేపీలో చేరారు. ఆ పరిణామంతో ఉత్తరాఖండ్‌లోని కాంగ్రెస్ పార్టీ తీవ్ర సంక్షోభంలో చిక్కకుంది. ఉత్తరాఖండ్‌లోని గఢ్వాల్ లోక్‌సభ స్థానానికి సత్పాల్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఎన్నికలలో ఓటమి ఎరుగని ధీరుడిగా సత్పాల్ పేరు పొందారు.
గతంలో కాంగ్రెస్ హయాంలో రైల్వే శాఖ సహాయ మంత్రిగా పని చేశారు. అలాగే బూటా సింగ్ సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ)లో చేరనున్నారు. ఆయన రాజస్థాన్‌లోని జాలోర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎస్పీ పార్టీ తరఫున ఎన్నికల బరిలో నిలవనున్నారు. గతంలో బూటా సింగ్ కూడా కేంద్ర హోం శాఖ మంత్రిగా పని చేసిన సంగతి తెలిసిందే.