బిజ్జల దేశ చరిత్రతో...
భక్తితో కలం పట్టి శివ నామస్మరణ చేస్తూ వచనా కవిత్వాన్ని రాసిన వ్యక్తి కత్తి పట్టి కదం తొక్కితే? శత్రువుల గుండెల్ని చీల్చి యోధుడిగా మారి చరితార్థుడైన ధీమంతుడి కథతో నిర్మిస్తున్న చిత్రం ‘మాచి దేవ’. సాయికుమార్, వినోద్‌కుమార్, యమున, చారులత ఇందులో ముఖ్య తారలు. శ్రీమతి ద్వారంపూడి సుశీల సమర్పణలో శ్రీ షణ్ముఖ ఆర్ట్స్ పతాకంపై నంది కామేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో ద్వారంపూడి శివశంకర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
నిర్మాత మాట్లాడుతూ-‘‘ కాకతీయ సామ్రాజ్యపు ఏలుబడిలో ఉన్న బిజ్జల దేశపు చరిత్రే ఈ చిత్రం. థ్రిల్లర్ మంజు నేతృత్వంలో సాయికుమార్‌పై చిత్రీకరించిన గుర్రాల ఫైటు, వందమందితో పోరాట దృశ్యాలు హైలైట్. ప్రస్తుతం రీ రికార్డింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని డిసెంబర్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: హంసలేఖ, ఫొటోగ్రఫీ: రెమో.