bike bomb
-
జైషే ఉగ్ర కుట్ర భగ్నం
జమ్మూ: స్వాతంత్రదినోత్సవం రోజునే బైక్బాంబును పేల్చి విధ్వంసం సృష్టించాలన్న జైషే మొహమ్మద్ ఉగ్రసంస్థ పన్నాగాన్ని భద్రతాబలగాలు విజయవంతంగా అడ్డుకున్నాయి. జమ్మూ జిల్లా కేంద్రంలో బాంబు పేలుడుకు సిద్ధమైన నలుగురు జైషే ఉగ్రవాదులు, వారికి సాయపడిన ఉత్తరప్రదేశ్ వాసిని, వారి సహాయకులను పోలీసులు అరెస్ట్చేశారు. డ్రోన్ల ద్వారా అందే ఆయుధాలను తోటి ఉగ్రవాదులకు చేరవేసే పనిలో బిజీగా ఉండగా వీరిని అరెస్ట్చేశారు. అయోధ్య రామజన్మభూమిపై నిఘా పెట్టాలని, దాడికి సంబంధించిన ఆయుధాలను అమృత్సర్లో డ్రోన్ ద్వారా అందుతాయని, పాక్లోని ఉగ్రవాది.. యూపీకి చెందిన సోనూ ఖాన్ అనే వ్యక్తిని ఆదేశించాడు. ఆ పని పూర్తిచేసేలోపే పోలీసులు ఖాన్ను అరెస్ట్చేశారు. -
పుణె స్టేషన్ వద్ద పేలుడు: ముగ్గురికి గాయాలు
మహారాష్ట్రలోని పుణె నగరంలో ఓ ఆలయానికి, పోలీసు స్టేషన్కు అత్యంత సమీపంలో జరిగిన బాంబు పేలుడులో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. పలు వాహనాలు మాత్రం ధ్వంసమయ్యాయి. పుణె నగరంలో అత్యంత ప్రసిద్ధి చెందిన దుర్గాశేఠ్ హల్వాయి గణేశ్ ఆలయం సమీపంలో ఈ పేలుడు సంభవించింది. ఆలయానికి అత్యంత సమీపంలో ఉన్న ఫరస్ఖానా పోలీసు స్టేషన్ పార్కింగ్ ప్రదేశంలో ఉన్న ఓ బైకులో ఈ బాంబును ఉంచారు. పోలీసులు వెంటనే ఈ ప్రాంతం మొత్తాన్ని మూసేసి, ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఇది ఉగ్రవాదుల చర్య కాదని మాత్రం చెప్పలేమని పోలీసు ఉన్నతాధికారులు అంటున్నారు.