మహారాష్ట్రలోని పుణె నగరంలో ఓ ఆలయానికి, పోలీసు స్టేషన్కు అత్యంత సమీపంలో జరిగిన బాంబు పేలుడులో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. పలు వాహనాలు మాత్రం ధ్వంసమయ్యాయి. పుణె నగరంలో అత్యంత ప్రసిద్ధి చెందిన దుర్గాశేఠ్ హల్వాయి గణేశ్ ఆలయం సమీపంలో ఈ పేలుడు సంభవించింది.
ఆలయానికి అత్యంత సమీపంలో ఉన్న ఫరస్ఖానా పోలీసు స్టేషన్ పార్కింగ్ ప్రదేశంలో ఉన్న ఓ బైకులో ఈ బాంబును ఉంచారు. పోలీసులు వెంటనే ఈ ప్రాంతం మొత్తాన్ని మూసేసి, ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఇది ఉగ్రవాదుల చర్య కాదని మాత్రం చెప్పలేమని పోలీసు ఉన్నతాధికారులు అంటున్నారు.
పుణె స్టేషన్ వద్ద పేలుడు: ముగ్గురికి గాయాలు
Published Thu, Jul 10 2014 4:31 PM | Last Updated on Sat, Sep 2 2017 10:06 AM
Advertisement
Advertisement